పోర్న్‌ వీడియోలు చూసి రాక్షసంగా.. ఓ చిన్నారి కేకలు వేయడంతో.. | Gujarat: Man Arrested For Molested 3 Minors, Killing 1 In 10 Day Span | Sakshi
Sakshi News home page

పోర్న్‌ వీడియోలు చూసి రాక్షసంగా మారిన వ్యక్తి.. ముగ్గురు మైనర్లను కిడ్నాప్‌ చేసి..

Published Tue, Nov 9 2021 4:17 PM | Last Updated on Tue, Nov 9 2021 5:21 PM

Gujarat: Man Arrested For Molested 3 Minors, Killing 1 In 10 Day Span - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌: పది రోజుల వ్యవధిలో ఓ కామాంధుడు అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ముగ్గురిలో ఒక చిన్నారి ఎక్కువగా కేకలు వేయడంతో ఆమెను హతమార్చాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గాంధీనగర్‌లోని వన్సజాదా గ్రామానికి చెందిన 26 ఏళ్ల విజయ్ ఠాకూర్ అనే వ్యక్తి ఇప్పటి వరకు 3, 5, 7 ఏళ్ల వయసున్న చిన్నారులను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిలో మూడేళ్ల చిన్నారి ఎక్కువగా అరవడంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఓ కల్వర్టులో పడేశాడు.  
చదవండి: Lakhimpur Kheri: లఖీంపూర్‌ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

తాజాగా గాంధీనగర్ జిల్లాలో నవంబర్‌ 4న తన ఐదేళ్ల కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి అదే రోజు ఏకాంత ప్రదేశంలో విడిచిపెట్టాడని ఓ మహిళ సంతేజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల తర్వాత, ఖత్రాజ్ చౌరస్తా సమీపంలోని ఇంటి నుంచి మూడేళ్ల బాలికను నవంబర్ 5 రాత్రి కిడ్నాప్ చేశారని పేర్కొంటూ సంతేజ్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. సిసిటివి ఫుటేజీల పోలీసులు విచారించగా ఈ కిడ్నాప్‌లు చేసింది విజయ్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి తేలింది.
చదవండి: Nalgonda: నిత్యపెళ్లి కొడుకు.. 19 మంది మహిళలను మోసం

నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఐదేళ్ల బాలికతో పాటు మూడేళ్ల బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఆ బాలిక ఎక్కువగా కేకలు వేయడంతో ఠాకూర్ ఆమెను హత్య చేసి, ఆపై అత్యాచారం చేశాడని నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కల్వర్టులో పడేసినట్టు తెలిపాడు. అంతేగాక పది రోజుల క్రితం ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. కాగా చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి పెళ్లయి ఓ కూతురు కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అతనికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు వల్ల వికృత మనస్తత్వం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో, హత్యా నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement