కోల్‌కతా: కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు మరువకముందే బెంగాల్‌లో మరో దారుణం వెలుగుచూసింది. వైద్యురాలి ఘటనపై సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోచింగ్ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.
బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు రావడంతో స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సంమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిందితుడిపైవ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.
కాగా బాలికను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment