తూర్పుగోదావరి: కార్పొరేటర్ కంపర రమేష్ హత్యకేసులో నిందితుడు చిన్నాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న కార్పోరేటర్ రమేష్‌ను కాకినాడలో అతి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేశాడు.
రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్యా వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్ అందుకు అంగీకరించ లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం ప్రకారం రమేష్‌పైకి కారుతో తొక్కించి చిన్నా కిరాతంగా హత్య చేశాడు.
చదవండి : (కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో నిందితుడు?)
Comments
Please login to add a commentAdd a comment