పుల్వామా ఉగ్రదాడి: సూత్రధారి హతం | Pulwama Terror Attack Mastermind Believed To Be Killed In Encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం

Published Mon, Mar 11 2019 12:08 PM | Last Updated on Mon, Mar 11 2019 4:38 PM

Pulwama Terror Attack Mastermind Believed To Be Killed In Encounter - Sakshi

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని వెల్లడిం‍చారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు పింగ్లిష్‌ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. 



కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ట్రాల్‌ ప్రాంతంలోని మిర్‌ మొహల్లా నివాసైన ఖాన్‌ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్‌ అహ్మద్‌ దార్‌ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశాడు. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్‌ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement