Jaishe Mohammed
-
జైషే మహ్మద్ ఉగ్రవాది తాజ్ మహ్మద్ కాల్చివేత!
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది, జైషే ఉగ్రవాది తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్ రైట్ హ్యండ్, సమీపబంధువు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా జైషే ముఠాలో అత్యంత కీలక మైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్‌కోట్, నగ్రోటా, ఉరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీల ప్రాత. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌవూఫ్ ప్రధాన సూత్రధారి. 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. -
అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా
వాషింగ్టన్ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడులకు పాల్పడడంలో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై భారీ నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చిన వారికి 5 లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సందర్భంగా సాజిద్ మిర్ సమాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ సాజిద్ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. -
24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: షోపియాన్ జిల్లాలోని అంషిపోరా గ్రామంలో జరిగిన భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతయామయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి. అంషిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరకోగా వారిపై కాల్పులు మొదలయ్యాయి. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులలకు దిగి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో ఎన్కౌంటర్ కావడం విశేషం. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో నిన్న ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో 24 గంటల్లో భారత బలగాలు ఆరుగురు టెర్రరిస్టులను కాల్చి చంపాయి. కాగా, నిన్న హతమైన జైషే కమాండర్ ఐఈడీ తయారీలో నిపుణుడిగా తెలిసింది. గతంలో జరిగిన పలు ఐఈడీ పేలుడు ఘటనల్లో అతడు బాధ్యుడిగా ఉన్నట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇక నాగర్-చిమ్మర్ ఎదురు కాల్పుల్లో ముగ్గరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. అమర్నాథ్ యాత్రికులపై దాడులే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం. అయితే, ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి.. ఏరివేస్తున్నామని కశ్మీర్ రెండో సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (పాక్ దుశ్చర్య, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి) #ShopianEncounterUpdate: . So far 03 #unidentified #terrorists killed. #Operation going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/ojP21idGuG — Kashmir Zone Police (@KashmirPolice) July 18, 2020 -
కాబూల్ కేంద్రంగా మరో కుట్రకు జైషే స్కెచ్
కాబూల్ : భారత్‌లో భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ యూనిట్లలో 400 మంది జైషే ఉగ్రవాదులను మోహరించింది. వారిని భారత్‌లో ఉగ్ర దాడులతో హోరెత్తించేందుకు కశ్మీర్ లోయకు పంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 12న చేపట్టిన ఆపరేషన్‌లో ఆప్ఘన్ దళాలు ఓ ఉగ్ర శిబిరంలో ఈ తరహా కార్యకలాపాలను గుర్తించారని సమాచారం. ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన ఉగ్రవాదులను విచారించడంతో ఆప్ఘన్లో దాదాపు ఈ తరహా క్యాంపులు ఆరు వరకూ ఉండవచ్చని భారత భద్రతా, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ శిబిరాల్లో జైషే మహ్మద్ 400 మంది ఉగ్రమూకను సంసిద్ధంగా ఉంచిందని ఢిల్లీ, కాబూల్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక మిషన్ అధికారులు పేర్కొన్నారు. ఖోస్థ నుంచి జలాలాబాద్ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు కాందహార్ ప్రావిన్స్‌లోని పాక్ సరిహద్దుల్లోని తాలిబాన్ యూనిట్లలో జైషే క్యాడర్‌ను మోహరించారని కాబూల్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన అధికారి వెల్లడించారు. మరోవైపు ఐఎస్ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే ఉగ్రవాదులను కూడా ఈ శిబిరాల్లోకి పంపారని అధికారులు చెబుతున్నారు. చదవండి : పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్ -
బాంబ్ ప్రూఫ్ హౌస్‌లో మసూద్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఆచూకీని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. బహవల్పూర్ జైషే ప్రధాన కేంద్రం వెనుక బాంబ్ ప్రూఫ్ నివాసంలో మసూద్ అజర్ బస చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. మసూద్‌కు సంబంధించిన కౌసర్ కాలనీ బహవల్పూర్, మదర్సా బిలాల్ హడబ్షి పతున్‌క్వా, మరర్సా లక్కి మర్వత్ బహవల్పూర్ అనే మూడు చిరునామాలనూ నిఘా సంస్థలు కనుగొన్నాయి. జైషే చీఫ్ అదృశ్యమయ్యాడని పాకిస్తాన్ పేర్కొంటున్న క్రమలో మసూద్ అజర్ కదలికలపై నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముంబై ఉగ్రదాడిలో ప్రమేయమున్న లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్తాన్ మసూద్ అజర్‌పై మాత్రం భారత్ పలు ఆధారాలు చూపినా నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. చదవండి : జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఏమైంది.? -
కశ్మీర్ జైషే చీఫ్ హతం
శ్రీనగర్: గణతంత్ర వేడుకలకు ముందు రోజు జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో తనకు తానే జైషే మొహమ్మద్‌కు కశ్మీర్ చీఫ్‌గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ ఉన్నాడు. గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడిలో యాసిర్ పాలుపంచుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాల్ ఎన్కౌంటర్లో మరణించిన ఖారీ ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని, అతను ఉగ్ర నియామకాలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను తరలించడం వంటివి చేస్తాడని తెలిపారు. గత సంవత్సరం పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థను నిర్వీర్యం చేయగలిగామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ అన్నారు. -
జైషే మహ్మద్ కుట్ర భగ్నం
శ్రీనగర్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున విధ్వంసం సృష్టించేందుకు జైషే మహ్మద్ పన్నిన కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోండనా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ గజ ఉగ్రవాదిని దోడా జిల్లాలో మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ తెలిపారు. కాగా, ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన డీఎస్పీ దావిందర్‌సింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనకు అందజేసిన శౌర్య పతకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉండగా, చొరబాట్ల కోసం, కేడర్‌ను బలోపేతం చేయడానికి ఉగ్ర సంస్థలు రహస్య సమాచార వ్యవస్థను, వాయిస్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (Vౌఐ్క)ను ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని డివిజన్లలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను అత్యవసర సేవలు అందించే బ్యాంకులు, ఆసుపత్రులు లాంటి సంస్థలకు మాత్రమే పునరుద్ధరించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఒమర్ అబ్దుల్లా నివాసం తరలింపు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న మరో ఇంటికి తరలించనున్నారు.ఆర్టికల్ 370 రద్దుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటినుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్ర కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడితో 40 మంది జవాన్లను బలితీసుకున్న జైషే మహ్మద్ భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక జైషే ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో భారీ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను అజీజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సహిల్ ఫరూక్ గోజ్రి, నజీర్ అహ్మద్ మిర్గా గుర్తించారు. జైషే శిబిరాన్ని భగ్నం చేయడం ద్వారా శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రదాడి ప్రమాదం నుంచి తప్పించారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి రిమోట్ కంట్రోల్ ఐఈడీతో పాటు 140 గిలెటిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లను పోలీసులు సీజ్ చేశారు. -
ఉగ్ర దాడికి జైషే భారీ కుట్ర..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మిలటరీ ఇంటెలిజెన్స్, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా సంస్థలు పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని హెచ్చరించడం పొంచి ఉన్న ఉగ్రముప్పు తీవ్రతను స్పష్టం చేస్తోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చనే దృష్టిలో ఉగ్ర సంస్ధల భారీ విధ్వంస రచనపై నిఘా సంస్ధలు గత పదిరోజులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్ర హెచ్చరికలు డార్క్ వెబ్‌లో పోటెత్తడంతో వీటి గుట్టుమట్లను తేల్చడం భద్రతా దళాలకు సంక్లిష్టంగా మారిందని అన్నారు. నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలను బేరీజు వేసిన భద్రతా దళాలు ఉగ్ర మూకల ప్రతిపాదిత టార్గెట్లను పసిగట్టి ముప్పును నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. ఉగ్ర మూకలు ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, నగరాలపై ఉగ్రదాడులతో విరుచుకుపడతారిని భావిస్తున్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు చేపట్టినప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్ర ముప్పును నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. -
బాలాకోట్‌లో మకాం వేసిన సూసైడ్ బాంబర్లు!
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు మొదలైనట్టు వెలువడిన వార్తా కథనాలు నిజమేననిపిస్తున్నాయి. సుమారు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని.. దానిలో భాగంగానే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరుచుకున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతోనే కశ్మీర్లో హింస చెలరేగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. (చదవండి : ‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు) ఇక కశ్మీర్లో దాడులకు పాల్పడేందుకు జైషే ఉగ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించారని నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే, ఉగ్రమూకల్ని ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని, వారికి ఎలాంటి అడ్డంకులు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. దాంతో 6 నెలలుగా అక్కడ మానవ సంచారం తగ్గిపోయింది. అయితే, భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ నెలరోజుల క్రితం మాట్లాడుతూ.. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని వ్యాఖ్యానించారు. మంచు కరుగుతున్న ప్రాంతాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తర భాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ రావత్ చెప్పారు. (చదవండి : భారత్ ప్రకటనపై పాక్ ఆగ్రహం) -
ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులో ఢిల్లీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమచారం అందించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్‌కు చెందిన బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. తొమ్మిది ప్రాంతాలతో సోదాలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలలో పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు. (చదవండి : ‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’) ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఇతర ప్రాంతాల వారి వివరాలు సేకరిస్తున్నారు. హోటళ్లలో తనిఖీలు చేపట్టి కొత్తగా గదులు బుక్ చేసుకున్నవారిపై ఆరా తీస్తున్నారు. అలర్ట్‌గా ఉండాలని 15 జిల్లాల డీసీపీలకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాలలో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నేషనల్ కాపిటల్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్‌కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
‘మసూద్ పాక్ జైలులో మగ్గలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడనే వార్తలను భారత అధికారులు తోసిపుచ్చారు. పాకిస్తాన్‌లోని ఏ జైలులోనూ మసూద్ అజర్ ఎన్నడూ లేడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మసూద్ ప్రస్తుతం అజ్ఞాతంలో గడుపుతున్నాడని, ఆయన చివరిసారి బహవల్పూర్లోని జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ మర్కజ్ సుభానల్లాకు వచ్చాడని ఆ వర్గాలు తెలిపాయి. మసూద్ ఆరోగ్యం సైతం మెరుగుపడిందని, అయితే ఆయన జనబాహుళ్యంలోకి రావడం లేదని పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి సాయుధ దళాలను మోహరించిన క్రమంలో మసూద్ కదలికలపై సమాచారం బహిర్గతం కావడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ సహకారంతో ఉగ్ర మూకలు స్కెచ్ వేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!
శ్రీనగర్: కశ్మీర్లో ఈద్ పండుగ సంబరాలపై లేదా స్వాతంత్య్ర దినోత్సవాలపై భారీ దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారనీ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత ప్రభుత్వంపై నిందను మోపేందుకు మసీదుల్లో ప్రార్థనలపై ఈ దాడులు జరగొచ్చని తెలిపాయి. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూర్ అజార్ ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. ఉగ్రవాద దాడి జరిపి వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) జైషే మహ్మద్‌కు సూచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం సరిగ్గా వారం క్రితం సంచలన, చారిత్రక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా పాక్‌కు ముస్లిం దేశాలు సహా ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో, తాజాగా ఉగ్రవాద దాడికి దిగి, భారత్‌కు చెడ్డపేరు తీసుకురావాలని అనుకుంటోందని నిఘా వర్గాలు తెలిపాయి. బనిహల్, పిర్ పంజాల్ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనీ, రాజౌరీ లేదా పూంచ్ జిల్లాల్లోకి వాళ్లు చొరబడి ఉంటారని చెప్పాయి. వ్యాపారులకు వెయ్యి కోట్ల నష్టం.. శ్రీనగర్‌లో ఆంక్షల కారణంగా వారం రోజుల్లో వ్యాపారులు రూ. వెయ్యి కోట్లు నష్టపోయుంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆంక్షల కారణంగా ప్రజలెవ్వరూ బటయకు రాకపోవడంతో రోజుకు రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యుడొకరు చెప్పారు. పండుగ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లు ఆదివారం తెరిచే ఉన్నాయి. -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర నీడలు
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రలో యాత్రికులను టార్గెట్ చేస్తూ అదును చూసి విరుచుకుపడాలని ఉగ్రవాదులు సన్నద్ధంగా ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా సంస్థలు పసిగట్టాయి. జులై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్కోడ్ ఆధారిత స్లిప్‌లు జారీ చేయనున్నారు. యాత్రికుల భద్రతను పెంచేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పారామిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు జమ్ము కశ్మీర్లో భద్రతా అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఏమైంది.?
న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్ అజర్ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. కాగా, ఓ స్ధానిక చానెల్ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్ తరచూ డయాలసిస్ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్ యూజర్ అషన్ ఉలా మియాఖల్ పోస్ట్ చేశారు. -
సిన్హా వ్యాఖ్యలతో ఇరకాటంలో కాషాయ పార్టీ
పట్నా : కేంద్ర మంత్రి, హజారిబాగ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్‌ను మసూద్ అజర్‌జీ అని సంభోదించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ‘దేశ భద్రతకు ఇది మైలురాయి వంటిది..మేం చేపట్టిన ప్రయత్నాలు నెరవేరి మసూద్ అజర్‌జీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింద’ని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. బిహార్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మసూద్ అజర్‌ను సాహెబ్‌గా పిలిచిన బిహార్ మాజీ సీఎం, మహాకూటమి నేత జితన్ రాం మాంఝీని బీజేపీ మందలించిన కొద్ది గంటల్లోనే సిన్హా నోరుజారడం గమనార్హం. మన్మోహన్ సింగ్ హయాం నుంచి మసూద్ అజర్ సాహెబ్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించే ప్రయత్నాలు సాగినప్పటికీ ఇప్పటికి ఆ నిర్ణయం వెలువడటం కాకతాళీయమేనని జితన్ రాం మాంఝీ వ్యాఖ్యానించారు. మాంఝీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అభ్యంతరం లేవనెత్తగా తాజాగా తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మసూద్‌జీ అంటూ సంభోదించడం ఆ పార్టీని ఇరకాటంలో పడవేసింది. -
గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మసూద్ : నేడు ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కనుంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం లాంఛనంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. భారత్ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనాతో నెరపిన లాబీయింగ్ ఫలించడం సానుకూల ఫలితానికి దారితీసింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతోనే జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైందని అధికారులు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో దాడి నేపధ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామాం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
భారత్‌లో దాడులకు జైషే, ఐఎస్‌ల భారీ కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైషే మహ్మద్, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా తాజా దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి. ఆప్ఘనిస్తాన్‌లో జైషే, ఐఎస్ సభ్యుల మధ్య ఐఎస్ఐ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులను ఐఎస్ఐ ప్రోత్సహిస్తోందని ఈ నివేదికలో నిఘా సంస్ధలు పేర్కొన్నాయి. కాగా జైషే మహ్మద్, తాలిబాన్ టెర్రరిస్టులు దీర్ఘకాలంగా ఆప్ఘనిస్తాన్‌లో నాటో సైనిక దళాలతో తలపడుతున్నారని, తాము ఈ పరిణామాలను చాలాకాలంగా గమనిస్తున్నామని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్, జైషే మహ్మద్ ఉగ్రవాదులను కలపడం ద్వారా భారత్‌లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మరోవైపు బాలాకోట్ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో మెరుపు దాడులు చేపట్టేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని అజర్ జైషే టాప్ కమాండర్లకు సూచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. జైషే టాప్ కమాండర్లతో భేటీ సందర్భంగా భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్టు తెలిపాయి. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
‘మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదే’
వాషింగ్టన్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అమెరికా పూర్తి బాసటగా నిలిచింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ను ప్రకటించేందుకు విస్పష్ట ఆధారాలు ఉన్నాయని అగ్రదేశం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక భేటీకి ఒక రోజు ముందు జైషే చీఫ్‌పై అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ భారత్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్ధావరంపై దాడి, జమ్మూ,యూరిలో సైనిక పోస్టులపై దాడులు, భారత పార్లమెంట్‌పై దాడి సహా ఇటీవల పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఉగ్రదాడికీ బాధ్యుడని భారత్ చెబుతోంది. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మూడు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో ఈ మూడు దేశాలు చేసిన పలు ప్రయత్నాలను చైనా నిలువరించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఈ ప్రతిపాదనను చైనా వీటో చేస్తూ వచ్చింది. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ మసూద్‌పై తీవ్ర చర్యలు చేపట్టే ప్రతిపాదనను ఈసారి చైనా అడ్డుకోబోదని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ భావిస్తున్నాయి. -
ఎన్కౌంటర్లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం
-
పుల్వామా ఉగ్రదాడి: సూత్రధారి హతం
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ దక్షిణ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్ మహ్మద్ భాయ్ కూడా ఉన్నాడని వెల్లడించారు. ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పింగ్లిష్ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
పుల్వామా దాడి వెనుక ‘మహ్మద్ భాయ్’
శ్రీనగర్ : పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ అహ్మద్‌ఖాన్ పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. కాగా, జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు గుర్తించారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
‘మెరుపు దాడులు గురి తప్పలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ శిబిరాలపై జరిగిన వైమానిక దాడులు లక్ష్యాలను గురితప్పకుండా సాగాయని భారత వాయుసేన స్పష్టం చేసింది. నిర్ధేశిత లక్ష్యాలపై గురిపెట్టిన బాంబు దాడుల్లో 80 శాతం మేర లక్ష్యాలను ఢీకొన్నాయని పేర్కొంటూ దీనికి ఆధారంగా శాటిలైట్ చిత్రాలను భారత వాయు సేన ప్రభుత్వానికి అందచేసినట్టు తెలిసింది. వైమానిక దాడులు లక్ష్యానికి దూరంగా సాగాయని, వాటి గురితప్పిందని సాగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంటూ వాయుసేన ఓ నివేదికను కేంద్రానికి సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ కురిపించిన బాంబు దాడులు పాకిస్తాన్‌కు ఎలాంటి నష్టం కలిగించలేదని, కొన్ని చెట్లు కూలిపోవడం మినహా ఎలాంటి విధ్వంసం జరగలేదని పాక్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ మీడియా సైతం సందేహాలు వ్యక్తం చేసింది. అయితే బాలాకోట్ మెరుపు దాడుల ప్రధాన టార్గెట్ అయిన జైషే ఉగ్రవాద శిబిరం వద్దకు అంతర్జాతీయ మీడియాను పాక్ అనుమతించలేదు. కాగా వైమానిక దాడుల తీరుతెన్నులను విశ్లేషిస్తూ శాటిలైట్ చిత్రాలతో కూడిన 12 పేజీల నివేదికను వాయుసేన భారత ప్రభుత్వానికి సమర్పించింది. బాలాకోట్ వైమానిక దాడులు విజయవంతమయ్యాయని చెప్పేందుకు ఈ ఆధారాలను మోదీ సర్కార్‌కు వాయుసేన సమర్పించినట్టు చెబుతున్నారు. దాడుల్లో భాగంగా మిరేజ్ 2000 యుద్ధవిమానాలు బాలాకోట్ జైషే శిబిరంపై ఇజ్రాయిల్ స్పైస్ 2000 ప్రిసిషన్ బాంబులతో విరుచుకుపడినట్టు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. ఈ బాంబులు నిర్ధేశిత భవనాల పైకప్పులను చిధ్రం చేసి లోపల భారీ పేలుడు సంభవించిందని, పైకి కనిపించని రీతిలో అంతర్గతంగా విధ్వంసం జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్ పీఓకేలో మెరుపు దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే. -
మసూస్ అజహర్‌కు పాకిస్తాన్ షాక్
-
భావల్పూర్ జైషే శిబిరానికి మసూద్ తరలింపు
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించాడనే వార్తలు వదంతులేనని పాక్ మీడియా కొట్టిపారేయగా, తాజాగా మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి తరలించినట్టు వార్తలొచ్చాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి భావల్పూర్లోని జైషే మహ్మద్ క్యాంప్‌నకు తరలించారు. మసూద్ అజర్ చనిపోయాడనే వదంతుల నేపథ్యంలో ఆయన తరలింపుపై సమాచారం గందరగోళానికి తావిస్తోంది. (మసూద్ సజీవం : పాక్ మీడియా) కాగా, మసూద్ అజర్ మరణించలేదని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ స్పష్టం చేసింది. మరోవైపు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది. -
మసూద్ సజీవం : పాక్ మీడియా
ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది. పాక్ ప్రభుత్వం నుంచి మసూద్ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని, ఈ క్షణంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధరి పేర్కొనడం గమనార్హం. కాగా, మసూద్ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు. (ఉగ్ర మసూద్ మృతి?) మరోవైపు మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. -
జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ మృతి?
-
జైషే చీఫ్ మసూద్ మృతి?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. పీఓకేలోని జైషే స్ధావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మసూద్ అజర్ మరణించాడని పాకిస్తాన్లో స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం మసూద్ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మసూద్ పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, మసూద్ అజర్ మృతి వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది పాకిస్తాన్ ప్రణాళికలో భాగమా.. లేక నిజంగానే మసూద్ మరణించాడా అనేది తేలాల్సి ఉంది. మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అతను మృతి చెందాడనే వార్త అనేక అనుమానాలకు తావిస్తోంది. (ఇక్కడ చదవండి: ‘జైషే క్యాంపులపై సర్జికల్ స్ట్రైక్స్ నిజమే’) -
‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను సోమవారం నాడు 12 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ ఎన్కౌంటర్లో మట్టుబెట్టామని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. ఈ వార్తను అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వార్తతోపాటు సైనిక కమాండర్ దుస్తుల్లో ఉన్న కమ్రాన్ ఫొటోను ఇండియా టుడేతోపాటు ఏబీపీ న్యూస్, జీ న్యూస్, ఇండియా టీవీ, అవుట్‌లుక్, ది ఎకనామిక్ టైమ్స్ ఇలా చాలా మీడియా సంస్థలు చూపించాయి. (ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం) అది మార్ఫింగ్ ఫొటో అని ఈ మీడియా సంస్థలు గుర్తించినట్లు లేదు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ జాన్ బాన్ జోవి ఫొటోను తీసుకొని ఒక తలను మాత్రం మార్ఫింగ్ ద్వారా కమ్రాన్‌గా మార్చారు. పాప్ సింగర్ ఒరిజనల్ ఫొటోతోని పోల్చి చూస్తే ఇది మార్ఫింగ్ ఫొటో అని సులువుగా తెలిసిపోతుంది. జోవి ఎడమ చేతి వాకీటాకీని పట్టుకొని ఉండగా ఆ చేతికి వాచీ కూడా ఉంటుంది. కుడిచేయి నడుము వరకు ఉంటుంది. ఆ రెండు చేతులే కాకుండా ఒంటి మీది ఉన్న దుస్తులు కూడా కమ్రాన్ ఫొటోలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. మార్ఫింగ్‌లో ఫొటో బ్యాక్ గ్రౌండ్‌ను, ఫొటో కలర్ షేడ్‌ను కాస్త మార్చారు. ఫొటోను మార్ఫింగ్ చేయడానికి ఫొటో సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తోపాటు అమెజాన్‌కు చెందిన ‘పోలీస్ సూట్ ఫొటో ఫ్రేమ్ మేకర్’ అనే యాప్‌ను వాడినట్లు స్పష్టం అవుతుంది. ఫొటో మార్ఫింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ఎన్కౌంటర్లో కమ్రాన్ హతమయ్యాడని సైనిక వర్గాలు ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహం ఫొటోలను విడుదల చేయక పోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
జైషే చీఫ్‌పై మారని చైనా తీరు
-
జైషే చీఫ్‌పై మారని చైనా తీరు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనను చైనా ఖండించినప్పటికీ ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షౌంగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి సుస్ధిరతలను పరిరక్షించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే అంశంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ను ఐరాస భద్రతా మండలి కౌంటర్-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. -
ఫేస్బుక్లో ఉగ్ర ఎర
శ్రీనగర్: ఫేస్బుక్ ద్వారా యువకుల్ని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న కశ్మీరీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రధానంగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కోసం పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆరోపణలపై కశ్మీర్లో ఒక మహిళను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉత్తర కశ్మీర్‌లోని బందీపూర్‌కు చెందిన షాజియా(30) అనే మహిళ ఫేస్బుక్ వేదికగా జిహాద్ కోసం పనిచేయాలని, ఆయుధాలు చేతపట్టాలని యువకులు లక్ష్యంగా పోస్టులు పెట్టిందని పోలీసులు గుర్తించారు. ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆధారంగా ఆమెను కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనంత్‌నాగ్‌కు చెందిన ఇద్దరు యువకులకు ఆమె ఆయుధాలు, తుపాకీ మేగజీన్లు అందించినట్లు విచారణలో తెలిసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షాజియా ఇన్మార్ఫర్‌గా నటిస్తూ పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని మిలిటెంట్లకు చేరవేసినట్లు భావిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. మిలిటెంట్లను పట్టుకోవడంలో సాయపడతానని చెప్పి ఆమెనే పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించేదని తెలిసింది. షాజియా ప్రవర్తనపై అనుమానంతో కొన్నాళ్లుగా పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. షాజియా నుంచి పోలీసులు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె ఇద్దరు సోదరుల్ని కూడా అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి.. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్ శిబిరంపై ఆదివారం జరిగిన మిలిటెంట్ల దాడిలో ఒక హవల్దార్ మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సాయుధులు శిబిరంపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారని అధికారులు తెలిపారు. కశ్మీర్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాకపురా అనే ప్రాంతంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. -
యూరి ఉగ్రదాడి సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి
లాహోర్ : భారత్‌లో పలు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజార్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్ చీఫ్ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనట్టు హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. యూరి దాడికి బాధ్యుడైన మసూద్ అజార్ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కథనం పేర్కొంది. రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది.కాగా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. భారత్, పాకిస్తాన్ సహా ఐరాస భద్రతా మండలి సభ్యుల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదని చైనా వాదిస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల జాబితాలో ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో దాడికి సంబంధించి జైషే చీఫ్ మసూద్‌ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్లో పేర్కొంది. గత ఏడాది నాగర్‌కోట దాడిలోనూ మసూద్ ఆజాద్ కీలకంగా వ్యవహరించడం గమనార్హం. -
భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత అజార్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమయింది. ఈ మేరకు భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతు ప్రకటించినప్పటికీ చైనా వీటో చేసింది. శుక్రవారం వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడారు. ‘ఈ తీర్మానంపై మండలిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న భారత్, పాక్లూ భిన్నాభిప్రాయంతో ఉన్నాయి’ అని అన్నారు. -
ఉగ్రమూకల టార్గెట్ పంద్రాగస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచిఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్ మాజీ బాడీ గార్డ్ మహ్మద్ ఇబ్రహీం దాడిని చేపట్టేందుకు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇబ్రహీంతో పాటు జైషే కేడర్ గురించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారం చేరవేశాయి. మే తొలివారంలో తొలుత జమ్మూ కశ్మీర్లో ప్రవేశించిన ఇబ్రహీం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని ఆ ప్రాంతంలోని జైషే శ్రేణులతో దాడులతో విరుచుకుపడేందుకు ధ్వంసరచనకు పూనుకున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే సీనియర్ సభ్యుడు ఉమర్ సైతం 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చుతున్నట్టు నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో మొత్తం ఆపరేషన్‌ను మసూద్ అజర్ డిప్యూటీ, భారత వ్యతిరేక కార్యకలాపల ఆపరేషనల్ కమాండర్ అస్గర్ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ఓ నివేదిక వెల్లడైన క్రమంలో నిఘా వర్గాల తాజా హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
ఎలిఫెంట్ - డ్రాగన్ డాన్స్ చేయాలి
బీజింగ్ : చైనీస్ డ్రాగన్, ఇండియన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాలే తప్ప కొట్టుకోకూడదని చైనా-భారత్ సంబంధాల గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోవాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అపుడే ద్వైపాక్షిక ఒప్పందాల అమలు జరుగుతుందన్నారు. పార్లమెంట్ సెషన్లో భాగంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సర కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల గురించి ప్రశ్నించగా... డోక్లాం వివాదం వంటి కొన్నిఅంశాల కారణంగా విభేదాలు తలెత్తినప్పటికీ, చైనా- భారత్ తమ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాయన్నారు. చైనా తన హక్కులు కాపాడుకునేందుకు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. చైనా-భారత్ కలిసి పనిచేస్తే ఒకటి ఒకటి కూడితే రెండు కాదు.. పదకొండు అవుతుందని చమత్కరించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి హిమాలయాలు కూడా అడ్డుగా నిలవలేవని వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న ఘర్షణలు, విభేదాలు మరచిపోయి ఇరు దేశాలు అనుమానాలకు బదులు, నమ్మకాన్ని పెంపొందించుకుని.. సహకారం అందించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు సమాధామివ్వడానికి నిరాకరించారు. బెల్ట్ రోడ్ అంశానికి సుమారు 100 దేశాలు మద్దతునిచ్చాయని, అయినప్పటికీ ఈ విషయమై మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు. ఆసియా దేశాలు, ఆఫ్రికా, చైనా, యూరప్‌ల మధ్య అనుసంధానానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారన్నారు. కాగా ఈ నిర్మాణంతో, చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ అనుసంధానమై ఉండటంతో భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో వ్యక్తమైన అభిప్రాయాలను చైనా వ్యతిరేకించడం, అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరకుండా అడ్డుపడటం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గతేడాది 73 రోజులపాటు భారత్- చైనాలు డోక్లాం కోసం బలగాలు మొహరించాయి. పలు చర్చల అనంతరం ఆగస్ట్ 28 తర్వాత చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్రమంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్(జేఈఎం)కు గట్టిదెబ్బ తగిలింది. కశ్మీర్లో ఆ సంస్థ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తంత్రయ్(47)ను భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని సాంబూరాలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో తంత్రయ్ మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు చెప్పారు. అతని అనుచరులుగా భావిస్తున్న మరో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి తంత్రయ్ మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. భద్రతా బలగాల వాహనశ్రేణిపై దాడిచేయడానికి కొందరు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమయ్యామని తెలిపారు. సాంబూరాలో అనుమానిత ఇళ్లనన్నింటిని తనిఖీచేస్తుండగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని తెలిపారు. శ్రీనగర్‌లో బీఎస్ఎఫ్ క్యాంప్‌పై దాడి తదితర ఘటనల్లో తంత్రయ్ హస్తముందని వైద్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నమే తంత్రయ్ మృతదేహాన్ని అతని సొంత గ్రామం త్రాల్లో ఖననం చేశారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో సూత్రధారి ఘాజి బాబాకు అత్యంత సన్నిహితుడైన తంత్రయ్ 2003లో ఓ కేసులో దోషిగా తేలడంతో శ్రీనగర్‌లో జైలు శిక్ష అనుభవించాడు. 2015లో పెరోల్‌పై బయటికొచ్చాడు. అప్పటి నుంచి సొంతూరు త్రాల్లోనే ఉంటూ జైషే మహమ్మద్ విస్తరణకు కృషిచేశాడు. ఈ ఏడాది జూలైలో ఆరిపాల్ ఎన్కౌంటర్లో ముగ్గురు జేఈఎం ఉగ్రవాదులు హతమైన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జమ్మూ కశ్మీర్ పోలీసులు తంత్రయ్ కోసం నిఘా పెంచారు. పొట్టివాడేగానీ... అతని ఎత్తు కేవలం నాలుగు అడుగుల 2 అంగుళాలు. కాలు సరిగా పనిచేయదు. కర్ర లేకుండా నడవలేడు. ఇన్నాళ్లూ తన తెలివితేటలతో తప్పించుకున్నాడు. కశ్మీర్లో పలు ఉగ్ర దాడుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలుపంచుకుని భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు తంత్రయ్. అక్టోబర్ 3న శ్రీనగర్ విమానాశ్రయం బయట బీఎస్ఎఫ్ శిబిరంపై, సెప్టెంబర్ 21న కశ్మీర్ మంత్రి నయీమ్ కాన్వాయ్‌పై జరిగిన దాడుల సూత్రధారి ఇతనే అని భావిస్తున్నారు. ‘గతంలో పలుమార్లు తంత్రయ్ త్రుటిలో తప్పించుకున్నాడు. పొట్టిగా ఉండటం వల్లే ఏదో ఒకరోజు తప్పకుండా చిక్కుతాడనుకున్నాం’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు జనంలో కలసిపోతారు. తంత్రయ్కు ఆ చాన్స్ లేదు. ప్రజల్లో కలసిపోయినా తన ఎత్తు, అంగవైకల్యం కారణంగా సులువుగా దొరికిపోతాడని పోలీసులు భావించారు. 25వతేదీ రాత్రి అతను దాక్కున్న ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో అక్కడి నుంచి పారిపోలేకపోయాడు. -
గర్ల్ ఫ్రెండే పట్టించింది..
సాక్షి, శ్రీనగర్: భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టిన జైషే మహ్మద్ కాశ్మీర్ చీఫ్ ఖలీద్ ఎన్కౌంటర్ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్ పతనానికి మోహం, కామం, వంచన ప్రేరేపించాయి. అతడిని పట్టుకుని హతమార్చే ప్రక్రియకు స్వయంగా ఖలీద్ మాజీ ప్రియురాలే భద్రతా దళాలకు సహకరించడం గమనార్హం. ఖలీద్‌ను మట్టుబెట్టడమే తనకు కావాలని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరితో 20 సంవత్సరాల వయసున్న అతని గర్ల్ ఫ్రెండ్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఖలీద్ కదలికలపై తాను సమాచారం ఇస్తానని మిగిలిన పని (హతమార్చడం) మీరు చక్కబెట్టాలని ఆమె పోలీస్ అధికారితో అన్నారు. ఉత్తర కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఖలీద్‌ను మట్టుబెట్టాయి. ఖలీద్‌పై ఆమెకు కోపం ఎందుకంటే..? ఉగ్రవాది ఖలీద్‌తో సన్నిహితంగా మెలిగిన అనంతరం గత ఏడాది తాను గర్భం దాల్చినట్టు బాధిత యువతి గుర్తించారు. ఈ వార్తతో తనలాగే ఖలీద్ సైతం సంతోషిస్తాడని ఆమె ఆశించారు. అయితే తన కడుపులో ఉన్న బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న అతడి సమాధానానికి ఆమె గుండె పగిలినంత పనైంది. దీంతో పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లి అక్కడే అబార్షన్ చేయించుకున్నారు. ఇక అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత లైంగిక అవసరాల కోసం తనను వాడుకుని, తర్వాత తనను మోసగించడం, కడుపులో పసికందునూ చిదిమివేయడం పట్ల ఖలీద్‌పై ప్రతీకారం కోసం రగిలిపోయారు. మరణశాసనం లిఖిస్తూ.. ఖలీద్‌పై పట్టరాని ఆగ్రహంతో రగిలిన బాధిత మహిళ పకడ్బందీగా తన మిషన్‌ను అమలు చేసేందుకు పూనుకున్నారు. ఎనిమిదేళ్లుగా ఖలీద్‌ను మట్టుబెట్టడంలో తృటిలో టార్గెట్ మిస్ అయిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం చేరవేయడం ద్వారా తన పనిసులువవుతుందని భావించి జమ్మూలో సీనియర్ పోలీస్ అధికారిని కలిసి తన ప్లాన్‌ను వివరించారు. గత కొన్నేళ్లుగా జైషే ఉగ్రదాడుల వెనుక సూత్రధారిగా ఉన్న ఖలీద్‌ను మట్టుబెట్టేందుకు ఇదే సరైన అవకాశమని పోలీసులూ తమ ఆపరేషన్‌కు పదును పెట్టారు.లవర్‌బాయ్ ఇమేజ్ను పొందిన ఖలీద్ చివరకు తాను హతమయ్యే సమయంలోనూ ముగ్గురు, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు గుర్తించారు. వంచన నుంచి ఎన్కౌంటర్ వరకూ... ఖలీద్ గర్ల్‌ఫ్రెండ్ ఇస్తున్న సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో అతడిని మట్టుబెట్టేందుకు వెళ్లిన భద్రతా దళాలకు అతడు ఝలక్ ఇస్తూ తప్పించుకు పారిపోయే వాడు. అయితే సోమవారం సొపోర్‌లో ఓ వ్యక్తిని కలుసుకునేందుకు వచ్చిన ఖలీద్‌ను అంతమొందించేందుకు భద్రతా దళాలు, పోలీసులు వేసిన స్కెచ్ నుంచి ఈసారి ఖలీద్ బయటపడలేకపోయారు. తనను చుట్టుముట్టిన దళాలపై ఖలీద్ కాల్పులకు తెగబడ్డా కేవలం నాలుగు నిమిషాల్లోనే ఎన్కౌంటర్ పూర్తి చేసిన అధికారులు కరుడుగట్టిన కమాండర్‌ను మట్టుబెట్టారు. -
ఉగ్రవాదాన్ని ‘రాజద్రోహం’గా పరిగణించాలి: పాక్ మతపెద్ద
న్యూఢిల్లీ: మత విశ్వాసాలను అడ్డంపెట్టుకొని చెలరేగే ఉగ్రవాదాన్ని తీవ్రమైన రాజద్రోహం నేరంగా పరిగణించాలని పాకిస్తాన్లో శక్తివంతమైన మతపెద్ద మహమ్మద్ తాహిర్ ఉల్ ఖాద్రీ చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు భారత్, పాక్‌లు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో ఆదివారం అంతర్జాతీయ సూఫీ సదస్సు సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడారు. ఖాద్రీ నేతృత్వంలో ఏడాదిన్నర కిందట ఇస్లామాబాద్‌లో జరిగిన మహా ధర్నా నాడు ప్రభుత్వాన్ని వణికించింది. సంఘ విద్రోహక శక్తులను ఎదుర్కొనేలా విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని భారత్, పాక్‌లకు ఆయన సూచించారు. తద్వారా యువత ఆయుధాలు పట్టి చెడు మార్గంలో పయనించకుండా చూడవచ్చన్నారు. ‘జైష్ ఏ మహ్మద్, లష్కరే తోయిబా, ఐసిస్ లేదంటే ఏదైనా హిందూ సంస్థ కావచ్చు. ఎవరైనా సరే... మతం చాటున ఉగ్రవాద, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.