
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది, జైషే ఉగ్రవాది తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్ రైట్ హ్యండ్, సమీపబంధువు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కాగా జైషే ముఠాలో అత్యంత కీలక మైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్‌కోట్, నగ్రోటా, ఉరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీల ప్రాత. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌవూఫ్ ప్రధాన సూత్రధారి.
2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్‌లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment