జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. పీఓకేలోని జైషే స్ధావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మసూద్ అజర్ మరణించాడని పాకిస్తాన్‌లో స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం మసూద్ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మసూద్ పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే.