Masood Azar
-
జీనియస్.. లెక్కలేనంత ఇష్టం!
వాషింగ్టన్: పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర ముఠాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రసంస్థలపై తగు కఠిన చర్యలు తీసుకోకుండా పాక్ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తోందని తన తాజా నివేదికలో అమెరికా తీవ్రంగా విమర్శించింది. మసూద్ అజర్, సాజిద్ మీర్ లాంటి ఉగ్రవాద నేతలు స్వేచ్ఛగా పాక్‌లో సంచరిస్తున్నా, వీరిని పాక్ అదుపులోకి తీసుకోవడంలేదని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదానికి సంబంధించిన 2020–నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం విడుదలచేశారు. అఫ్గానిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్వర్క్ దాడులు చేస్తూనే ఉన్నాయని, మరోవైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో కోర్టులు జైలు శిక్షను విధించాయని తెలిపింది. ఎఫ్ఏటీఏ గ్రేలిస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ కొన్ని చర్యలు చేపట్టిందని, కానీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారని నివేదిక తెలిపింది. ఐసిస్‌లో 66 మంది భారతీయ సంతతి! అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌లో 66మంది భారతీయ సంతతికి చెందినవారున్నారని ఉగ్రవాదంపై అమెరికా నివేదిక శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ, స్థానిక ఉగ్ర మూకలను గుర్తించి నిర్మూలించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏలాంటి భారత ఉగ్రవ్యతిరేక దళాలను నివేదిక ప్రశంసించింది. ఎయిర్‌పోర్టుల్లో కార్గో పరీక్షకు రెండు తెరల ఎక్స్రేతెరలను వాడేందుకు భారత్ అంగీకరించిందని నివేదిక తెలిపింది. అలాగే వాయుమార్గంలో ప్రయాణించే వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించే ఐరాస ప్రతిపాదన అమలకు కూడా ఇండియా సుముఖంగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ తెలిపారు. పలు ఒప్పందాల ద్వారా ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని వెల్లడించా రు. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్ఐఏ విచారించిందని, 160మందిని అరెస్టు చేసిందని, వీరిలో 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లని నివేదిక తెలిపింది. ఉగ్రసమాచారం అందించాలన్న యూఎస్ అభ్యర్థనకు భారత్ సానుకూలంగా స్పందిస్తోందని బ్లింకెన్ తెలిపారు. టెర్రరిస్టుల్లో టెక్నాలజీ వాడకంపై భారతీయ అధికారులు ఆందోళనగా ఉన్నారన్నారు. పలు దేశాలతో భారత్ ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్‌సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్‌తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్‌పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
పుల్వామా దాడి.. ఎన్ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు రాఫ్ అస్ఘర్లతో సహా 19 మంది ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులంతా పేలుళ్లకు పాల్పడినట్టుగా ఎన్ఐఏ మంగళవారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల చార్జిషీట్లో పేర్కొంది. అజర్, అతని సోదరుడు, మేనల్లుడు, ఇప్పటికే ఎన్కౌంటర్లో మరణించిన ఉమర్ ఫరూఖ్, అమ్మర్ అల్వీ తదితరుల పేర్లు చార్జిషీట్లో ఉన్నాయి. అభియోగాలు నమోదైన ఉగ్రవాదుల్లో ఆరుగురు ఇప్పటికే ఎన్కౌంటర్లలో మరణించగా, మరోనలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కశ్మీర్‌లోనే ఉన్నట్టు సమాచారం. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో దిట్టయిన ఉమర్ ఫరూఖ్ ఈ దాడిని పర్యవేక్షించడానికి 2018లో భారత్‌లోకి చొరబడ్డాడు. 1999 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అతర్ కుమారుడే ఇతడు. 2019 ఫిబ్రవరిలో ఫరూఖ్ ఈ దాడి చేయించాడు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్కౌంటర్లో ఫరూఖ్ మరణించాడు. ఆత్మాహుతి బాంబర్ చివరి వీడియో చార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ 200 కేజీల పేలుడు పదార్థాలతో నింపిన కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనాన్ని ఢీ కొన్నాడు. పుల్వామాలో షేక్ బషీర్ నివాసంలో బిలాల్ అహ్మద్ కుచే అన్న ఉగ్రవాది తెచ్చిన హైటెక్ ఫోన్ ద్వారా దార్ తన చివరి వీడియోని తీశాడు. దాడిలో అహ్మద్ దార్ మరణిస్తే, బషీర్, బిలాల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏకి ఎన్నో సవాళ్లు పుల్వామా దాడి కుట్రదారులు, దానిని అమలు పరిచిన వారు వివిధ ఎన్కౌంటర్లలో మరణించడంతో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడం ఎన్ఐఏకు కత్తి మీద సాము అయింది. కారు యజమాని అహ్మద్ దార్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డామని ఓ అధికారి చెప్పారు. పేలుడులో నంబర్ ప్లేట్ సహా కారు పూర్తిగా «నుజ్జునుజ్జయినా ఆ కారు యజమానుల జాబితాను సేకరించామని తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ అహ్మద్ దార్ అవశేషాలను సేకరించి, అతని తండ్రి డీఎన్ఏతో సరిపోల్చి ఇదంతా చేసిన వ్యక్తి దార్యేనని కోర్టులో నిరూపించాల్సి వచ్చిందని ఆ అధికారి వివరించారు. -
బాంబ్ ప్రూఫ్ హౌస్‌లో మసూద్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఆచూకీని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. బహవల్పూర్ జైషే ప్రధాన కేంద్రం వెనుక బాంబ్ ప్రూఫ్ నివాసంలో మసూద్ అజర్ బస చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. మసూద్‌కు సంబంధించిన కౌసర్ కాలనీ బహవల్పూర్, మదర్సా బిలాల్ హడబ్షి పతున్‌క్వా, మరర్సా లక్కి మర్వత్ బహవల్పూర్ అనే మూడు చిరునామాలనూ నిఘా సంస్థలు కనుగొన్నాయి. జైషే చీఫ్ అదృశ్యమయ్యాడని పాకిస్తాన్ పేర్కొంటున్న క్రమలో మసూద్ అజర్ కదలికలపై నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముంబై ఉగ్రదాడిలో ప్రమేయమున్న లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్తాన్ మసూద్ అజర్‌పై మాత్రం భారత్ పలు ఆధారాలు చూపినా నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. చదవండి : జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఏమైంది.? -
సిన్హా వ్యాఖ్యలతో ఇరకాటంలో కాషాయ పార్టీ
పట్నా : కేంద్ర మంత్రి, హజారిబాగ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్‌ను మసూద్ అజర్‌జీ అని సంభోదించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ‘దేశ భద్రతకు ఇది మైలురాయి వంటిది..మేం చేపట్టిన ప్రయత్నాలు నెరవేరి మసూద్ అజర్‌జీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింద’ని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. బిహార్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మసూద్ అజర్‌ను సాహెబ్‌గా పిలిచిన బిహార్ మాజీ సీఎం, మహాకూటమి నేత జితన్ రాం మాంఝీని బీజేపీ మందలించిన కొద్ది గంటల్లోనే సిన్హా నోరుజారడం గమనార్హం. మన్మోహన్ సింగ్ హయాం నుంచి మసూద్ అజర్ సాహెబ్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించే ప్రయత్నాలు సాగినప్పటికీ ఇప్పటికి ఆ నిర్ణయం వెలువడటం కాకతాళీయమేనని జితన్ రాం మాంఝీ వ్యాఖ్యానించారు. మాంఝీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అభ్యంతరం లేవనెత్తగా తాజాగా తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మసూద్‌జీ అంటూ సంభోదించడం ఆ పార్టీని ఇరకాటంలో పడవేసింది. -
అంతర్జాతీయ ఒత్తిళ్లతో దిగొచ్చిన పాకిస్థాన్
-
గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మసూద్ : నేడు ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కనుంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం లాంఛనంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. భారత్ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనాతో నెరపిన లాబీయింగ్ ఫలించడం సానుకూల ఫలితానికి దారితీసింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతోనే జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైందని అధికారులు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో దాడి నేపధ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామాం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
నాడు ఒంటరి.. నేడు ప్రపంచమద్దతు
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింప జేయడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమైందన్న ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ 2009లో యూపీఏ హయాంలో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టిన భారత్ ఏకాకిగా ఉందని, ఇదే అంశంపై తాజాగా భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 14 దేశాలు బాసటగా నిలిచాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ..‘ఉగ్రవాది మసూద్‌పై ఇప్పటికి నాలుగుసార్లు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌కు మద్దతు కరువైంది. తాజాగా, ఇదే విషయమై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానానికి భద్రతామండలిలోని 15 దేశాల్లో 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. భద్రతా మండలిలోని సభ్య దేశాలు కాని బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ మద్దతు తెలిపాయి’ అని సుష్మా అన్నారు. అజార్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఫ్రాన్సు నిర్ణయించింది. ‘కశ్మీర్లో ఫిబ్రవరిలో 40 మంది భారత్ జవాన్ల మృతికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఈ సంస్థను ఐక్యరాజ్యసమితి 2001లోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తాం’ అని ఫ్రాన్స్ తాజాగా ఓ ప్రకటన విడుదలచేసింది. -
‘మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదే’
వాషింగ్టన్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అమెరికా పూర్తి బాసటగా నిలిచింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ను ప్రకటించేందుకు విస్పష్ట ఆధారాలు ఉన్నాయని అగ్రదేశం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక భేటీకి ఒక రోజు ముందు జైషే చీఫ్‌పై అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ భారత్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్ధావరంపై దాడి, జమ్మూ,యూరిలో సైనిక పోస్టులపై దాడులు, భారత పార్లమెంట్‌పై దాడి సహా ఇటీవల పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఉగ్రదాడికీ బాధ్యుడని భారత్ చెబుతోంది. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మూడు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో ఈ మూడు దేశాలు చేసిన పలు ప్రయత్నాలను చైనా నిలువరించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఈ ప్రతిపాదనను చైనా వీటో చేస్తూ వచ్చింది. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ మసూద్‌పై తీవ్ర చర్యలు చేపట్టే ప్రతిపాదనను ఈసారి చైనా అడ్డుకోబోదని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ భావిస్తున్నాయి. -
మసూద్‌ను విడుదల చేసిందెవరు?
న్యూఢిల్లీ: ఉగ్రదాడికి బాధ్యత వహిస్తున్న మసూద్ అజార్‌ను విడుదల చేసిందెవరో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ప్రస్తుతమున్న జాతీయ భద్రతా సలహాదారే కాందహార్‌కు వెళ్లి అజార్‌ను పాకిస్తాన్‌కు అప్పగించినట్లు రాహుల్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కాందహార్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసీ–814ను ఉగ్రవాదులు హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వీరిని విడిపించడానికి బదులుగా అప్పటి భారత ప్రభుత్వం 1999, డిసెంబర్లో అజార్‌తో పాటు మరి కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేసింది. ‘మోదీ జీ మసూద్‌ను విడుదల చేసిందెవరో 40 మంది జవాన్ల కుటుంబాలకు చెప్పండి. అలాగే కాందహార్ వెళ్లి అజా ర్ను పాకిస్తాన్‌కు అప్పగించింది కూడా జాతీ య భద్రతా సలహాదారేనని చెప్పండి’అని రాహుల్ ట్వీట్ చేశారు. -
నీరవ్‌తో ప్రధానికి పోలికలు
హవేరి(కర్ణాటక)/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీకి ప్రధాని మోదీకి మధ్య అసాధారణమైన సారూప్యతలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ చట్టానికి అతీతులమని భావిస్తుంటారన్నారు. వేల కోట్ల రుణాలు ఎగొట్టిన నీరవ్ మోదీపై మీడియా కథనాలపై రాహుల్ స్పందించారు. ‘ వీరిద్దరి పేర్లు మోదీనే. ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నవారే. చట్టానికి అతీతులమని వీరు భావిస్తున్నారు. వీరిని చట్టం ముందు నిలబెడతాం’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పరారైన నేరగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ను ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ తలొంచదు అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌ను ఎన్డీఏ ప్రభుత్వం జైలు నుంచి ఎందుకు విడిచిపెట్టిందో ప్రజలకు వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ‘ ఏ ప్రభుత్వం అతడిని జైలు నుంచి వదిలిపెట్టింది?’ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో హవేరీలో జరిగిన సభలో మాట్లాడారు.‘ఇటీవల కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపారు. ఈ జవాన్లను ఎవరు చంపారు? జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరు? మసూద్ అజార్.. భారత్ జైలులో ఉన్న అతడిని పొరుగుదేశం పంపిందెవరు? వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చిన మసూదే ఇప్పుడు జవాన్లను చంపాడన్న విషయం ఎందుకు మీరు చెప్పడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ‘మోదీజీ..మీకు మాదిరిగా కాంగ్రెస్ ఉగ్రవాదులకు తలొంచదు’ అని రాహుల్ అన్నారు. -
జైషే మహ్మద్ చీఫ్ సోదరుడిని అరెస్ట్ చేశాం: పాక్
ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అజార్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. అబ్దుల్ రౌఫ్‌తోపాటు నిషేధిత సంస్థలకు చెందిన హమద్ అజర్ సహా 44 మందిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారని మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షెహరర్ ఖాన్ అఫ్రిది విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ చర్య అంతర్జాతీయ ఒత్తిడికి ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు. వీరందరిపైనా కఠిన తీసుకుంటామన్నారు. మార్చి 4న అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) నిర్ణయం ప్రకారం..నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్ఏపీ) లో భాగంగా అన్ని నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన ఈ ప్రకటన చేసింది. సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ గ్రామానికి చెందిన మసూద్ అజర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. కాగా ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఉగ్ర మసూద్ మృతి?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ (50) పాకిస్తాన్లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్‌కు చెందిన జియో ఉర్దూ న్యూస్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మసూద్ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్ అజార్ ఇస్లామాబాద్‌లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్ అజార్ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్ ఖురేషీ ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కుట్రను వివరిస్తూ భారత్ ఒక ఫైల్‌ను కూడా ఇటీవలే పాకిస్తాన్‌కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలుపుకోవాలని సవాల్ చేసింది. 1999లో భారత్ నుంచి విడుదల మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవాల్పూర్లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్ పాస్‌పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది. అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్‌కు తరలించారు. అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్ అజార్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్ అజార్ తమ్ముడు ఇబ్రహీం అథార్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్ అజార్ 2000 ఏడాదిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్కాయిదాచీఫ్ ఒసామా బిన్ లాడెన్, తాలిబన్‌ను స్థాపించిన ముల్లా మహ్మద్ ఒమర్‌లను మసూద్ అఫ్గానిస్తాన్‌లో కలిశాడని అమీర్ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్‌ను పాక్ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్‌ను పాక్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు. త్వరలో మసూద్‌పై పాక్ చర్యలు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్‌పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు మసూద్‌పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు మసూద్ అజార్‌పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్ స్థాపించిన జైషే మహ్మద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్‌పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి. -
జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ మృతి?
-
జైషే చీఫ్ మసూద్ మృతి?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. పీఓకేలోని జైషే స్ధావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మసూద్ అజర్ మరణించాడని పాకిస్తాన్లో స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం మసూద్ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మసూద్ పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, మసూద్ అజర్ మృతి వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది పాకిస్తాన్ ప్రణాళికలో భాగమా.. లేక నిజంగానే మసూద్ మరణించాడా అనేది తేలాల్సి ఉంది. మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అతను మృతి చెందాడనే వార్త అనేక అనుమానాలకు తావిస్తోంది. (ఇక్కడ చదవండి: ‘జైషే క్యాంపులపై సర్జికల్ స్ట్రైక్స్ నిజమే’) -
పాక్‌లోనే మసూద్ అజార్
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాక్‌లోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి అంగీకరించారు. అజార్ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. అజార్‌కు సంబంధించి పాకిస్తాన్ కోర్టుల్లో గట్టి సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే అతనిపై తమ ప్రభుత్వం∙చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిపాదించిన విషయం తెల్సిందే. పుల్వామా దాడుల్లో జైషే పాత్ర, పాక్‌లో జైషే ఉగ్ర శిబిరాల వివరాలపై పాక్‌కు భారత్ అనేక సాక్ష్యాలను ఇప్పటికే అందించింది. కాగా, పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడం శాంతి ప్రక్రియలో భాగమని ఖురేషి తెలిపారు. -
బ్లాక్‌లిస్ట్‌లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్
ఐక్యరాజ్యసమితి : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్‌ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. గతంలో 2017లో మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుల ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది. -
పాక్‌పై దౌత్య యుద్ధం
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్‌కు చైనా మద్దతు బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది. -
ఎన్కౌంటర్లో మసూద్ అజర్ బంధువు హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు దగ్గరి బంధువు మహ్మద్ ఉస్మాన్ హతమయ్యాడు. త్రాల్ ప్రాంతంలో గత 10 రోజుల్లో భద్రతా దళాలపై జరిగిన దొంగచాటు దాడులకు ఉస్మాన్ నాయకత్వం వహించినట్లు సమాచారం. మంగళవారం నాటి ఎన్కౌంటర్ కూడా త్రాల్ ప్రాంతంలోనే జరగ్గా జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఒక ఎం–4 కార్బైన్ తుపాకీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలపై దొంగచాటుగా కాల్పులు జరిపేందుకు ఈ తుపాకులను వారు ఉపయోగించి ఉండొచ్చని అధికారులు చెప్పారు. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌తో భద్రతా దళాలకు ఈ ఏడాదిలోనే గొప్ప విజయం లభించినట్లైందని ఓ అధికారి పేర్కొన్నారు. -
యూరి ఉగ్రదాడి సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి
లాహోర్ : భారత్‌లో పలు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజార్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్ చీఫ్ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనట్టు హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. యూరి దాడికి బాధ్యుడైన మసూద్ అజార్ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కథనం పేర్కొంది. రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది.కాగా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. భారత్, పాకిస్తాన్ సహా ఐరాస భద్రతా మండలి సభ్యుల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదని చైనా వాదిస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల జాబితాలో ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో దాడికి సంబంధించి జైషే చీఫ్ మసూద్‌ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్లో పేర్కొంది. గత ఏడాది నాగర్‌కోట దాడిలోనూ మసూద్ ఆజాద్ కీలకంగా వ్యవహరించడం గమనార్హం. -
మసూద్‌పై చైనాతో భారత్ మంతనాలు
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయమై చైనాతో మంతనాలు జరుపుతున్నామని, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతోన్న మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు రప్పించేలా చర్యలు ముమ్మరం చేశామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అన్న సుప్రీం కోర్టు తీర్పును (‘కులమతాల’పై సుప్రీం కోర్టు కీలక తీర్పు) తాము ఆహ్వానిస్తున్నామని, ఆ తరహా రాజకీయాలకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకమని రాజ్‌నాథ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నాగావర్గీయుల ఆందోళనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పిటికప్పుడు మాట్లాడుతున్నామని, అక్కడ గవర్నర్ పాలన విధించే ఆలోచన ఏదీ లేదని, నిరసనకారులపై నిర్బంధాన్ని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించామని తెలిపారు. (వెంటాడి.. దుస్తులను చించి వేధించారు)బెంగళూరులో న్యూఇయర్ వేడుక సందర్భంగా మహిళలపై కీచకుల వేధింపులు గర్హనీయమని, స్త్రీల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానికి ఉండాలని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలపైనా స్పందిస్తూ తండ్రీకొడుకుల మధ్య తగవులాట మంచిదికాదని హితవు పలికారు. ('ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు')