ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అజార్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. అబ్దుల్ రౌఫ్‌తోపాటు నిషేధిత సంస్థలకు చెందిన హమద్ అజర్ సహా 44 మందిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారని మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షెహరర్ ఖాన్ అఫ్రిది విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ చర్య అంతర్జాతీయ ఒత్తిడికి ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు. వీరందరిపైనా కఠిన తీసుకుంటామన్నారు.
మార్చి 4న అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) నిర్ణయం ప్రకారం..నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్‌ఏపీ) లో భాగంగా అన్ని నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన ఈ ప్రకటన చేసింది. సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్‌పూర్ గ్రామానికి చెందిన మసూద్ అజర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. కాగా ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment