Jaish-e-Mohammad
-
ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం
JeM Terrorist Cop Killed And Five Injured In Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిపిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారని సమాచారం. కుల్గాం జిల్లాలో ఉగ్రమూకల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. అయితేవారు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో వారు ఎదురుకాల్పులతో ప్రతిఘటించారు. ఈ మేరకు అధికారులు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం వల్ల సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. (చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేలుస్తాం
చండీగఢ్ : దేశమంతా దసరా ఉత్సవాల్లో మునిగిపోయిన వేళ నరమేధం సృష్టించేందుకు సిద్ధమైనట్లు ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ప్రకటన విడుదల చేసింది. మసూద్ అహ్మద్ అనే పేరిట రాసిన లేఖలో.... దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడనున్నట్లు పేర్కొంది. సదరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమ్మర్థంతో ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని తెలిపింది. అక్టోబర్ 8న హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషనుతో పాటు... ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్తాన్, జైపూర్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది. ఈ మేరకు జైషే రాసిన లేఖ... రోహతక్ రైల్వే జంక్షన్ సూపరిండెంటెండ్ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోస్టు ద్వారా చేరుకుంది. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి మసూద్ అహ్మద్ పేరిట వచ్చిన ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక పదే పదే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైనికులకు భారత సైన్యం తగిన రీతిలో జవాబిస్తున్నా వారి వైఖరి మాత్రం మారడం లేదు. భారత్‌లో సంప్రదాయ యుద్ధం జరిగితే ఓడిపోతామని అంగీకరించిన పాక్...ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు ఉగ్రవాదుల సహాయం తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జైషే మహ్మద్ చీఫ్ సోదరుడిని అరెస్ట్ చేశాం: పాక్
ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అజార్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. అబ్దుల్ రౌఫ్‌తోపాటు నిషేధిత సంస్థలకు చెందిన హమద్ అజర్ సహా 44 మందిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారని మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షెహరర్ ఖాన్ అఫ్రిది విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ చర్య అంతర్జాతీయ ఒత్తిడికి ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు. వీరందరిపైనా కఠిన తీసుకుంటామన్నారు. మార్చి 4న అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) నిర్ణయం ప్రకారం..నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్ఏపీ) లో భాగంగా అన్ని నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన ఈ ప్రకటన చేసింది. సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ గ్రామానికి చెందిన మసూద్ అజర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. కాగా ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మసూద్ సోదరుడి ఆడియో..!
-
దాడి గురించి 2 రోజుల ముందే హెచ్చరించారా..?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ఈ దారుణం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించిందా అంటే.. అవుననే అంటున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు అఫ్గానిస్తాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిన తీరు.. గురువారం పుల్వామాలో జరిగిన దాడి రెండు ఒకేలా ఉన్నట్లు సమాచారం. అఫ్గానిస్తాన్‌లో కూడా పేలుడు పదార్థంతో ఉన్న వాహనాన్ని ఉపయోగించి ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. గురువారం పుల్వామాలో కూడా ఇదే తరహా దాడే జరిగింది. అయితే ఈ వీడియోను రెండు రోజుల క్రితమే గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని... ఫలితంగా 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని అంటున్నారు విశ్లేషకులు. దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లే సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిసింది.(ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
‘మరో కుమారుడ్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను’
పట్నా : పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్ భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రతన్ ఠాకూర్ తండ్రి ఏఎన్ఐతో మాట్లాడారు. ‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భరతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. -
నలుగురు జైషే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాక్ నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. హన్జన్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా, అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులందరూ జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
మరో 26/11 ముంబై తరహా దాడి జరిగితే..!
న్యూఢిల్లీ: 26/11 ముంబై తరహా దాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు మరోసారి తెగబడితే.. భారత్ సహనంగా ఉండటం ఎంతమాత్రం సాధ్యపడదని బ్రసెల్స్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మేధో సంస్థ అభిప్రాయపడింది. దక్షిణాసియాలో ఉగ్రవాదంపై అమెరికా విధానాన్ని విశ్లేషిస్తూ ఇంటర్నేషనల క్రైసిస్ గ్రూప్ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెప్పుకోదగినస్థాయిలో పాక్ సర్కారు మద్దతు ఉందని విశ్లేషించిన ఆ సంస్థ.. ఈ ఉగ్రవాద గ్రూపులతో అమెరికాకు కూడా ముప్పేనని స్పష్టం చేసింది. ‘ఈ ఉగ్రవాద గ్రూపులకు అల్ కాయిదాకు నేరుగా సంబంధాలు లేకపోయినా.. వాటి ఫైటర్లు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో అంతర్జాతీయ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్‌కే కాదు భారత్, అమెరికాకు కూడా ప్రమాదకరమే’ అని పేర్కొంది. గత ఏడాది కశ్మీర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రతిస్పందనను అంచనా వేస్తే.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయన ప్రతిచర్యలు ఉంటాయని స్పష్టమవుతోంది. కానీ, 2008లో ముంబైలో చాలామందిని పొట్టనబెట్టుకున్న మారణహోమంలాంటిది మరొకటి జరిగితే.. భారత్ సహనంగా ఉండటం చాలా కష్టం’ అని అభిప్రాయపడింది. గత ఏడాది ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత సైనికులు ఎల్వోసీను దాటి మరీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి.. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేసి.. పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ’కౌంటర్ టెర్రరిజం పిట్ఫాల్స్: వాట్ ద యూస్ ఫైట్ అగైనెస్ట్ ఐఎస్ఐఎస్ అండ్ అల్ కాయిదా షూడ్ అవైడ్’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నియంత్రణ, తాలిబన్లతో చర్చల దిశగా పాకిస్థాన్ సైన్యాన్ని ఒప్పించడమే అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొంది. -
50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం..
కోల్కత్తా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామంటూ తూర్పు రైల్వేకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఉన్నపలంగా రూ.50 కోట్లు సమకూర్చాలని లేదంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామని, హౌరా రైల్వేస్టేషన్‌ను పేల్చుతామని తీవ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ నుంచి తూర్పు రైల్వే కార్యాలయానికి ఈ లేఖ అందింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్‌ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు. ఈ లేఖను మాజీ దూరదర్శన్ ఉద్యోగి ఎస్సీ దాస్ రాసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులకు తన ఫ్లాట్స్‌లో ఆయన ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దూరదర్శన్‌లో ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఫ్లాట్‌ను ఆయన కొనుగోలు చేశారని సమాచారం. ఆ లేఖను విచారణ కోసం పోలీసులకు అందించామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ బద్రినారాయణ్ చెప్పారు. ఆ లేఖలో రూ.50కోట్లు చెల్లించాలని రాశారని, ఫోన్ నెంబర్ కూడా రాశారని ఆయన తెలిపారు. అయితే ఆ లేఖలో రాసిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఎక్కడా లేదని తూర్పు రైల్వే సీపీఆర్ఓ ఆర్యన్ మహాపత్రా చెప్పారు. -
పాక్‌లో మసూద్ అరెస్ట్
-
పాక్‌లో మసూద్ అరెస్ట్
పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ * జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు, మరికొందరు ఉగ్రవాదులు అరెస్టు * పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటన * ఉగ్రవాదంపై భారత్‌తో కలసి పనిచేస్తామని వెల్లడి * అరెస్టుపై అధికారిక సమాచారం లేదన్న భారత్ * ప్రధానితో సుష్మాస్వరాజ్, విదేశాంగ అధికారుల భేటీ * నేడు మళ్లీ సమావేశమై పాక్‌తో చర్చలపై నిర్ణయం ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఘటన తర్వాత భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్‌లను అరెస్టు చేసింది. వీరితోపాటు పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతోపాటు జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం (ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్, ఐఎస్ఐ చీఫ్, హోం, ఆర్థిక మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్, పలువురు కీలక నేతలు హాజరయ్యారు) పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు పకడ్బందీగా పనిచేయాలని.. ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాటు పఠాన్‌కోట్ ఘటనలో లోతైన విచారణ కోసం ఐఎస్ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం జనవరి 15న (శుక్రవారం) ఇస్లామాబాద్‌లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడికి వ్యూహరచన పాకిస్తాన్లో జరిగినట్లు, జైషే ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు ఆధారాలు అందజేసిన భారత్.. బాధ్యులపై చర్చలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో గతవారంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వరుసగా రెండ్రోజులు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో బంతిని పాక్తిసాన్ కోర్టులోకి నెట్టినందున.. ఏం చేయాలనే దానిపై ఈ భేటీల్లో చర్చించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతోపాటు మరిన్ని వివరాలు పంపించాలని భారత్‌ను కోరారు. జనవరి 2న జైషే ఉగ్రవాదులే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడ్డారని ఆధారాలు అందజేసిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. వీరిని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేయటంపైనా చర్చించారు. దీనికి అనుగుణంగానే.. పాక్‌లో తలదాచుకుని.. భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్న జైషే చీఫ్, అతని సోదరులతోపాటు.. పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేయటం అనివార్యమైంది. అయితే.. మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అజర్ అరెస్టుపై తమకు అధికారిక సమాచారం అందలేదని భారత్ తెలిసింది. పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తలొస్తున్నా.. తమకు సమాచారం రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాన మంత్రితో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్, అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ భేటీ అయ్యారు. అజర్‌పై భారత్ నజర్ 1994లోనే శ్రీనగర్‌లో హర్కతుల్ జిహాదీ సాయంతో అల్లర్లు సృష్టించేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో భారత బలగాలు అజర్‌ను అరెస్టు చేశాయి. అప్పటికే ప్రమాదకర ఉగ్రవాది, వ్యూహకర్తగా పేరున్న మసూద్ అరెస్టుతో కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మసూద్‌ను విడిపించేందుకు 1995లో కొందరు ఉగ్రవాదులు కశ్మీర్‌కు వచ్చిన విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. ఇందులోనుంచి ఒక టూరిస్టు తప్పించుకోగా.. మిగిలిన వారిని ఉగ్రవాదులు చంపేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో.. 1999 డిసెంబర్లో 155 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం (ఐసీ184)ను మసూద్ సోదరుడు ఇబ్రహీం నేపథ్యంలోని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌లో (అప్పడు తాలిబాన్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం) విమానాన్ని ల్యాండ్ చేసి.. మసూద్‌తో పాటు మరో ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను విడిపించుకున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి కూడా మసూద్ వ్యూహరచన చేశారు. అప్పడు భారత్ ఒత్తిడితో జైషే చీఫ్‌ను అరెస్టు చేసినా..2002లో విడుదల చేశారు. అప్పటినుంచి అజర్‌పై భారత్ దృష్టిపెట్టింది. విధానం నిర్ణయించటానికి షరీఫ్ ఎవరు? పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ పాత్రమై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో.. పాకిస్తాన్ మాజీ రాయబారి అషఫ్ ్రజహంగీర్ కాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో విదేశాంగ విధానం నిర్ణయించటంలో పాకిస్తాన్ ప్రధాని ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని.. ఆర్మీ మద్దతు లేకుండా అడుగు ముందుకేయలేరని స్పష్టం చేశారు. ‘మోదీ స్టాప్ ఓవర్ విషయంలో పాక్ ఆర్మీ స్పందన ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి పాక్ పర్యటించి వెళ్లాకే కార్గిల్ యుద్ధం జరిగింది. ఇప్పుడ మోదీ పర్యటన తర్వాతే పఠాన్‌కోట్ ఘటన జరిగింది’అని డాన్ పత్రికకు రాసిన వ్యాసంలో కాజీ పేర్కొన్నారు. ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో ఆర్మీ చీఫ్ పాల్గొన్నంత మాత్రాన ప్రభుత్వం-ఆర్మీ మధ్య అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదని ఆయన అన్నారు. భారత్‌తో దౌత్యపర సంబంధాల విషయంలో ఆర్మీ నిర్ణయమే కీలకమవుతుందని వెల్లడించారు. స్పష్టమైన ఆధారాలిచ్చి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న కాజీ.. బాధ్యులపై చర్యలుంటాయని షరీఫ్ హామీ ఇచ్చినా.. ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారనుకోలేదన్నారు. పాక్ చర్యపై భారత్‌లో మిశ్రమ స్పందన జైషే చీఫ్ అరెస్టుపై బీజేపీ, కాంగ్రెస్ జాగ్రత్తగా స్పందించగా శివసేన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక శాంతి చర్చలకు పాకిస్తాన్ తీసుకున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. అభివృద్ధిని కోరుకునే భారత్-పాక్ దేశాల ప్రజలు ఈ చర్యలను హర్షిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ తెలిపారు. కాగా, పాక్ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించటంలో వెనక్కు తగ్గొద్దని సూచించింది. చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు నవాజ్ షరీఫ్ చిత్తశుద్ధితో పనిచేస్తే.. పాకిస్తాన్లో గొప్ప రాజనీతిజ్ఞుడుగా ఖ్యాతి సంపాదిస్తారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. జేడీయూతోపాటు ఇతర పార్టీలు కూడా పాక్ నిర్ణయాన్ని స్వాగతించగా.. శివసేన మాత్రం అజర్ అరెస్టుపై పెదవి విరిచింది. చర్చల ప్రక్రియకు ఇదేం పెద్ద అనుకూల అంశం కాబోదని.. ఉగ్రవాదులను అరెస్టు చేయటం, తర్వాత విడుదల చేయటం పాకిస్తాన్‌కు అలవాటేనని వ్యాఖ్యానించింది. -
'అజార్ అరెస్టా.. ఇంకా కన్ఫర్మ్ కాలేదు'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడిలో సూత్రదారి మౌలానా మసూద్ అజార్ అరెస్టుపై తమకు అధికారిక ప్రకటన సమాచారం లేదని భారత్ స్పష్టం చేసింది. అతడు అరెస్టు అయ్యాడా లేదా అనే విషయంపై పాక్ నుంచి తమకు ధ్రువీకరణ సమాచారం అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాకిస్థాన్ మంత్రి మహ్మద్ జుబెయిర్ కూడా ఇదే అంశాన్ని తెలిపారు. మసూద్ అజార్ అరెస్టు అయ్యాడని వార్తను ఇప్పుడే పక్కాగా చెప్పలేమని, అయితే, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో చాలామందిని అరెస్టు చేసినట్లు ఆ మంత్రి తెలిపారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను ఇస్లామాబాద్‌లో భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూప్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేస్తున్న సైన్యం.. ఇందులో భాగంగా మసూద్, అతని నలుగురు కీలక అనుచరులని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని పాకిస్థాన్‌కు చెందిన జీయో న్యూస్ వెల్లడించింది. -
కాందహార్ హైజాక్ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు!
జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపు స్థాపకుడు, 2001 నాటి పార్లమెంటుపై దాడి సూత్రధారి మసూద్ అజార్ గురించి భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో గాలిస్తున్నాయి. 1999 నాటి కాందహార్ హైజాక్ వ్యవహారం ద్వారా తప్పించుకొని పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న మసూద్ అజార్‌ను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో దాయాదిని కోరుతూ వస్తోంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి వ్యవహారంలో మసూద్ అజార్‌ను పాక్ భద్రతా సంస్థలు నిజంగానే అదుపులోకి తీసుకుంటే.. భారత్‌కు అది పెద్ద విజయమే అవుతుంది. భారత్-పాకిస్థాన్ చర్చల దిశగా కీలక ముందడుగు పడినట్టు అవుతుంది. పాకిస్థాన్ పంజాబ్‌లోని భవల్‌పుర్‌లో జన్మించిన మసూద్ అజార్‌ను మొదట 1994లోనే అరెస్టు అయ్యాడు. తీవ్రవాద కార్యకలాపాల కోసం పోర్చుగీసు నకిలీ పాస్పోర్టుతో కశ్మీర్ వచ్చిన అతన్ని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే, 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ తరలించారు. విమానంలోని 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్ మేరకు జైల్లో ఉన్న మసూద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ప్రయాణికులను విడిపించుకుంది. అప్పట్లో కాందహార్ తాలిబన్ అధీనంలో ఉండేది. కాందహార్ నుంచి పాకిస్థాన్ పారిపోయిన అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహచరుడు ఒమర్ షైక్‌తో కలిసి జమ్ముకశ్మీర్‌లో మిలిటెన్సీని ప్రేరేపించడానికి జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. చాలాకాలంపాటు సొంత ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్లో అజ్ఞాతంలో గడిపిన అజార్‌ను పట్టుకునేందుకు భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. 2014లో మసూద్ పాక్‌లోని ఓ బహిరంగ ర్యాలీలో ఫోన్ ద్వారా ప్రసంగించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. జేఈఎం ద్వారా భారత్ లక్ష్యంగా అతడు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నాడని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. -
పాక్‌లో మసూద్ అజహర్ బంధువులు అరెస్టు!
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించినట్టు కనిపిస్తోంది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ సభ్యులను పాక్ భద్రతా దళాలు బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. జైషే మహమ్మద్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేసినట్టు తెలుస్తోంది. 'జైషే మహమ్మద్‌కు చెందిన పలువురు సభ్యులను అదుపులోకి తీసుకొని, వాటి కార్యాలయాలను సీల్ చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అరెస్టైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బంధువులు కూడా ఉండి ఉండొచ్చునని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు తమ విచారణాధికారులను భారత్ పంపిస్తామని ఇప్పటికే పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు. పఠాన్‌కోట్ దాడికి కారణమైన జైషే మహమ్మద్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. భారత్-పాక్ చర్చలు ముందుకు కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
చర్యలా...చర్చలా త్వరగా తేల్చండి..
న్యూఢిల్లీ: పంజాబ్ లో పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరం వద్ద టెర్రర్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ భారత్ పొరుగుదేశం పాకిస్థాన్ పై ఒత్తిడిని తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. సకాలంలో చర్యలు తీసుకోండి...లేదంటే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఉండవని తేల్చి చెబుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఒక వివరణ పత్రాన్ని పంపించింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ లో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరగాల్సిన శాంతి చర్చలు ఉండవని పేర్కొంది. ఈ ఉగ్రదాడి వెనుక ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ హస్తం ఉందని భారత్ నమ్ముతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆ దేశానికి సమర్పించింది. పంజాబ్ లోని బహావల్పూర్ సహా వివిధ ప్రాంతాల నుండి పాకిస్తాన్ కు వెళ్లిన అనేక ఫోన్ కాల్స్ ను తాము ట్రేస్ చేశామని, వాటిలో కొన్ని సంక్షిప్తంగానూ, కొన్ని దీర్ఘంకానూ సాగాయని భారత్ తెలిపింది. ఉగ్రవాదుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పాక్ కు అందించింది. పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, తదితర నేతలను అరెస్ట్ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. కాగా పంజాబ్ లోని మోహాలిలో అదుపులోకి తీసుకున్న అష్ఫాక్ అహ్మద్, హఫీజ్ అబ్దుల్ షకుర్, ఖాసింజాన్ నుంచి మారణాయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఓ పాకిస్తాన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.