ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం | JeM Terrorist Cop Killed And Five Injured In Encounter In J And K | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం

Published Thu, Jan 13 2022 12:18 PM | Last Updated on Thu, Jan 13 2022 1:34 PM

JeM Terrorist Cop Killed And Five Injured In Encounter In J And K - Sakshi

JeM Terrorist Cop Killed And Five Injured In Encounter: జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో జరిపిన ఎదురుకాల్పుల్లో  జైషే మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారని సమాచారం. కుల్గాం జిల్లాలో ఉగ్రమూకల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కార్డన్ సెర్చ్​ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు.

అయితేవారు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో వారు ఎదురుకాల్పులతో ప్రతిఘటించారు. ఈ మేరకు  అధికారులు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం వల్ల సెర్చ్​ ఆపరేషన్​ కాస్తా ఎన్​కౌంటర్​కు దారితీసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్​ కొనసాగుతోందని వెల్లడించారు.  

(చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement