
పట్నా : పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్ భాగల్‌పూర్‌కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రతన్ ఠాకూర్ తండ్రి ఏఎన్‌ఐతో మాట్లాడారు.
‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భరతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment