50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం.. | Arrange Rs 50 crore or we will kill Mamata Banerjee, Jaish-e-Mohammad members writes to Eastern Railway | Sakshi
Sakshi News home page

50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం..

Published Tue, Dec 13 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం..

50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం..

కోల్కత్తా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామంటూ తూర్పు రైల్వేకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఉన్నపలంగా రూ.50 కోట్లు సమకూర్చాలని లేదంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామని, హౌరా రైల్వేస్టేషన్ను పేల్చుతామని తీవ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ నుంచి తూర్పు రైల్వే కార్యాలయానికి ఈ లేఖ అందింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్క్వార్టర్స్కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు. 
 
ఈ లేఖను మాజీ దూరదర్శన్ ఉద్యోగి ఎస్సీ దాస్ రాసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.  జైషే-ఈ-మహ్మద్ గ్రూప్కు చెందిన ఉగ్రవాదులకు తన ఫ్లాట్స్లో ఆయన ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దూరదర్శన్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఫ్లాట్ను ఆయన కొనుగోలు చేశారని సమాచారం. ఆ లేఖను విచారణ కోసం పోలీసులకు అందించామని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌ బద్రినారాయణ్‌ చెప్పారు. ఆ లేఖలో రూ.50కోట్లు చెల్లించాలని రాశారని, ఫోన్‌ నెంబర్‌ కూడా రాశారని ఆయన తెలిపారు. అయితే ఆ లేఖలో రాసిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఎక్కడా లేదని తూర్పు రైల్వే సీపీఆర్ఓ ఆర్యన్ మహాపత్రా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement