శ్రీనగర్: షోపియాన్ జిల్లాలోని అంషిపోరా గ్రామంలో జరిగిన భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతయామయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి. అంషిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరకోగా వారిపై కాల్పులు మొదలయ్యాయి. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులలకు దిగి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం విశేషం. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో నిన్న ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో 24 గంటల్లో భారత బలగాలు ఆరుగురు టెర్రరిస్టులను కాల్చి చంపాయి.
కాగా, నిన్న హతమైన జైషే కమాండర్ ఐఈడీ తయారీలో నిపుణుడిగా తెలిసింది. గతంలో జరిగిన పలు ఐఈడీ పేలుడు ఘటనల్లో అతడు బాధ్యుడిగా ఉన్నట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇక నాగర్-చిమ్మర్ ఎదురు కాల్పుల్లో ముగ్గరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. అమర్నాథ్ యాత్రికులపై దాడులే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం. అయితే, ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి.. ఏరివేస్తున్నామని కశ్మీర్ రెండో సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
(పాక్ దుశ్చర్య, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి)
#ShopianEncounterUpdate: . So far 03 #unidentified #terrorists killed. #Operation going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/ojP21idGuG
— Kashmir Zone Police (@KashmirPolice) July 18, 2020
Comments
Please login to add a commentAdd a comment