ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించాడనే వార్తలు వదంతులేనని పాక్ మీడియా కొట్టిపారేయగా, తాజాగా మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి తరలించినట్టు వార్తలొచ్చాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి భావల్పూర్‌లోని జైషే మహ్మద్ క్యాంప్‌నకు తరలించారు. మసూద్ అజర్ చనిపోయాడనే వదంతుల నేపథ్యంలో ఆయన తరలింపుపై సమాచారం గందరగోళానికి తావిస్తోంది. (మసూద్ సజీవం : పాక్ మీడియా)
కాగా, మసూద్ అజర్ మరణించలేదని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ స్పష్టం చేసింది. మరోవైపు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment