
శ్రీనగర్: గణతంత్ర వేడుకలకు ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో తనకు తానే జైషే మొహమ్మద్‌కు కశ్మీర్ చీఫ్‌గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ ఉన్నాడు. గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడిలో యాసిర్ పాలుపంచుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాల్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఖారీ ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని, అతను ఉగ్ర నియామకాలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను తరలించడం వంటివి చేస్తాడని తెలిపారు. గత సంవత్సరం పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థను నిర్వీర్యం చేయగలిగామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ అన్నారు.