న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు.
‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment