కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం | Jammu Kashmir Three JeMTerrorist Deceased In Encounter At Avantipora | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

Published Sat, Aug 21 2021 9:59 AM | Last Updated on Sat, Aug 21 2021 10:17 AM

Jammu Kashmir Three JeMTerrorist Deceased In Encounter At Avantipora - Sakshi

ఫైల్‌ఫోటో

కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement