కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం | 3 Terrorists Shot Dead In Jammu Kashmir One Was Involved In Civilian Killing | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Published Tue, Oct 12 2021 10:49 AM | Last Updated on Tue, Oct 12 2021 10:58 AM

3 Terrorists Shot Dead In Jammu Kashmir One Was Involved In Civilian Killing - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరిని ముఖ్తర్‌ షాగా గుర్తించారు. ఇతడు గతంలో బిహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌ను హత్య చేసిన అనంతరం సోఫియాన్‌కు పారిపోయాడు. దీని గురించి కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్విట్‌ చేశారు. 
(చదవండి: కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి)

సోఫియాన్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దాడిలో ఈ ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరు లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. తొలుత వీరిని లొంగిపోమని సూచించామని... కానీ వారు వినకుండా తమపై కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. దాంతో తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని.. ఈ క్రమంలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా నేరపూరిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని.. సోదాలు కొనసాగుతున్నాయిన తెలిపారు. 

చదవండి: కశ్మీర్‌లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement