న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్ అజర్ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు.
కాగా, ఓ స్ధానిక చానెల్ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్ తరచూ డయాలసిస్ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్ యూజర్ అషన్ ఉలా మియాఖల్ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment