Urfi Javed Accuses Man Of Harassment Blackmailing Her - Sakshi
Sakshi News home page

Urfi Javed: 'శృంగారం చేయాలంటూ రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'

Aug 15 2022 5:09 PM | Updated on Aug 15 2022 6:13 PM

Urfi Javed Accuses Man Of Harassment Blackmailing Her - Sakshi

'ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్‌ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్‌ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది.

ఉర్ఫీ జావేద్‌.. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్‌ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్‌ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్‌ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్‌ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ అతని ఫొటోను షేర్‌ చేసింది ఉర్ఫీ జావేద్‌. ''ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్‌ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్‌ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది. అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది.

చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్‌.. కన్నీరు పెట్టుకున్న నటి

''నేను 1 తేదిన గోరేగావ్ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాను. 14 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబయి పోలీస్‌ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా'' అని ఉర్ఫీ రాసుకొచ్చింది. అలాగే తనను వేధిస్తున్న వ్యక్తి పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని కూడా తెలిపింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌లను సైతం షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement