
కొయ్యూరు: విజయవాడకు 40 కిలోల గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్‌ఐ దాసరి నాగేంద్ర తన సిబ్బందితో కలిసి ఆదివారం మండలంలోని చీడిపాలెం రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల– చాపరాతిపాలెం రహదారి నుంచి కాకరపాడు వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, గంజాయి బయట పడింది.
ఆరుగురు యువకులను అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన కొండా యహోవ, తుమ్మల మనోజ్, మేరుగు చందు, షేక్ జానీ, జి. సాయిజగదీశ్వరరావుతోపాటు వారికి గంజాయి అమ్మిన పాడేరు మండలం ఇడ్డుపల్లికి చెందిన వంతల సుమన్‌లను అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. రెండు రోజుల క్రితం గుడ్లపల్లి సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
(చదవండి: యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్)
Comments
Please login to add a commentAdd a comment