ganjai seezed
-
గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితుల అరెస్టు
కొయ్యూరు: విజయవాడకు 40 కిలోల గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్ఐ దాసరి నాగేంద్ర తన సిబ్బందితో కలిసి ఆదివారం మండలంలోని చీడిపాలెం రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల– చాపరాతిపాలెం రహదారి నుంచి కాకరపాడు వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, గంజాయి బయట పడింది. ఆరుగురు యువకులను అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన కొండా యహోవ, తుమ్మల మనోజ్, మేరుగు చందు, షేక్ జానీ, జి. సాయిజగదీశ్వరరావుతోపాటు వారికి గంజాయి అమ్మిన పాడేరు మండలం ఇడ్డుపల్లికి చెందిన వంతల సుమన్‌లను అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల క్రితం గుడ్లపల్లి సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. (చదవండి: యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్) -
గంజాయి సరఫరా: ఇద్దరు కానిస్టేబుళ్ల కీలక పాత్ర
ఖమ్మం క్రైం: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయా ల్సిన పోలీసులే ఆ పనికి తెగబడ్డారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన జీఆర్పీ కానిస్టేబుల్ ఒకరు గంజాయి రవాణాలో చిక్కిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యవహారం పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది. ఈ దందాలో ఓ జైలు వార్డర్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఘటనలో ఐదుగురి పాత్ర ఉండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కానిస్టేబుళ్లు భారీ ఎత్తున స్మగ్లింగ్ సాగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పరారీలో ముగ్గురు.. ఖమ్మం పోలీసు హెడ్ క్వార్టర్లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, భద్రాద్రి కొత్తగూడెంలోని హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న మరో ఏఆర్ కానిస్టేబుల్ కొంత కాలంగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఖమ్మం మమత రోడ్డులోని హార్వెస్ట్ స్కూల్ సమీపంలో మంగళవారం గంజా యి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం అర్బన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరి వద్ద తనిఖీ చేయగా ఐదు కేజీల గంజాయి లభించినట్లు ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. వీరిని విచారించగా.. ఖమ్మంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కొండ సతీశ్, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రైతు పల్లెబోయిన వెంకటేశ్వరుగా తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తమ సమీప బంధువైన కారేపల్లి మండలం తుడితెలగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొనుగోలు చేసిన ఐదు కేజీల గంజాయిని కానిస్టేబుల్ సతీష్‌కు ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపాడు. ఈ కేసులో భద్రాద్రి జిల్లా కానిస్టేబుల్, విద్యార్థితో పాటు ఖ మ్మం జైలు వార్డర్ కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. జైలుకు వచ్చే నేరస్తులతో పరిచయం ఓ కానిస్టేబుల్, రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా ఖమ్మం జైలు వార్డర్‌తోపాటు మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో జైలు వార్డర్.. జైలుకు వచ్చిన స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా ఈ దందాలోకి దిగినట్లు సమాచారం. ఇద్దరు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత నేరస్తుల ద్వారా గంజాయి ఎక్కడ కొనాలి, ఏయే మార్గాల్లో తరలిస్తే సాఫీగా రవాణా సాగుతుందో తెలుసుకుని వీరు గంజాయి దందా చేస్తునట్లు సమాచారం. భారీగా స్మగ్లింగ్..? గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ భారీ ఎత్తున దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా వీరు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిసింది. వీరికి స్థానికంగా ఉండే గంజాయి అమ్మకందారులతో కూడా పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకోవాల్సిన పోలీసులే స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడంతో పోలీసు శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
-
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం : డీఐజీ రంగనాథ్
-
రూ.27 లక్షల గంజాయి పట్టివేత
సాక్షి, చింతూరు (రంపచోడవరం) : ఆంధ్రా నుంచి కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు.చింతూరు మండలం చట్టిలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి పట్టుబడింది. దీనిపై చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మీడియాకు వివరాలు వెల్ల డించారు. లారీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు చింతూరు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్‌కుమార్ చట్టిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వైపునకు వెళుతున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ లారీని తనిఖీ చేయగా 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 36 ప్లాస్టిక్ సంచుల్లోని 900 కిలోల గంజాయి లభ్యమైందని డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రాజు అనే వ్యక్తి వద్ద తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. తాను, రాజు కలసి విశాఖ జిల్లా దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి జిప్సమ్ అడుగున లారీలో లోడ్ చేశామని తెలిపాడు. గంజాయి లోడు లారీని కర్నాటకకు తీసుకురావాలని చెప్పి తన ఓనర్ రాజు బస్సులో వస్తానని చెప్పాడని డ్రైవర్లో విచారణలో వెల్లడించాడని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.27 లక్షలు ఉంటుందని, దానికి పంచనామా నిర్వహించి లారీని సీజ్ చేసి డ్రైవర్ రియాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పోలినాయుడు, మోతుగూడెం రేంజర్ ఉషారాణి, చెక్‌పోస్టు ఇన్చార్జి భాస్కర్ పాల్గొన్నారు. -
117 కిలోల గంజాయి పట్టివేత
రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం వేర్వే రుగా రైళ్లలో తరలిస్తున్న గంజాయి అక్రమ రవాణా ముఠాలను జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. హర్యానాలోని ప్రీతినగర్ పంచ్కులవాసులు గీతా బౌరి, పూజ బౌరీ, కమలా బగిడి, గంగా బౌరీలు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హ్యాండ్ బ్యాగుల్లో 75 కిలోల ఎండు గం జాయి ప్యాకెట్లు తరలిస్తుండగా వరంగల్ స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. మరో ఘటనలో ఒడిశా లోని కోరాపుట్ జిల్లా కులార్సింగ్ ప్రాంతానికి చెం దిన బిస్వంత్ సేతీ, మిరా సేతీ, రాజు సేతీ, పునమా ముత్యం ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 42 కిలోల ఎండు గం జాయిని తరలిస్తూ వరంగల్ స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వీరందరూ కూలీలని, ఈ రెండు కేసుల్లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో ఆరుగురు మహిళలున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద 117 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
కారులలో గంజాయ్
మోతుగూడెంలో 200 కిలోలు స్వాధీనం దీని విలువ రూ.10 లక్షలు ఇప్పనపాడులో 161 కిలోలు.. విలువ రూ.8.05 లక్షలు రెండు కేసుల్లో ఆరుగురి అరెస్ట్ మూడు కారులు స్వాధీన ఇంతవరకూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనే అత్యంత రహస్యంగా తరలించే గంజాయి.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో యథేచ్ఛగా రవాణా అయిపోతోంది. అడిషనల్ ఎస్పీ దామోదరం ఇచ్చిన సమాచారంతోనే మండపేట పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకోవడం విశేషం. జిల్లాలో సోమవారం రెండు సంఘటనల్లో రూ.18.05 లక్షల విలువ జేసే 261 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి, గంజాయి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు. ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేటలో హైవేపై ప్రమాదానికి గురైన కారులోంచి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు వివరాలను మాత్రం అక్కడి పోలీసులు వెల్లడించలేదు. నిందితులు కారు విడిచి వెళ్లపోవడంతో అక్కడ అరెస్ట్‌లు చోటుచేసుకులేదు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులు..ఈ కేసులోకేవలం పొట్ట కూటి కోసమే గంజాయి రవాణా చేస్తున్నారా? లేక వారి వెనుక పెద్దల హస్తాలు ఉన్నాయా? అనేది పోలీసులే తేల్చాల్సిఉంది. గంజాయి రవాణా క్రమేపీ పెరిగిపోతున్నందున.. ఈ విషయంలో పోలీసులు ఒత్తిడులకు లొంగిపోతే.. భవిష్యత్తులో పెను ముప్పు తప్పకపోవచ్చు. మోతుగూడెం (రంపచోడవరం) : విశాఖ జిల్లా సీలేరు నుంచి తెలంగాణలోని వరంగల్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని సోమవారం సాయంత్రం జెన్కో చెక్‌పోస్టు వద్ద మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.కిషోర్ ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. విశాఖ జిల్లా సీలేరు ప్రాంతం నుంచి మోతుగూడెం మీదుగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సాయంత్రం మోతుగూడెం జెన్కో చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సీలేరు వైపు నుంచి వస్తున్న ఏపీ 36 ఏఎస్ 3951 నెంబరు కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 200 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన చింతల గంగరాజు, మహబూబుబాద్ జిల్లాకు బానోతు సుమన్‌లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయిని ఎమ్మార్వో తేజేశ్వరరావు సమక్షంలో స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేసినట్టు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రంపచోడవరం కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు. మండపేటలో 161 కేజీలు స్వాధీనం ఇప్పనపాడు (మండపేట) : మండలంలోని వేములపల్లి మీదుగా తరలిస్తున్న 161 కిలోల గంజాయిని మండపేట రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8.05 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ ఎంబీఎం మురళీకృష్ణ విలేకరులకు వివరించారు. ద్వారపూడి శివారు వేములపల్లి మీదుగా ఆదివారం రాత్రి గంజాయి రవాణ చేస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదరం సమాచారం ఇచ్చారన్నారు. దీంతో ఇందిరమ్మ కాలనీ సమీపంలోని తుంగపాడు రూరల్ సీఐ కోనాల లక్ష్మణరెడ్డి, తహసీల్దార్ మేకా వెంకటేశ్వర్లు, ఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. మహేంద్ర కంపెనీకి చెందిన కారును తనిఖీ చేస్తుండగా సీట్లు కింద ఉంచిన 161 కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 69 ప్యాకెట్లలో ఈ గంజాయిని పార్శిల్ చేశారు. రంగంపేట మండలం సుబద్రంపేటకు చెందిన యాళ్ల భాస్కరరావు, అతని అనుచరులు కేతా నాగేశ్వరరావు, బక్కా సురేష్, రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు సమీపంలోని ఆర్అండ్బీ కాలనీకి చెందిన డ్రైవర్ బి.సూర్యకనకరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో గంజాయి తరలిస్తు పట్టుబడిన వారుగా గుర్తించారు. ఏజెన్సీ పరిధిలోని లంబసంగి, చింతూరు తదితర గ్రామాల నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబాయికి ఎగుమతి : ఏజెన్సీలో సేకరించిన గంజాయిని హైదరాబాద్ మీదుగా ముంబాయికి తరలిస్తుంటారని పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో కిలో గంజాయిని రూ.5 వేలకు కొనుగోలు చేసి ముంబాయి వ్యాపారులకు రూ. 10 వేలకు విక్రయిస్తారని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ముంబాయికి చేరగానే దీని ఖరీదు రూ.లక్షల్లోకి చేరుతుందన్నారు. గంజాయిని ఏజెన్సీలో ఎక్కడ కొనుగోలు చేసింది, హైదరాబాద్‌లో ఎవరికి విక్రయిస్తుంది విచారిస్తున్నామన్నారు. నిందితులను ఆలమూరు కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకున్న సీఐ లక్ష్మణరెడ్డి, ఎస్సై శివప్రసాద్, రూరల్ పోలీసులను డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. అగిపోయిన కారులో.. ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : మండలంలోని చిన్నింపేట జాతీయ రహదారిపై సోమవారం కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన గంజాయి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి హైవేలోని వేగ నిరోధకాన్ని ఢీకొంది. దీంతో ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో కారును నిందితులు వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం పోలీసులు కారును పరిశీలించిగా ఢిక్కీలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు ఎస్సై ఎం.అప్పలనాయుడు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
ట్యాంకర్లో గంజాయి తరలింపు
2,150.450 కిలోల స్వాధీనం ముగ్గురి అరెస్ట్ పరారీలో ఇద్దరు నిందితులు రాజమహేంద్రవరం రూరల్ : ఎవరికి అనుమానం రాకుండా ట్యాంకర్లో గంజాయిని తరలించాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. పోలీసులు తనిఖీల్లో ట్యాంకర్లో తరలిస్తున్న 2,150.450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒSలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారంపై తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు సూచనల మేరకు బొమ్మూరు పీఎస్ ఇ¯ŒSస్పెక్టర్ పి.కనకారావు, ఏజీఎస్ పార్టీ ఎస్సై శివాజీ, సిబ్బంది రాజానగరం మండలం దివా¯ŒSచెరువు గ్రామం గామ¯ŒS బ్రిడ్జి వద్ద హైవేపై వాహనాలు తనిఖీ చేశారు. ఆయిల్ ట్యాంకర్‌ను తనిఖీ చేస్తుండగా, అందులో 76 బస్తాల గంజాయి మూటలు బయటపడ్డాయి. వాటి విలువ విలువ రూ.1.10 కోట్లు ఉంటుంది. గంజాయి రవాణా చేస్తున్న విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన గుమ్మళ్ళ పైడిబాబు, లారీ డ్రైవర్ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన కాశిరెడ్డి రహా నరసింహామూర్తి, లారీ క్లీనర్ జాన ప్రభులను రాజానగరం ఈఓపీఆర్డీ, వీఆర్వోల సమక్షంలో అరెస్ట్ చేశారు. గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లు, రూ.2700 స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానం రాకుండా ట్యాంకర్లో.. ఇటీవల గంజాయిని ట్రావెల్స్ వ్యాన్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారని, అయితే ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తే అనుమానం రాదన్న ఉద్దేశంతో నిందితులు ఈ మార్గం ఎంచుకున్నట్టు అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి తెలిపారు. విశాఖ నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో సంగ్లీ పట్టణానికి చెందిన సమీర్‌కు ఈ గంజాయిని అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. గుమ్మళ్ళ పైడిబాబు, మణి గంజాయి రవాణా చేస్తున్నారన్నారు. గతంలో పైడిబాబుపై ఒక గంజాయి కేసు నమోదైందన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పైడిబాబు, భాగస్వామి మణితో పాటు మహారాష్ట్రకు చెందిన సమీర్ కోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. గంజాయిని పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్‌బాబు, ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు, ఎస్సైలు కిషోర్‌కుమార్, నాగబాబు పాల్గొన్నారు. -
200 కిలోల గంజాయి పట్టివేత
ఐదుగురి అరెస్ట్.. మూడు కార్లు సీజ్ చింతూరు (రంపచోడవరం) : రెండు వేర్వే రు కేసుల్లో ఏ జెన్సీ డొంకరా యి నుంచి మహా రాష్ట్ర కు గంజాయిని తరలిస్తున్న ఐ దుగురిని గురువారం అరెస్ట్ చేసిన ట్టు చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చింతూరు మండలం గొర్లగూడెం జంక్ష¯ŒS వద్ద తనిఖీలు చేస్తుంటే రెండు కార్లలో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కా ర్లను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో మహారాష్ట్ర రాష్ట్రం ధూలే జి ల్లాకు చెందిన రమేష్‌పాటిల్, సంజ య్ భగవా¯ŒS చౌదరి, ప్రవీణ్ యువరాజ్ పాటిల్, దొండైచా జిల్లాకు చెం దిన దీపక్ తుకారంలను అరెస్ట్ చేశామన్నారు. మరో ఘటనలో ఇదే ప్రాం తంలో మరో కారులో తరలిస్తున్న 60 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. గంజాయి రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రఘువీర్‌రాయ్‌ను అరెస్టు చేసి కారును సీజ్ చేశామన్నారు. స్వా« దీనం చేసుకున్న గంజాయి విలువ రూ.పది లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోçßæనరావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
540 కేజీల గంజాయి పట్టివేత
సారా బట్టీల ధ్వంసానికి వెళ్లిన మహిళల కంటపడిన గంజాయి ఎక్సైజ్ అధికారులకు అప్పగింత సాహస చర్యకు అభినందనలు శంఖవరం : శంఖవరం మండలం పెదమల్లాపురం సమీప గ్రామ రహదారి పక్క పొదల్లో స్మగ్లర్లు రవాణాకు సిద్ధం చేసిన 540 కేజీల గంజాయి మూటల్ని గిరిజన మహిళలు గుర్తించి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన ఘటన ఇది. పెదమల్లాపురం పరిసర గ్రామాల్లో నాటుసారా తయారీని అరికట్టేందుకు గిరిజన మహిళలు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా చేతికర్రలు పట్టుకుని తయారీ కేంద్రాలపై దాడులు చేస్తూ మంగళవారం రాత్రి వేళంగి శివారు డి మల్లాపురం, పోలవరం గ్రామాల మధ్య పొలాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో రహదారి పక్కన తుప్ప ల్లో దాచిన 18 గంజాయి మూటలు వీరి కంట పడ్డాయి. ఒక్కో బస్తాలో 30 కేజీల గంజాయి ఉంది. వాటిని మోసుకొచ్చి పెదమల్లాపురం పంచాయతీ కార్యాలయం లో భద్రపరిచి కాపలాగా ఉన్నారు. ఉదయాన్నే అధికారులకు, పాత్రికేయులకు సమాచారం అందించారు. ఎక్సైజ్ ఎస్పీ కార్యాలయ సీఐ జీవీ లక్ష్మి,, ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎస్ఐ నజాముద్దీన్, స్పెషల్ టీమ్ ఎస్.ఐ. బి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలోని సిబ్బంది పంచాయతీ కార్యాలయానికి వచ్చి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీ నుంచి మూటలు కట్టించి కొండల మీదుగా ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ నజాముద్దీ¯ŒS అన్నారు. అక్కడ కేజీ రూ.2,500లకు కొనుగోలు చేస్తారని, బయటి ప్రాంతాలకు వెళ్లి దీన్ని రూ.10 వేలకు అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని వివరించారు. గంజాయిని¬ పట్టుకుని అప్పగించినవారిలో గిరిజన మహిళలు కించు అప్పయమ్మ, జర్తా సరస్వతి, బోడోజు లక్ష్మి, మాడెం కామయమ్మ, తొంటా బోడమ్మ, బూసరి గొంతమ్మ తదితరులున్నారు. వీరిని ఎక్సైజ్ అధికారులు అభినందించారు. -
గంజాయి తరలింపు కేసులో నలుగురి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్ : టెంపోవ్యా¯ŒSలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు అర్బ¯ŒS జిల్లా తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారికి అందిన సమాచారంపై, తన ఆదేశాల మేరకు బొమ్మూరు సీఐ కనకారావు, ఎస్ఐలు కిషోర్‌కుమార్, నాగబాబు, సిబ్బందితో కలసి హుకుంపేట జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారని చెప్పారు. టెంపో వ్యా¯ŒSను తనిఖీ చేస్తుండగా పది బస్తాలలో ఉంచిన 277 కిలోల గంజాయి బయటపడిందన్నారు. దీంతో వ్యా¯ŒS డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి నుంచి 277 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రూ.12,730 నగదు, వ్యా¯ŒS స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులైన రాజవోలు గాయత్రినగర్‌కు చెందిన గొలుగూరి వెంకట కృష్ణారెడ్డి, గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన చింతల రాంబాబు, రావులపాలెంకు చెందిన పడాల చంద్రశేఖరరెడ్డి, రావులపాలెం మండలం బొక్కావారిపాలెంకు చెందిన కోనా వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. బొమ్మూరు సీఐ కనకారావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు
110 కిలోల గంజాయి స్వాధీనం చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్రా, తెలంగాణా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఏడుగురు సభ్యులుగల అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను చింతూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎ. పల్లపురాజు శనివారం మీడియాకు తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఏడుగురాళ్లపల్లి సమీపంలోని మద్దిగూడెం జంక్షన్ వద్ద చింతూరు సీఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా తారసపడిన రెండు కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 110 కిలోల గంజాయి, మరో కారులో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. నిందితులను ప్రశ్నించగా గంజాయి రవాణా వివరాలు తెలిశాయని పల్లపురాజు తెలిపారు. పక్కా ప్లాన్‌తో స్మగ్లింగ్ కర్ణాటకకు చెందిన సంతోష్ తుకారాం రాథోడ్, దేవదాసు పవారి, విశ్వనాథ దశర థ హైదరాబాద్‌లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ఒకసారి గంజాయి స్మగ్లింగ్ చేయడంతో మంచిలాభాలు వచ్చాయి. దాంతో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌తో కలసి మరోమారు గంజాయి స్మగ్లింగ్ చేయాలని భావించారు. దీనికోసం హైదరాబాద్‌కు చెందిన హనుమకుమార్, భద్రాచలానికి చెందిన దాసరి సతీష్ కార్లను కిరాయికి మాట్లాడుకున్నారు. ఒడిశాకు చెందిన జగ్గారావు, భద్రయ్య, సన్యాసిరావుల వద్ద వీరు చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒక వాహనంలో గంజాయి, మరో వాహనంలో నిందితులు ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోయారు. గంజాయి విక్రయించిన జగ్గారావు పోలీసులకు చిక్కగా మరో ఇద్దరు పరారైనట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్దనుండి రూ. 40,500, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను శనివారం రిమాండ్ కోసం కోర్టుకు తరలించామన్నారు. ఇన్‌ఛార్జి డీఎస్పీ పల్లపురాజు వెంట సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై గజేంద్రకుమార్ ఉన్నారు.