తన సహోద్యోగిని నరికి చంపిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు. ఈ మేరకు 38 ఏళ్ల నేపాల్ జాతీయుడు రాజేష్‌కుమార్ నేపాలీ అలియాస్ యజ్ఞప్రసాద్ కాలూరామ్ పుఖ్రేల్ (జైసీ)ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి అతనికి విముక్తి లభించేలా చేసింది. ఏప్రిల్ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అదనపు సెషన్స్ జడ్జీ పేర్కొన్నారు.
నిందితుడు బద్లాపూర్‌లోని కర్జాత్ హైవేపైన కత్రాప్ వద్ద చైనీస్ హోటల్‌లో పనిచేసేవాడు. ఏప్రిల్ 14, 2017న బాధితుడు జగత్ తేగ్‌బహదు షాహీతో సహ ఆ హోటల్ యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమేఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి శరీరాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి (రాజేష్ కుమార్)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడిని నొర్దోషిగా ప్రకటిస్తూ ఊరట కల్పించింది కోర్టు.
(చదవండి: బ్రిటన్ వెళ్లి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!: మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment