beheading
-
తల నరికి చంపిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏం చెప్పిందంటే...
తన సహోద్యోగిని నరికి చంపిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు. ఈ మేరకు 38 ఏళ్ల నేపాల్ జాతీయుడు రాజేష్‌కుమార్ నేపాలీ అలియాస్ యజ్ఞప్రసాద్ కాలూరామ్ పుఖ్రేల్ (జైసీ)ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి అతనికి విముక్తి లభించేలా చేసింది. ఏప్రిల్ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అదనపు సెషన్స్ జడ్జీ పేర్కొన్నారు. నిందితుడు బద్లాపూర్‌లోని కర్జాత్ హైవేపైన కత్రాప్ వద్ద చైనీస్ హోటల్లో పనిచేసేవాడు. ఏప్రిల్ 14, 2017న బాధితుడు జగత్ తేగ్బహదు షాహీతో సహ ఆ హోటల్ యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమేఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి శరీరాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి (రాజేష్ కుమార్)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడిని నొర్దోషిగా ప్రకటిస్తూ ఊరట కల్పించింది కోర్టు. (చదవండి: బ్రిటన్ వెళ్లి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!: మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
రూ.500 కోసం దారుణం.. తల నరికి చేతిలో పట్టుకుని 25 కి.మి..!
గువాహటి: క్షణికావేశంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు కొందరు. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై వేసిన రూ.500 పందెంపై మొదలైన ఓ గొడవ వ్యక్తి ప్రాణాలు తీసింది. క్షణికావేశంలో ఎదుటి వ్యక్తి తల నరికి చేతిలో పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ సంఘటన అస్సాంలోని సొనిత్‌పుర్ జిల్లాలో సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫూట్‌బాల్ మ్యాచ్ అనంతరం గొడవ జరిగినట్లు చెప్పారు. ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముందు నిందితుడు తునిరామ్ మాద్రిని బాధితుడు బోయిలా హెమ్‌రామ్ రూ.500 అప్పు అడిగాడు. అందుకు నిందితుడు నిరాకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నిందితుడు బెట్లో ఓ మేకను గెలుచుకున్నాడు. ఆ మేకును కోసేందుకు తనతో రావాలని బోయిలా హెమ్‌రామ్‌ను కోరాడు నిందితుడు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. బోయిలా హెమ్‌రామ్‌ను హత్య చేసిన తర్వాత అతడి తలతో ఇంటికి వెళ్లాడు నిందితుడు. అక్కడే ఉన్న అతడి సోదరుడు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఆ తర్వాత 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్‌కు తలతో వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసేందుకు ఉపయోగించిన కొడవలిని సైతం తీసుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
గొర్రెకు బదులు తమ్ముడి మెడ నరికేశాడు
మదనపల్లె: కనుమ పండుగ సంబరాల నేపథ్యంలో గొర్రె తల నరకడానికి బయలుదేరిన ఓ వ్యక్తి మద్యం మత్తులో క్షణికావేశానికి గురై వరుసకు తమ్ముడయ్యే యువకుడి మెడ నరికి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వందలాదిమంది చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటనలో తల తెగిన యువకుడు మరణించగా.. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వలసపల్లె గ్రామానికి చెందిన తలారి లక్ష్మన్న, గంగులమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త లక్ష్మన్న ఎనిమిదేళ్ల క్రితం చనిపోగా పెద్ద కుమారుడు రాయలపేటలో కేబుల్ పని చేసుకుంటుండగా, రెండో కుమారుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడో కుమారుడైన తలారి సురేష్ (26) అవివాహితుడు కావడంతో కూలి పనులు చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. సురేష్‌కు వరుసకు పెదనాన్న కుమారుడైన తలారి చలపతి (55) కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటోంది. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా స్వల్ప వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, గ్రామంలో జరిగే కనుమ ఉత్సవాల్లో అమ్మవారికి జంతు బలులు ఇచ్చేటప్పుడు ఏటా తలారి చలపతి గొర్రె తల నరకడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామమంతా కనుమ సంబరాల్లో హడావుడిగా ఉంది. గ్రామస్తులు రామాలయం నడి వీధిలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు. మద్యం మత్తులో ఘాతుకం కాగా, తలారి సురేష్, అతడి పెదనాన్న కుమారుడు తలారి చలపతి ఆదివారం ఉదయం నుంచీ మద్యం మత్తులో తూగుతున్నారు. సంబరాల్లో భాగంగా అమ్మవారికి బలిచ్చే గొర్రెను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికీ తీసుకెళ్లి పూజలు చేయిస్తూ నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సురేష్ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ గొర్రె వెంట బయలుదేరాడు. తలారి చలపతి చేతితో వేట కొడవలి పట్టుకుని గొర్రెతోపాటు నడుస్తుండగా రెండుమూడుసార్లు సురేష్ అతడిపై తూలిపడ్డాడు. ఆగ్రహించిన చలపతి అమ్మవారి గొర్రెకు చందాలు ఇచ్చే స్తోమత లేదు కానీ డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా చిన్నపాటి గొడవ జరిగింది. చలపతి డప్పుల వారిని నిలిపేయాల్సిందిగా ఆదేశించడంతో తాను డ్యాన్సు వేయాల్సిందేనని సురేష్ పట్టుపట్టాడు. దీంతో చలపతి ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న వేట కొడవలితో ఒక్క ఉదుటున సురేష్ మెడపై నరికాడు. మెడ సగ భాగం వరకు తెగిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి గ్రామస్తులు భయకంపితులై ఇళ్లల్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సురేష్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన రక్తస్రావం కావడంతో అప్పటికే సురేష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎల్పీజీ ధరల పెంపుతో... భగ్గుమన్న కజకిస్తాన్
మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి. -
ఫ్రాన్స్‌లో టీచర్ తలనరికిన యువకుడు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక ఉపాధ్యాయుడిని తలనరికి దారుణంగా హత్య చేశారు. చెచెనీయాకు చెందిన 18ఏళ్ల యువకుడు ఇందుకు బాధ్యుడని పోలీసులు భావిస్తున్నారు. టీచర్‌ను చంపిన అనంతరం సదరు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. శుక్రవారం ఒక పాఠశాలలో ప్రవక్తకు సంబంధించిన క్యారికేచర్లను ప్రదర్శించినందుకు టీచర్‌ను హత్య చంపేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ఆరంభించారు. మూడువారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. క్యారికేచర్లు ప్రదర్శించారంటూ గత నెల పాక్‌కు చెందిన ఒక యువకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్‌కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు మాక్రాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. హత్యకు గురైన టీచర్‌పై ఒక స్టూడెంట్ తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు. -
బండారం బయటకు.. పాక్ ఇప్పుడేమంటుందో
న్యూఢిల్లీ: భారత సైనికుడిని తాము చంపలేదంటూ బొంకిన పాకిస్థాన్ బండారం బయటపడింది. పాక్‌కు చెందిన ఉగ్రవాదులే ఆ పనిచేశారని నిరూపించేలా భారత సైన్యం ఆధారాలు కూడా సేకరించింది. పాకే ఈ నేరం చేసిందని వాటిని చూపిస్తూ కుండబద్ధలు కొట్టింది. ఈ నెల 22న భారత సైన్యం పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఓ భారత సైనికుడిని ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. మొండెం నుంచి తలను వేరు చేశారు. అయితే, మృతదేహంతోపాటు భారత ఆర్మీ పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది. ఘటన స్థలి వద్ద పాక్ మార్కింగ్‌తో ఉన్న ఆహార పదార్థాల పొట్లాలు, గ్రనేడ్లు, రాత్రి పూట చూసే అమెరికా బ్రాండ్‌కు చెందిన టెలిస్కోపులు, రేడియో సెట్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకొని పాక్ ప్రతి స్పందన తెలియజేసిన తర్వాత చెంపపెట్టులా మీడియాకు, అంతర్జాతీయ సమాజానికి చూపించారు. దీనిపై ఇప్పుడు పాక్ ఏం సమాధానం చెబుతోంది చూడాలి. -
వాళ్లు కనిపిస్తే తల నరికేయండి!
హిజ్రాలపై వివాదాస్పద పోస్టర్లు కరాచీ: హిజ్రాలు కనిపిస్తే తల నరికేయాలంటూ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో వెలిసిన వివాదాస్పద పోస్టర్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఈ పోస్టర్లు పెద్దసంఖ్యలో అంటించి ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌లో ఇటీవలికాలంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా షాపింగ్ మాల్స్ లోపల ఈ తరహా పోస్టర్లు వెలువడం హిజ్రాలను కలవరానికి గురిచేస్తున్నది. పొట్టపోసుకునేందుకు హిజ్రాలు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హిజ్రాలపై ఎలాంటి దాడులు జరగకుండా అలర్ట్ ప్రకటించామని, ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు ఉంచి ఉందని భావిస్తే పోలీసుల రక్షణ కోరవచ్చునని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ పోస్టర్లు వెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో హిజ్రాలు ఎవరూ కనిపించడం లేదని, వారి సంచారం తగ్గిందని స్థానిక షాపింగ్ మాల్ వద్ద పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు చెప్పారు. హిజ్రాలు తమ వ్యాపారాలకు అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక దుకాణాల యజమానులే ఈ పోస్టర్లు అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోస్టర్లను సమర్థిస్తున్న వ్యాపారులు.. పురుషులే హిజ్రాల వేషం వేసుకొని మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి వద్ద అడుక్కుంటూ చికాకు కల్పిస్తున్నారని, ఇలాంటివి సాగనివ్వమని అంటున్నారు. -
ప్రశ్నించినందుకు తల మొండెం వేరు చేశాడు
దళితుడి దారుణ హత్య డెహ్రాడూన్: తమ అగ్రకులస్తుల పిండి మరను వినియోగించి మలినం చేశాడంటూ ఓ దళితుడి తల నరికి చంపాడో ఉపాధ్యాయుడు! ఈ ఘటన ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లా కదారియా గ్రామంలో మంగళవారం జరిగింది. ‘సోహాన్ రామ్(31) కుందన్‌కు చెందిన మరలో గోధుమలు ఆడించి పిండిని తీసుకెళ్తుండగా.. పాఠశాల ఉపాధ్యాయుడు లలిత్ కర్ణాటక్ చూశాడు. సోహాన్ కులాన్ని దూషించి, అతడి వల్ల మర మలినమైందని అవమానించాడు. ఎందుకు దూషిస్తున్నావని సోహాన్ ప్రశ్నించగా లలిత్ కొడవలితో నరికి హత్య చేశాడు’ అని పోలీసులు చెప్పారు. సోహాన్‌ను గురువారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ పిండి మరను అగ్రకులస్తులు, దళితులూ వాడేవారని గ్రామస్తులు చెప్పారు. అయితే దసరా నేపథ్యంలో తాము అమ్మ వారికి నైవేద్యం పెట్టేందుకు పిండిని ఆడించాకే మరను దళితులు వినియోగించుకోవాలని అగ్రకులస్తులు ఆదేశించారన్నారు. -
అలాంటి వారి తలలు నరికేసే వాణ్ని: రాందేవ్
చండీగఢ్: యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మాతకీ జై' అని అనని వారిని తాను తలనరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చేయడం లేదని ఆయన అన్నారు. 'భారత్ మాతకీ జై' అనే నినాదం చేయడమంటే మాతృభూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. 'ఆరెస్సెస్ భేటీలో రాందేవ్ మాట్లాడుతూ తలలు నరికేస్తానని హెచ్చరించారు. ఇది హింసకు పిలుపునివ్వడమే. ప్రజలను బెదిరించడమే. ప్రధాని మోదీ రాందేవ్‌పై చర్య తీసుకోవాలి' అంటూ కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ట్వీట్ చేశారు. 'భారత్ మాతకీ జై' అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ 'దారుల్ ఉలూమ్ డియోబంద్' ఇటీవల ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము కూడా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నామని, తాము అందుకు బదులుగా 'హిందూస్తాన్ జిందాబాద్' అని నినదిస్తామని పేర్కొంది. అదేవిధంగా ముస్లిం నాయకుడైన అసదుద్దీన్ ఒవైసీ కూడా మతపరమైన ఆంక్షల వల్ల తాము ఆ నినాదాన్ని చేయబోమని పేర్కొన్నాడు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ 'భారత్ మాతకీ జై' అనని వాళ్లు దేశం విడిచివెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ అంశంపై చర్చ తీవ్రమైంది. మరోవైపు 'భారత్ మాతకీ జై' అంటేనే దేశభక్తులా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. -
తలలు నరుకుతాం
కోలకతా: 'జాతి వ్యతిరేక' వ్యాఖ్యల వివాదం దేశవ్యాప్తంగా రగులుతోంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లతో అట్టుడుకుతున్న బీర్భూమ్ జిల్లా సియురిలో స్థానిక బీజేపీ నేత అగ్నికి ఆజ్యం పోసే వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలించారు. పశ్చిమబెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపారు. ఎవరైనా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే తలలు నరుకుతామంటూ హెచ్చరించి వివాదాన్ని సృష్టించారు. ఇటీవల రగిలిన వివాదానికి నిరసనగా బీర్భూమ్లో జరుగుతున్న ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ జిందాబాద్ ' అని ఎవరైనా నినదిస్తే పైనుంచి 6 అంగుళాలు మేర కత్తిరించి పారేస్తామని హెచ్చరించారు. సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో 'అభ్యంతరకరమైన' పోస్ట్ పెట్టడంతో మంగళవారం బీర్భూమ్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఫేస్బుక్ లో ఈ కామెంట్ పెట్టిన విద్యార్థి సుజన్ ముఖర్జీ ఇంటిముందు కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. -
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. -
బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. ఐఎస్ ఇటీవల పాశ్చాత్య దేశాల పౌరులను చంపడం ఇది నాలుగోసారి. కాగా, ఐఎస్ మిలిటెంట్లు తమవద్ద బందీగా ఉన్న పీటర్ కేసింగ్ అనే అమెరికన్‌కు శిర చ్ఛేదం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ‘ఒబామా! సిరియాలోని షామ్లో మాపై దాడులు చేస్తున్నావు. అందుకు ప్రతీకారంగా మీ పౌరులను నరికి చంపుతాం’ అని హెచ్చరించారు. అలెన్ హత్యను ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా ఖండించారు. హంతకులను పట్టుకుంటామని ప్రతినబూనారు. కేసింగ్‌ను రక్షించడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని అమెరికా అధికారులు చెప్పారు. -
పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గట్టి హెచ్చరిక జారీచేశారు. తమ సైనికులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తగినరీతిలో జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. సైనికుల తలలు తీయడం లాంటి ఘటనలు జరిగితే అవసరమైనదానికంటే ఎక్కువగా, వేగంగా, ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. 26వ ఆర్మీ చీఫ్‌గా గురువారం సుహాగ్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు భారత సైనికుల తలలు నరికివేసిన ఘటనపై తగిన రీతిలోనే స్పందించామని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బ్రికమ్ సింగ్ సమర్థించుకున్నారు.