బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. ఐఎస్ ఇటీవల పాశ్చాత్య దేశాల పౌరులను చంపడం ఇది నాలుగోసారి.
కాగా, ఐఎస్ మిలిటెంట్లు తమవద్ద బందీగా ఉన్న పీటర్ కేసింగ్ అనే అమెరికన్‌కు శిర చ్ఛేదం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ‘ఒబామా! సిరియాలోని షామ్‌లో మాపై దాడులు చేస్తున్నావు. అందుకు ప్రతీకారంగా మీ పౌరులను నరికి చంపుతాం’ అని హెచ్చరించారు. అలెన్ హత్యను ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా ఖండించారు. హంతకులను పట్టుకుంటామని ప్రతినబూనారు. కేసింగ్‌ను రక్షించడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని అమెరికా అధికారులు చెప్పారు.