IS terrorists
-
పసిపిల్లల మాంసం తినిపించారు
ఐసిస్ చెర నుంచి బయటపడ్డ ఫాజియా సిడో అనే మహిళ భయంకరమైన విషయాలు వెల్లడించింది. తనతో పాటు ఇతర ఖైదీలతో పసి పిల్లల మాంసం తినిపించారని తెలిపింది! 2014లో ఇరాక్‌లోని సింజార్‌లో దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిడోను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. ‘‘తీసుకెళ్లాక మమ్మల్ని రోజుల తరబడి ఆకలితో ఉంచారు. తర్వాత అన్నం, మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. చాలా ఆకలితో ఉన్నందున వింత రుచి ఉన్నప్పటికీ తిన్నాం. తర్వాత అంతా అస్వస్థతకు గురయ్యాం. మేం తిన్నది పసి పిల్లల మాంసమని ఆ తర్వాత ఐఎస్ ఉగ్రవాదులు బయటపెట్టారు. యజిదీ పిల్లల మాంసమని చెప్పారు. తలలు నరికిన చిన్నారుల ఫొటోలు చూపించి, ‘ఇప్పుడు మీరు తిన్న మాంసం ఈ పిల్లలదే’ అని చెప్పారు. అది విని మాకు మతిపోయింది. ఓ మహిళ హార్ట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఓ తల్లి ఆ ఫొటోల్లో తన బిడ్డను గుర్తించి గుండె పగిలేలా ఏడ్చారు’’ అంటూ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఐసిస్ తమ బందీలకు మనుషుల మాంసం తినిపించిందని గతంలో వచి్చన ఆరోపణలను సిడో కథనం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని 2017లో యాజిదీ పార్లమెంటేరియన్ వియాన్ దఖిల్ తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఐసిస్ చెరలోనే... 2014లో ఉత్తర ఇరాక్‌లో మైనారిటీలైన వేలాదిమంది యాజిదీ మహిళలు, చిన్నారులను ఐసిస్ కిడ్నాప్ చేసింది. వారిలో సిడో ఒకరు. మరో 200 మంది యాజిదీ మహిళలు, పిల్లలతో కలిసి అండర్ గ్రౌండ్ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉన్నారు. కలుíÙత నీటితో కొందరు చిన్నారులు మృతి చెందారు. సిడోను అబూ అమర్ అల్–మక్దీసీతో సహా అనేక మంది జిహాదీ ఫైటర్లకు విక్రయించారు. ఆమెతోపాటు చాలా మందిని బానిసలుగా అమ్మారు. ఏళ్ల తరబడి హింస, దోపిడీ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్ రహస్య మిషన్ వల్ల ఆమె చెర నుంచి సిడో బయటపడ్డారు. తరువాత ఆమెను ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌కు పంపారు. అక్కడినుంచి జోర్డాన్‌కు ప్రయాణించి చివరికి ఇరాక్‌లోని తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నారు. సిడో ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలం బందీగా ఉన్నప్పటి మానసిక గాయాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె న్యాయవాది తెలిపారు. 2014 యాజిడీ మారణహోమం నుంచి 3,500 మందికి పైగా యాజిదీలను రక్షించారు. సుమారు 2,600 మంది గల్లంతయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహారాష్ట్రలో ఐసిస్ అనుమానితుల అరెస్ట్
సాక్షి, ముంబై : నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో థానే, ఔరంగాబాద్‌ల నుంచి బుధవారం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఈ తొమ్మిది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిర్బంధంలోకి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వీరి కదలికలను పసిగడుతున్న ఏటీఎస్ గత రెండు రోజులుగా థానే, ఔరంగాబాద్‌ల్లో వలపన్ని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి కొన్ని రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఏసిడ్ బాటిల్, పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
కోవర్ట్ ఆపరేషన్...! ఆత్మాహుతి దాడి నిరోధానికి..
హాలివుడ్ సినిమా యాక్షన్ సీన్లు తలదన్నేలా పద్దెనిమిది నెలల పాటు అత్యంత రహస్యంగా ఊహకందని రీతిలో సాగిన భద్రతాదళాల ఆపరేషన్ విజయవంతమైంది. దేశ రాజధానిపై ఉగ్రమూక పంజా విసరకుండా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ దోహదపడింది. దీని కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐసీస్ (ఇస్లామిక్ స్టేట్) దాడులకు సిద్ధమైన ఉగ్రవాదుల ప్రణాళికలు కూడా బట్టబయలయ్యాయి. భారత భద్రతా సంస్థల కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఐసీస్‌లోకి మన ఏజెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తి ద్వారా ఐఎస్ ఉగ్రవాదికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించడంతో పాటు దాడులకు అవసరమైన పేలుడుపదార్థాలు (ట్రిగ్గర్స్ లేకుండా) కూడా సరఫరా చేశారు. ఆఫ్గనిస్తాన్, దుబాయ్, ఢిల్లీల్లో సుదీర్ఘకాలం పాటు ఈ సూక్ష్మ పర్యవేక్షణ సాగింది. ఛెస్ ఆటలో మాదిరిగా భద్రతా దళాల అధికారులు ఓ వైపు పకడ్బందీ నిఘా కొనసాగిస్తూనే, అనువైన సమయం కోసం ఓపికగా ఎదురుచూశారు. ఇందులో ఉత్కంఠను రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి... పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ తీవ్రవాదుల బందం భారత్, తదితర ప్రాంతాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు 50 వేల డాలర్ల మొత్తాన్ని ఐసీస్ కార్యకలాపాల కోసం అఫ్గనిస్తాన్‌కు పంపించడాన్ని అమెరికన్ నిఘా వర్గాల సహకారంతో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్ టాప్ చేశాక అఫ్గనిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి న్యూఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వస్తున్నట్టు వెల్లడైంది. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన తీవ్రవాదితో స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు ఓ ఐఎస్ ఏజెంట్ అవతారంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఓ వ్యక్తిని పంపింది. ఈ వ్యక్తి ద్వారానే తీవ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో బసతోపాటు, పేలుడుపదార్థాలు సమకూర్చేలా చేశారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాదిపై నెలరోజుల పాటు నిరంతర నిఘా కోసం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఐఎస్ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అఫ్గనిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేయగలిగాయి. ఇటీవల అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారం ఇతడి వద్దే సేకరించారు. ప్రస్తుతం మరింత సమాచారం కోసం అతడిని విచారిస్తున్నారు. 2017 మే 22న యూకేలోని మాంఛేస్టర్ (23 మంది ప్రాణాలు కోల్పోయారు) లో జరిగిన బాంబుదాడి ఇతడి 11 మంది సహచరుల్లోని ఒకడి పనేనని తేలింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తి ఏవైతే పేలుడు పదార్థాలు వినియోగించాడో అలాంటి వాటినే ఢిల్లీకి వచ్చిన ఉగ్రవాది కూడా డిమాండ్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా అలాంటి ఆత్మాహుతిదాడికి తెగబడాలని భావించాడనేది స్పష్టమవుతోంది. గత సెప్టెంబర్‌లోనే ఈ అరెస్ట్ చోటుచేసుకున్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు బయటపెట్టారు. -
ఐఎస్ తీవ్రవాదుల లొంగుబాటు.. కానీ
కొబానె(సిరియా) : సిరియాలో ప్రజల జీవనం చాలా ఇబ్బందిగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వ దళాలకు, తీవ్రవాద గ్రూపులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సిరియా నగరం రఖాలో ఇస్లామిక్‌స్టేట్‌కు చెందిన 100 మందికిపైగా తీవ్రవాదులు శుక్రవారం లొంగిపోయారని అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. గత 24 గంటల్లో దాదాపుగా లొంగిపోయిన వందమంది తీవ్రవాదులను నగరం నుంచి వేరేప్రాంతానికి తరలించిట్లు తెలిపాయి. అయితే, వీరిలో విదేశీయులు మాత్రం రఖాలోనే పోరు సాగిస్తున్నారని వివరించింది. నేటికి ఐస్‌కు పట్టున్న రఖా నుంచి దాదాపు 200 మంది తీవ్రవాదులు తమ కుటుంబాలతో వెళ్లిపోయారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్‌రైట్స్ అబ్జర్వేటరీ తెలిపింది. రఖా నుంచి స్థానిక ఐఎస్ శ్రేణులు పూర్తిగా వైదొలిగాయని ఆ సంస్థ ప్రతినిధి రమి అబ్దెల్ రహ్మాన్ తెలిపారు. వారందరూ గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లి ఉంటారని ఆయన అన్నారు. అయితే, రఖాలో వివిధ దేశాలకు చెందిన తీవ్రవాదులు పనిచేస్తున్నారని, వారు లొంగిపోలేదని వివరించారు. నగరం నుంచి వెళ్లాలనుకునే పౌరులను పంపించేందుకు స్థానిక సివిల్ కౌన్సిల్‌తోపాటు గిరిజన మధ్యవర్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐఎస్ సంస్థకు కీలకస్థావరంగా ఉన్న ఈ నగరంలో ప్రభుత్వ దళాలకు, తీవ్రవాద గ్రూపులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొంత మంది అయితే భయబ్రాంతులతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. -
ఆ పోలీసులను చంపింది మేమే !
-
ఆ పోలీసులను చంపింది మేమే!
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో పోలీసు శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడిలో 60 మంది మరణించగా, 120 మంది గాయపడ్డారు. ఆత్మాహుతిదాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు ఇస్లామిక్ స్టేట్ తరచు తన ప్రకటనల కోసం ఉపయోగించే అమాఖ్ వార్తాసంస్థ తెలిపింది. ఐసిస్‌లోని ఖొరసాన్ బృందం మిషన్ గన్లు, గ్రెనేడ్లు ఉపయోగించడంతో పాటు, తర్వాత తమ నడుముకు కట్టుకున్న బాంబులను పేల్చేసినట్లు వివరించింది. ఈ దాడిలో పాల్గొన్నట్లుగా ఐసిస్ చెబుతున్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోను కూడా అమాఖ్ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, అమాఖ్ ఈ విషయాన్ని చెప్పడానికి ముందు బలూచిస్తాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ చీఫ్ అయిన మేజర్ జనరల్ షేర్ అఫ్ఘాన్ మాత్రం.. లష్కరే ఝంగ్వి అనే నిషేధిత సంస్థకు చెందిన అల్- అలామీ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదులు, వాళ్ల హ్యాండ్లర్ల మధ్య జరిగిన సంభాషణను తాము ఇంటర్సెప్ట్ చయగా, అఫ్ఘానిస్థాన్ నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసిందన్నారు. కాగా, ఇంతకుముందు క్వెట్టా నగరంలోని ఒక ఆస్పత్రి మీద దాడిచేసి 73 మందిని చంపింది కూడా తామేనని అప్పట్లో ఐసిస్ సంస్థ ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది తామంటూ పాకిస్థానీ తాలిబన్లకు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ వర్గం కూడా చెప్పింది. క్వెట్టా నగర శివార్లలో ఉన్న ఈ శిక్షణ శిబిరంపై ముసుగులు ధరించిన ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు ఐదు గంటల పాటు దాడి జరిగింది. లోపలకు చొరబడిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని, తాము అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీశామని దాడినుంచి తప్పించుకున్న కొందరు పోలీసులు చెప్పారు. -
ఐసిస్ కదలిక
ఇద్దరు ఐఎస్ తీవ్రవాదుల అరెస్ట్ అనుమానంతో నలుగురు యువకుల విచారణ దసరా సంబరాల్లో భారీ విధ్వంసానికి కుట్ర సాక్షి ప్రతినిధి, చెన్నై: దసరా, దీపావళి సంబరాల్లో భారీ విధ్వంసాలకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పన్నిన కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు కేరళలోనూ, మరొకరు తిరునెల్వేలిలోనూ పట్టుబడ్డారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఒక యువతి సహా మొత్తం 21 మంది కనిపించకుండా పోయారు. వారిని సెల్ఫోన్లలో సంప్రదించగా తాము ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సిరియాకు చేరుకుని ఐసిస్ తీవ్రవాద ముఠాలో చేరామని, తమకు వెతకవద్దని తెలపడంతో బంధువులు కుప్పకూలిపోయారు. తమ వారిని తీవ్రవాద ముఠా నుండి విడిపించాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ నేరపరిశోధన విభాగం(ఎన్ఐఏ) రంగంలోకి దిగి కొత్తగా ఐఎస్‌లో చేరిన వారి నేపథ్యం, వారు ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న మార్గం, వారిని పంపేందుకు ఏర్పాట్లు చేసిన ఏజెంటు ఎవరు తదితర అంశాలపై విచారణ ప్రారంభించింది. కేరళలో ఉంటూ ఐఎస్‌లో సభ్యులను చేర్చేలా కొందరు పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. కొండ ప్రాంత గ్రామీణ యువతీయువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్‌లో చేరుస్తున్న విషయం వెలుగు చూసింది. సిరియా చేరగానే వారికి అక్కడ తీవ్రవాద కార్యకలాపాలపై శిక్షణనిచ్చి ఆ తరువాత భారతదేశానికి పంపి వారి ద్వారా విధ్వంసానికి పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. ఐఎస్ తీవ్రవాదుల సంచారాన్ని పసిగట్టిన అధికారులు రెండు వారాల క్రితం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై అత్యంత రహస్యంగా నిఘాపెట్టారు. స్థానిక ప్రభుత్వాల సహాయంతో కొండ ప్రాంత గ్రామాల్లోని ప్రజల కదలికలపై కన్నేశారు. కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లా కనకమలైలో ఈ నెల 2వ తేదీన(ఆదివారం) ఐఎస్ తీవ్రవాదుల సమావేశం జరుగుతున్నదని, అందులో కేరళ, తమిళనాడుకు చెందిన యువకులు పాల్గొంటున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సహాయంతో భద్రతా దళం అధికారులు ఆదివారం రాత్రి ఆ ప్రాంతాన్ని సాయుధ బలగాలతో చుట్టుముట్టారు. అక్కడ పట్టుబడిన వారందరినీ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు ఐఎస్ తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐఎస్ తీవ్రవాదుల్లో యూసుఫ్ అనే వ్యక్తి చెన్నై కొట్టివాక్కంలో నివసిస్తున్నట్లు తెలుసకున్నారు. పట్టుబడిన ఆరుగురు తమిళనాడు, కేరళలో విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా తిరునెల్వేలి జిల్లా కడయనల్లూరులో ఐఎస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు దాక్కుని ఉన్నట్లు విచారణలో బయటపడింది. దీంతో రాత్రికి రాత్రే కడయనల్లూరుకు చేరుకున్న అధికారులు సుబహాని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుబహాని తన తండ్రి ఖాజామొహిద్దీన్ కేరళలో వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. కొన్నాళ్లు తండ్రికి సహకరిస్తూ కేరళలో ఉండిన సుబహానీ ఆ తరువాత కడయూరుకు వచ్చి బంగారు దుకాణంలో గుమాస్తాగా చేరాడు. సుబహాని కేరళలో పనిచేస్తున్నపుడు ఐఎస్ ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన ఆరుగురిలోని అబూబషీర్ అలియాస్ రషీద్ కోయంబత్తూరుకు చెందిన వాడు, కోవైకి చెందిన నవాజ్, నవాజ్‌ఖాన్, ఉబైసుల్ రహ్మాన్, నబీ అనే యువకులతో పరిచయాలు ఉన్నట్లు తేలింది. దీంతో 20 మందితో కూడిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం రాత్రి కోయంబత్తూరుకు చేరుకుని నవాజ్‌తోపాటు నలుగురి ఇళ్లపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఈ నలుగురు కేవలం ఫేస్బుక్ ద్వారా మాత్రమే యూసుఫ్‌కు పరిచయం ఉన్నట్లు తెలుసుకుని వదిలివేశారు. ఎన్ఐఏ అధికారుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. -
వాట్సప్, టెలిగ్రాంలలో.. అమ్మాయిల అమ్మకం!
టెలిగ్రామ్ యాప్‌లో ఈ మధ్య ఓ ప్రకటన వస్తోంది.. ‘‘అమ్మకానికి అమ్మాయి ఉంది.. కన్నెపిల్ల.. అందంగా ఉంటుంది.. 12 ఏళ్ల వయసు.. ఆమె ధర ఇప్పటికి రూ. 8.5 లక్షల వరకు వెళ్లింది.. త్వరలోనే అమ్ముడుపోతుంది.. తొందరపడండి’’ అంటూ అరబిక్ భాషలో ఈ ప్రకటన ఉంది. పిల్లిపిల్లలు, ఆయుధాల ప్రకటనలతో పాటే ఈ ప్రకటన కూడా వచ్చింది. మైనారిటీ యజీదీ వర్గం వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఓ కార్యకర్త ఈ ప్రకటనను మీడియాకు పంపారు. యజీదీ మహిళలను, పిల్లలను ఉగ్రవాదులు బంధించి, వాళ్లను సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దాదాపు 3వేల మంది మహిళలు, బాలికలను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్మార్ట్ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్‌ల సాయంతో మహిళలను, పిల్లలను ఇలా అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ల ఫొటోలతో పాటు.. వాళ్ల ‘యజమానుల’ వివరాలు కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ తమ సొంత చెక్‌పోస్టులు పెట్టి, వాటి నుంచి మహిళలు తప్పించుకోకుండా చూస్తున్నారు. బందీలుగా ఉన్న మహిళలను తప్పించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించగా, వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 2014 ఆగస్టు నెలలో వందలాది మంది యజీదీ మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు కుర్దిష్ భాష మాట్లాడే మైనారిటీ వర్గం మొత్తాన్ని నిర్మూలించాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు మాత్రం ఎలాగోలా ప్రాణాలకు తెగించి నెలకు దాదాపు 134 మంది మహిళలను విడిపించారు. కానీ మే నెలలో ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ల మీద విరుచుకుపడటంతో.. గత ఆరు వారాల్లో కేవలం 39 మందిని మాత్రమే విడిపించగలిగారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మందుపాతరలను ఏర్పాటుచేయడంతో వాళ్లలో చాలామంది చనిపోతున్నారు. వాటి బారి నుంచి అతి కొద్ది మంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని.. బయట పడుతున్నారు. -
రంజాన్ రోజు ఏం చేద్దామని?
జాతీయ దర్యాప్తు సంస్థ అత్యంత పకడ్బందీగా పొందిన సమాచారంతో మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలో మరోసారి సోదాలు చేసింది. పాతబస్తీలోని తలాబ్ కట్ట, బార్కాస్ ప్రాంతాల్లో చేసిన ఈ సోదాలలో 17 లైవ్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారంటే... ఐఎస్ టార్గెట్ ఏమై ఉంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రంజాన్ నాటికి రక్తపాతం సృష్టించాలని ఇంతకుముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పిలుపునిచ్చింది. దానికి తగ్గట్లే వివిధ దేశాల్లో ఈ నెల రోజుల్లో దాదాపు 800 మందిని హతమార్చింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఇదే తరహా మారణహోమం సృష్టించడానికి సిద్ధమైనట్లు ఎన్ఐఏ వద్ద పక్కా సమాచారం ఉండటం వల్లే బార్కాస్, తలాబ్ కట్ట ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితమే ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు కలిసి సంయుక్తంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని వదిలిపెట్టి, ఐదుగురిని అరెస్టు చేశారు. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ లైవ్ పేలుడు పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారంటే.. రాబోయే రెండు మూడు రోజుల్లోనే విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈసారి రంజాన్‌ను రక్తసిక్తం చేయాలని ఇస్లామిక్ స్టేట్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి వారం క్రితం ఉగ్రవాదులను అరెస్టు చేసినప్పుడే.. ఎన్ఐఏ వర్గాలు పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యూరియా, యాసిడ్, కొన్ని రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ. 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఐఎస్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే వీళ్లంతా పనిచేస్తున్నట్లు అప్పట్లో స్పష్టంగా తేలింది. ఆ ప్రకారమే.. ఇప్పుడు కూడా రక్తపాతం సృష్టించడానికి ఉగ్రవాదులు సర్వసన్నద్ధంగా ఉన్నారా అనేది విచారణలో తేలాల్సిన అంశం. -
అమెరికాలోనూ ఇస్తాంబుల్ తరహా దాడులు?
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చేసినట్లుగానే అమెరికాలో కూడా దాడులు చేయొచ్చని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెనన్ హెచ్చరించారు. ఐఎస్ సామర్థ్యం ఏంటో పరిశీలించే నిఘా వృత్తిలో ఉన్న వ్యక్తిగా తాను చాలా ఆందోళన చెందుతున్నానని, వాళ్లు వీలైనంత ఎక్కువ మందిని చంపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రధానంతా విదేశాలలోనే దాడులు చేయాలనుకుంటున్నారని బ్రెనన్ తెలిపారు. ఇస్తాంబుల్ తరహాలోనే అమెరికాలో కూడా దాడులు చేయాలని ఐఎస్ ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజానికి ఇస్తాంబుల్‌లో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు 20 రోజుల ముందే హెచ్చరించాయి. ఆ లేఖలో అటాటర్క్ విమానాశ్రయం మీద దాడి జరగొచ్చని కూడా ఉందట. ఇప్పటివరకు ఆ దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోకపోయినా.. ఆత్మాహుతి దాడులు జరిగిన పద్ధతి చూస్తుంటే మాత్రం అది ఐఎస్ వాళ్ల పనేనని బ్రెనన్ అనుమానం వ్యక్తం చేశారు. -
‘ఉగ్ర’ అనుమానితుల్లో ఆరుగురి విడుదల
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని ఎన్ఐఏ కార్యాలయంలోనే విచారించారు. అనంతరం ఆరుగురిని విడిచిపెట్టారు. సయ్యద్ నైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్ నైమతుల్లా (42), ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ అలియాస్ రిజ్వాన్ (29), మహ్మద్ అతుల్లా రహమాన్ (30), అబ్దుల్ అలియాస్ అల్ జిలానీ అబ్దుర్ ఖాదర్ మొహిసిన్ మహమూద్ (32), ఏఎం అజహర్ (20), మహ్మద్ అర్బాజ్ అహ్మద్ (21) లను విడుదల చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికార వర్గాలు తెలిపాయి. -
శరణార్థులను అక్కున చేర్చుకుంటాం
15 వేల మందికి బ్రిటన్ ఆశ్రయం! లండన్: ఐఎస్ తీవ్రవాద దాష్టీకాలతో మరుభూమిగా మారిన సిరియా నుంచి యూరప్ వైపుగా తరలివస్తున్న శరణార్థుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలని బ్రిటన్ భావిస్తోంది. 15,000 మంది సిరియన్ శరణార్థులకు ఆవాసం కల్పించడానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శరణార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం. టర్కీ తీరానికి కొట్టుకొని వచ్చిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ మృతదేహం ఫొటోలు చూసి ప్రధాని డేవిడ్ కామెరాన్ చలించిపోయారని, సిరియన్ శరణార్థులకు ఆవాసం కల్పించడాన్ని నైతికబాధ్యతగా తీసుకోవాలని నిర్ణయించారు. మొదటగా 4 వేల మంది శరణార్థుల బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు వచ్చిన బ్రిటన్ ఆ తర్వాత ఆ సంఖ్యను పదివేలకు పెంచింది. ఇప్పుడు పదిహేను వేల మంది నిరాశ్రయులకు ఆశ్రయమివ్వడానికి సన్నద్ధం అవుతోంది. మరోపక్క.. ఆస్ట్రియా మీదుగా జర్మనీకి తరలివస్తున్న వేలాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ ఏడాది 8 లక్షల మంది జర్మనీకి తరలిరావచ్చని అంచనా. ఆస్ట్రియా నుంచి శనివారం రైళ్లలో చేరుకున్న 8,000 మంది వలసదారులను జర్మన్ అధికారులు తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఆహారం, మంచి నీటి ప్యాకెట్లతో రైల్వేస్టేషన్ల వద్ద స్వచ్ఛంద సేవకులు కాందిశీకులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మధ్యధరా సముద్రమార్గంలో యూరప్‌కు అక్రమంగా 3,66,402 మంది వలసవచ్చారని, 2,800 మంది జలసమాధి అయ్యారని ఐరాస తెలిపింది. ‘మిగిలిన వాళ్లయినా కెనడా వస్తే మేలు’ వాంకోవర్: సిరియా నుంచి గ్రీస్‌కు వలస వెళుతూ సముద్రంలో దయనీయమైన పరిస్థితుల్లో మరణించిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుటుంబంపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. కెనడాలో నివాసం ఉంటున్న అయలాన్కుర్దీ అత్త టిమాకుర్దీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి భార్య, పిల్లలు దయనీయమైన పరిస్థితుల మధ్య మరణించడంపై విలపించారు. తమ కుటుంబంలో మిగిలిన వారిని అయినా కెనడాకు తీసుకురావాలని భావిస్తున్నారు. -
అమెరికా, ఆస్ట్రేలియా సైట్లు హ్యాక్ చేసిన ఐఎస్
1,400 మంది ఉన్నతాధికారులను హతమారుస్తామని హెచ్చరిక మెల్బోర్న్: ఇరాక్, సిరియాలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులు కన్ను అమెరికా, ఆస్ట్రేలియాపై పడింది. ఈ దేశాల్లోని రక్షణ రంగం, ప్రభుత్వ విభాగాల్లోని 1,400 మంది ముఖ్యుల వివరాలను హ్యాక్ చేసినట్లు వెల్లడించింది. త్వరలో వీరంద రనీ హతమారుస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ఇందులో అమెరికాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని వెల్లడించింది. ‘మేం మీ కదలికలన్నీ గమనిస్తున్నాం. మీరు వాడుతున్న సామాజిక మాధ్యమాల్లో మా సభ్యులున్నారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాం. ఇందులో మీ బందువులు కూడా ఉన్నారు. త్వరలో మా ఐఎస్ మిత్రులు మిమల్ని మీ దేశంలోనే మట్టుపెడతారు’ అని ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో విక్టోరియా ఎంపీ కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశానని ఎంపీ తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ విభాగం అంగీకరించింది. ఉద్యోగుల వివరాలను ఫోన్ నంబర్లు, చిరునామాలతో సహా ఐఎస్ బుధవారం ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపింది. -
వైమానిక దాడులు: 33 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం
బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని నైనివా ప్రావెన్స్ సింజార్ పట్టణంలో ఇస్లామిక్ తీవ్రవాదులే లక్ష్యంగా సంకీర్ణదళాలు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 33 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించారని ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే తీవ్రవాదులకు చెందిన నాలుగు శిబిరాలతోపాటు ఆరు మిలటరీ వాహనాలు కూడా ధ్వంసమైనాయన్నారు. -
30 మంది క్రైస్తవులను చంపేసిన ఐఎస్
ట్రిపోలీ: 30 మంది ఇథియోపియా క్రైస్తవులను లిబియాలో హతమార్చిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఆదివారం విడుదల చేసింది. దాదాపు 29 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన బందీలను రెండు గ్రూపులుగా చేసిన తీవ్రవాదులు, 12 మందిని బీచ్‌లో తల నరికి చంపగా,17 మందికి పైగా ఉన్న వేరొక బృందాన్ని గుర్తు తెలియని ఎడారి ప్రాంతంలో మోకాలిపై కూర్చోబెట్టి తలపై కాల్చి చంపారు. ఇథియోపియాలో క్రైస్తవులు మతం మార్చుకొని ఇస్లాంలోకి చేరకపోతే ఇదేగతి పడుతుందని వీడియోలో హెచ్చరించారు. సిరియాలో మతం మార్చుకోని క్రైస్తవులకు ప్రత్యేక పన్ను విధిస్తే వారు చెల్లించడానికి అంగీకరించారని తెలిపారు. -
మోదీని టార్గెట్ చేసిన ఐఎస్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కారుబాంబుతో హతమారుస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. మోదీని అంతమొందిస్తామని ట్విటర్ లో పోస్ట్ చేశారని ఇండియా టీవీ వెల్లడించింది. ముంబై నుంచి ఐఎస్ లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడని చూపిస్తోంది. దీన్ని 500 మంది అనుసరిస్తున్నారు. ఇందులో ఇస్లామిక్ స్టేట్ కు అనుకూలంగా 220 మెసేజ్ లున్నాయి. దీని ఐపీ అడ్రస్ తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ ట్విటర్ ఖాతాను విదేశాల నుంచి నడుపుతున్నారా లేదా భారత్ నుంచా అనేది కనిపెట్టడం కష్టంగా మారింది. మోదీ, ఒబామా ఇద్దరూ అల్లాకు శత్రువులని, భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న ఒబామాను కారు బాంబు, రసాయన ఆయుధాలతో అంతం చేయాలని జనవరి 25న ఐఎస్ ఉగ్రవాదులు ట్వీట్ చేశారు. -
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. -
బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. ఐఎస్ ఇటీవల పాశ్చాత్య దేశాల పౌరులను చంపడం ఇది నాలుగోసారి. కాగా, ఐఎస్ మిలిటెంట్లు తమవద్ద బందీగా ఉన్న పీటర్ కేసింగ్ అనే అమెరికన్‌కు శిర చ్ఛేదం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ‘ఒబామా! సిరియాలోని షామ్లో మాపై దాడులు చేస్తున్నావు. అందుకు ప్రతీకారంగా మీ పౌరులను నరికి చంపుతాం’ అని హెచ్చరించారు. అలెన్ హత్యను ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా ఖండించారు. హంతకులను పట్టుకుంటామని ప్రతినబూనారు. కేసింగ్‌ను రక్షించడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని అమెరికా అధికారులు చెప్పారు.