30 మంది క్రైస్తవులను చంపేసిన ఐఎస్
ట్రిపోలీ: 30 మంది ఇథియోపియా క్రైస్తవులను లిబియాలో హతమార్చిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఆదివారం విడుదల చేసింది. దాదాపు 29 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన బందీలను రెండు గ్రూపులుగా చేసిన తీవ్రవాదులు, 12 మందిని బీచ్‌లో తల నరికి చంపగా,17 మందికి పైగా ఉన్న వేరొక బృందాన్ని గుర్తు తెలియని ఎడారి ప్రాంతంలో మోకాలిపై కూర్చోబెట్టి తలపై కాల్చి చంపారు.
ఇథియోపియాలో క్రైస్తవులు మతం మార్చుకొని ఇస్లాంలోకి చేరకపోతే ఇదేగతి పడుతుందని వీడియోలో హెచ్చరించారు. సిరియాలో మతం మార్చుకోని క్రైస్తవులకు ప్రత్యేక పన్ను విధిస్తే వారు చెల్లించడానికి అంగీకరించారని తెలిపారు.