libia
-
ఈ లిబియాకు ఏమైంది? వెన్నాడుతున్న గడాఫీ అరాచకాలే కారణమా?
ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో ‘డేనియల్’ తుఫాను సంభవించిన తర్వాత ముంచెత్తిన వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. లిబియా ఒక చిన్న దేశం. అయితే అనునిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ దేశం అక్కడి గత నియంత ముఅమ్మర్ అల్ గడాఫీ కారణంగా చర్చల్లో నిలిచింది. అలాగే సమృద్ధిగా ఉన్న చమురు సంపద కారణంగానూ పేరొందింది. గడాఫీ హత్య తర్వాత అంతర్యుద్ధం 2011, అక్టోబర్ 20న గడాఫీ హత్య తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. దీని తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇక్కడకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు దర్నా నగరాన్ని తాకిన వరద సర్వం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. లిబియా విధ్వంసం కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మొదలైన గడాఫీ శకం గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పాలించాడు. ‘బ్రిటన్ రాణి 50 ఏళ్లు, థాయ్‌లాండ్ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను’ అని గడాఫీ తరచూ అంటుండేవాడు. గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని సిర్టే నగరంలో జన్మించాడు. 1961లో బెంఘాజీలోని మిలిటరీ కాలేజీలో చేరాడు. శిక్షణ పూర్తయిన తర్వాత లిబియా సైన్యంలో చేరాడు. అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. గడాఫీ సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతులేని గడాఫీ అరాచకాలు గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని గడాఫీ ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుండి బహిష్కరించాడు. లిబియా ఆర్థిక వ్యవస్థ పతనం ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణంగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతనిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది. సిర్టేలో గడాఫీ హతం అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్‌పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి, ట్రిపోలీలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యూఎన్ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011, జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011, అక్టోబరు 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు. చెలరేగిపోయిన లిబియా నేషనల్ ఆర్మీ గడాఫీ మరణానంతరం ఐక్యరాజ్యసమితి ‘నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టీఎన్సీ)’ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా ప్రకటించింది. టీఎన్సీ 2012లో జనరల్ నేషనల్ కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించింది. దీని తరువాత లిబియాలోని టోబ్రూక్ డిప్యూటీస్ కౌన్సిల్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. కాగా 2014 నుండి జనరల్ హఫ్తార్‌కు చెందిన ‘లిబియన్ నేషనల్ ఆర్మీ’ లిబియాలో తన ప్రభావాన్ని పెంచుకుంది. 2016లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో లిబియాలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొన్ని లిబియా గ్రూపులు దానిని అంగీకరించడానికి నిరాకరించాయి. ఇంతలోనే లిబియా రాజధాని ట్రిపోలీని స్వాధీనం చేసుకునేందుకు లిబియా నేషనల్ ఆర్మీ.. విమానాశ్రయంపై దాడి చేసింది. జనరల్ హఫ్తార్ తన సైన్యాన్ని ట్రిపోలీపై దాడి చేయాలని ఆదేశించాడు. ఈ విధంగా అతని సైన్యం..ఇతర సమూహాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతం గడాఫీ మరణానంతరం ప్రారంభమైన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఈ దేశంలోకి ప్రవేశించింది. రాజధాని ట్రిపోలీకి తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న సిర్టే నగరంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఊచకోతలకు పాల్పడింది. అయితే 2022లో అక్టోబర్‌లో ఖలీఫా హిఫ్తార్ దళాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించాయి. తాజా వరదల్లో వేలాదిమంది మృతి తాజాగా లిబియాలోని దర్నాను తాకిన సునామీ తరహా వరద నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ట్రిపోలీలో సంభవించిన వరదల్లో 2,300 మంది మరణించారని చెబుతున్నారు. దర్నాతో సహా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంబంధిత అధికారులు 5,300కు మించిన మృతదేహాలను వెలికితీశాని సమాచారం. కాగా వరదల్లో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? -
Libya Floods: లిబియాలో వరద బీభత్సం
ట్రిపోలీ: లిబియాలో భీకర వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా, వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపించాయి. లిబియా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో దాదాపు 2,800 మందికిపైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 10,000 మంది గల్లంతయినట్లు తెలియజేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఇప్పటిదాకా 1,500 మంది మాత్రమే మరణించారని, 2,000 మంది గల్లంతయ్యారని విమానయాన శాఖ మంత్రి హిషామ్ చికియోత్ ప్రకటించారు. చాలా ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేని డ్యామ్ కూలిపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని అన్నారు. బీభత్సానికి కారణమేంటి? మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుపాను కారణంగా లిబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వచ్చిన వర్షంనీరు కారణంగా ఆదివారం రాత్రి డెర్నా నగర శివార్లలోని రెండు డ్యామ్‌లు, ధ్వంసం కావడం వల్ల వరద ముంచెత్తినట్లు స్థానికులు చెప్పారు. నగరంలో నాలుగింట మూడొంతుల మేర వరద ప్రభావానికి గురి కావడం గమనార్హం. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. బురద కొట్టుకురావడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికారులు సహా యక చర్యల్లో నిమగ్నమయ్యారు. తూర్పు లిబియాలోని అల్–బైదా, అల్–మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్–బయాదా, బత్తాహ్, బెంఘాజీ తదితర నగరాలు, పట్టణాల్లో సైతం విధ్వంసం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన లిబియాకు అండగా నిలుస్తామని అమెరికా, ట్యునీషియా, అల్జీరియా, తుర్కియే, యూఏఈ తదితర దేశాలు ప్రకటించాయి. Heartbreaking to see the havoc caused by flash floods in Libya. Its yet another stark reminder of the urgent need for global action on climate resilience and preparedness. #LibyaFloods #ClimateAction #Libya #Libye #LibyaFlood pic.twitter.com/dmu8Gs87iV — مزمل حسین (@Muxammilhusain) September 12, 2023 For a second you will think this street have been bombed, but actually this what the storm #Daniel caused to the city of Darna Just watch the disaster closely#pray4libya #saveLibya#LibyaFloods pic.twitter.com/GwQv2g8oip — Ahmed Mussa (@AhmedMussa218) September 12, 2023 NDABANEWS: BREAKING - #LibyaFlood|#LibyaFloods - Over 5000 people presumed dead and more than ten thousand are still missing in the widespread heavy flooding caused by Storm Daniel. Twenty-five percent of Libya’s eastern city of Derna was wiped out after dams burst in a storm.… pic.twitter.com/08L03rMAZo — Thulani Ndaba (@tndaba) September 13, 2023 Another natural disaster strikes in North Africa, violent storms destroy dams causing mass flooding in Libya 🇱🇾 💔 Some 2000 people feared drowned. Thoughts and prayers for this great people and their damaged nation. #Libya #LibyaFloods pic.twitter.com/GnXnz730fx — Robert Carter (@Bob_cart124) September 12, 2023 ఇది కూడా చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా -
‘తిండి పెట్టరు.. టాయిలెట్ నీళ్లే గతి’.. లిబియాలో నరకం చూసిన హరియాణా యువకులు
డాలర్లు సంపాదించాలనే కోరికతో హరియాణా, పంజాబ్‌కు చెందిన యువత ఇటలీకి తరలివెళుతుంటుంది. అయితే వారు ఊహించిన వాతావరణం అక్కడ ఉండదు. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చవిచూసిన హరియాణాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్‌లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు. ఒక ఏజెంట్ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడన్నారు. కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడన్నారు. వారు తమ చేత అన్నిరకాల పనులు చేయించారని, తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని తెలిపారు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్ నీటిని అందించేవారన్నారు. లిబియాలో తమ లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందినవారున్నారని తెలిపారు. తామంతా జైలులో నరకం చూశామన్నారు. అయితే తమలోని ఒక యువకుని దగ్గర ఫోన్ ఉందని, ఆ ఫోను సాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్‌కు చేరుకోగలిగామన్నారు. బాధితుడు రాహుల్ సోదరి సోనియా మాట్లాడుతూ తన సోదరునికి ఇప్పుడు మరో జీవితం లభించినట్లయ్యిందన్నారు. తమ సోదరుడు తిరిగి రావడం వెనుక ప్రభుత్వం చొరవ ఉందన్నారు. ఇది కూడా చదవండి: చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి.. -
Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి. సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్‌తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి. ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
మధ్యదరాలో 170 మంది జలసమాధి!
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది. -
ఆ ఇల్లు.. ఆనందాల హరివిల్లు
తీవ్రవాదలు చెరనుంచి స్వగృహానికి చేరిన డాక్టర్ రామ్మూర్తి ఏలూరు అర్బన్ : సెప్టెంబర్ 2015. లిబియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్న రోజులవి. వైద్యునిగా పనిచేసేందుకు ఆ దేశానికి వెళ్లిన ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామ శివారు దొండపాడు వాసి డాక్టర్ కొసనం రామ్మూర్తి అప్పటికే అక్కడ అవస్థలు పడుతున్నారు. స్వగ్రామానికి బయలుదేరేందుకు సమాయత్తమయ్యారు. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని.. ఏదోరకంగా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అదే ఏడాది సెప్టెంబర్ 8న లిబియాలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కొద్దిక్షణాల్లో విమానం ఎక్కాల్సిన ఆయనను అక్కడే మాటువేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. రోజులు గడుస్తున్నా.. రామ్మూర్తి ఇంటికి రాలేదు. ఉగ్రవాదుల చెరలో బందీ అయ్యారని తెలిసి ఆయన కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. నిరాశా.. నిస్పృహలు ఆవహించాయి. ఆశలపై చీకటి కమ్మేసిన వేళ భార్యాబిడ్డలను చూసుకోగలనా అనే ఆందోళన ఒకవైపు.. తీవ్రవాదుల చిత్రహింసలు మరోవైపు రామ్మూర్తిని వెంటాడాయి. ఆయన బతికే ఉన్నాడా.. ఇంటికి చేరే పరిస్థితి ఉందా అనే భయాందోళనలు కుటుంబ సభ్యుల్ని వెన్నాడాయి. ఎట్టకేలకు వారి 18 నెలల నిరీక్షణ ఫలించింది. డాక్టర్ రామ్మూర్తి ఆదివారం ఉదయం దొండపాడులోని తన ఇంటికి చేరుకున్నారు. అతన్ని చూసిన భార్యాబిడ్డల ఆనందానికి అవధులు లేవు. ఆనంద బాష్పాల నడుమ ఆ ఇల్లు ఆనందాల హరివిల్లే అయ్యింది. నరకం చూశా డాక్టర్ రామ్మూర్తి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తీవ్రవాదుల చెరలో చిక్కి 18 నెలలపాటు నరకం చూశానని చెప్పారు. తాను స్వదేశానికి తిరిగొస్తాననే ఆశ కోల్పోయానని.. బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కిస్తూ గడిపానన్నారు. మచిలీపట్నం సమీపంలోని కప్పలగుంట గ్రామానికి చెందిన తాను 2009లో వైద్యునిగా పనిచేసేందుకు లిబియా వెళ్లినట్టు చెప్పారు. 2014లో కాంట్రాక్ట్ ముగిసిందని.. అక్కడి అధికారుల విజ్ఞప్తి మేరకు మరికొన్ని నెలలు అక్కడే ఉన్నానని తెలిపారు. అయితే, లిబియాలో కల్లోల పరిస్థితులు తలెత్తాయని.. 2015 సెప్టెంబర్ 8న స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమై విమానం ఎక్కబోతుండగా అక్కడి తీవ్రవాదులు తనను అపహరించుకుపోయారని వివరించారు. తీవ్రవాద శిబిరంలోని వారికి వైద్య సేవలందించేందుకు తనను బందీగా చేసుకున్నారని చెప్పారు. కొన్ని నెలల అనంతరం తీవ్రవాదులు, లిబియా సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయని.. ఆ ఘటనలో మూడు తూటాలు తన శరీరంలోకి దూసుకుపోయాయని వెల్లడించారు. దాంతో తాను ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నానని చెప్పారు. తీవ్రవాదులు తనను సిర్త్ అనే ప్రదేశంలో ఉంచి నాటు పద్ధతిలో చికిత్స అందించారన్నారు. సరైన మందులు కూడా లేవని, వైద్యం చేసే పరిస్థితి లేక తన ఎడమ చేతి మణికట్టులో దిగిన బుల్లెట్‌ను అలాగే ఉంచేశారని చెప్పారు. ఎట్టకేలకు తాను బందీగా ఉన్న ప్రాంతాన్ని ఆ దేశ సైన్యం స్వాధీనం చేసుకోవడంతో తన కష్టాలు కొంతమేర తగ్గాయని.. అక్కడి మిలటరీ అధికారులకు తన గోడు వెళ్లబోసుకోవడంతో వారు భారత రాయబార కార్యాలయ వర్గాలతో మాట్లాడించారని తెలిపారు. రాయబార శాఖ అధికారులు తక్షణం స్పందించారని.. తనను భారత్‌కు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. వారి చొరవతో ఈ నెల 25వ తేదీన ఢిల్లీ చేరుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నానని వివరించారు. అనంతరం రామ్మూర్తిని భారత రాయబార శాఖ అధికారులు విమానంలో గన్నవరం పంపించడంతో కథ సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల్లో ఆనందం డాక్టర్ రామ్మూర్తి క్షేమంగా ఇంటికి చేరడంతో ఆయన భార్య అన్నపూర్ణ భవాని, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె నిదిషా ఆనందం అవధులు దాటింది. ఆయన కిడ్నాప్ అయ్యారనే విషయం తెలిసినప్పటినుంచి తాము ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవించామని రామ్మూర్తి భార్య, బిడ్డలు చెప్పారు. ఆయన ఎలా ఉన్నారో తెలియక.. కనీసం క్షేమ సమాచారం కూడా అందక.. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వింటామో అన్న భయంతో వణికిపోయామని గుర్తు చేసుకున్నారు. ఫోన్ మోగినా భయంతో తల్లడిల్లిపోయేవాళ్లమని.. ఏడాదిన్నర పాటు కంటిమీద కునుకులేకుండా గడిపామని చెప్పారు. ఆయన క్షేమంగా తిరిగి రావడంతో తమకు పునర్జన్న వచ్చినట్టుందని.. దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. -
ఏడాదిగా ఎదురుచూపులు
ఏలూరు (సెంట్రల్): లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఏడాది కాలంగా బందీగా ఉన్న ఏలూరు దొండపాడుకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి రాక కోసం కుటుంబసభ్యులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడు రోజులు క్రితం భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావడంతో రామ్మూర్తి కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురించాయి. ఏలూరు రూరల్ మండలం దొండపాడులో నివాసం ఉండే రామ్మూర్తి 17 ఏళ్లుగా లిబియాలోని సిరిట్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి పలు ప్రయత్నాలు చేస్తున్నా ఆయన విడుదల కాలేదు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బందీ నుంచి ఇటీవల ఇద్దరు విడుదల కావడంతో రామ్మూర్తి భార్య అన్నపూర్ణభవానీ, కుమారుడు, ఇద్దరు కుమారైలు ఆయన రాకకోసం ఎదురుచేస్తున్నారు. రామ్మూర్తి విడుదలైయ్యే విధంగా ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
బందీల విడుదలకు విద్యార్థుల దౌత్యం
ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులచెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆందోళనలో గోపీకృష్ణ,బలరాం కిషన్ కుటుంబ సభ్యులు * ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా విడుదలకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లకు విముక్తి లభించలేదు. సోమవారం కూడా వీరు విడుదల కాకపోవటంతో ఇరువురు ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బందీలుగా ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లను విడుదల చేసేందుకు ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా దౌత్య అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై 29న స్వదేశానికి వస్తున్న నలుగురు భారతీయులను ట్రిపోలి సమీపంలో కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలేసి, తెలుగు రాష్ట్రాలకు చెందిన గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను తమ వద్ద బందీలుగా ఉంచుకున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు ఇచ్చిన సమాచారం మేరకు.. గోపీకృష్ణ, బలరాం కిషన్ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం మధ్యాహ్నానికి కచ్చితంగా విడుదల అవుతారని దౌత్య అధికారులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ, సోమవారం తీపికబురు కోసం రోజంతా వేచిచూసిన గోపీకృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు సాయంత్రానికి పూర్తిగా డీలాపడిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకు బందీల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే దౌత్య అధికారులు మాత్రం హ్యూన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులనే దూతలుగా పంపి గోపీకృష్ణ, బలరాం కిషన్ల విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాధి నేతలూ.. కనికరించండి.. ఏ రోజూ.. ఎవరికీ హాని చేయని తమ వారిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని బందీల కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం గోపీకృష్ణ భార్య కళ్యాణి, సోదరుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. కిడ్నాప్ అయిన నలుగురు ప్రొఫెసర్లలో కర్ణాటకకు చెందిన ఇద్దరు విడుదలయ్యారని తమ వారు కూడా త్వరగా విడుదల అయ్యేలా చూడాలని, దీనికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. లిబియా బందీలను విడిపించండి ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరినట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం ఢిల్లీలో చెప్పారు. తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, రాపోలు ఆనందభాస్కర్‌తో వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిసినట్టు ఆయన తెలిపారు. దొరకని కేసీఆర్ అపారుుంట్‌మెంట్ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించామని కానీ లభించలేదని ప్రొఫెసర్ బలరాం కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం బలరాం విడుదల అవుతాడని ఆశాభావంతో ఉన్నామని, లేనిపక్షంలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతినిధులను కలుస్తామని వారు చెప్పారు. -
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
-
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
నలుగురు భారతీయుల అపహరణ ఇద్దరి విడుదల.. చెరలోనే మనవాళ్లిద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకమేనని అనుమానం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్, బెంగళూరు: ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ ప్రొఫెసర్లు లిబియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు శుక్రవారం సాయంత్రం విడుదల కాగా హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే మగ్గుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిర్త్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఈ నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వివరణనిచ్చారు. కాగా, ఐఎస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో లిబియా నుంచి వచ్చేయాలంటూ అక్కడి భారతీయులకు కేంద్రం ఏడాది క్రితమే సూచనలు జారీచేసింది. ఇరాక్‌లో గతేడాది 39 మంది భారతీయులు కిడ్నాప్ కాగా, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. మా వారిని రప్పించండి..: కరీంనగర్ జిల్లా శనిగారం గ్రామానికి చెందిన చిలివేరు బలరామ్ కిషన్ కుటుంబం... హైదరాబాద్‌లో అల్వాల్ మానస సరోవర్‌లోని సాయిసాగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. ఇతని భార్య శ్రీదేవి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్ బీటెక్, చిన్న కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. బలరామ్ ఐదేళ్ల క్రితం సిర్త్ వర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బలరామ్ ఈ నెల 29న రాత్రి 7 గంటలకు లిబియా నుంచి ఇంటికి బయలుదేరుతున్నానంటూ ఫోన్ చేసి భార్య శ్రీదేవితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. తన భర్త, గోపీకృష్ణలను భారత్‌కు రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ‘వీ ఆర్ సేఫ్’ అంటూ సందేశం: కిడ్నాప్‌నకు గురైన వారిలో ఒకరైన లక్ష్మీకాంత్ నుంచి బలరామ్ భార్య శ్రీదేవి సెల్‌ఫోన్‌కు శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. ‘వి ఆర్ సేఫ్ హియర్ ఇన్ సిర్త్ యూనివర్సిటీ డోన్ట్ వర్రీ’ (మేము సిర్త్ యూనివర్సిటీలో సురక్షితంగా ఉన్నాం. ఆందోళన వద్దు) అని అందులో పేర్కొన్నారు. భారత్ వస్తూ బందీగా... ఆందోళనలో తెలుగు కుటుంబాలు నలుగురు ప్రొఫెసర్లను గుర్తుతెలియనిదుండగులు కిడ్నాప్ చేసిన విషయాన్ని వారు ప్రయాణించిన కారు డ్రైవర్ హైదరాబాద్‌లోని గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన మురళీ ట్రిపోలీలో ఉన్న స్నేహితులను సంప్రదించడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణతో కలిసి పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నాచారం ప్రాంతంలో స్థిరపడ్డారు. డిగ్రీ వరకు టెక్కలిలో చదువుకున్న గోిపీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెస్సీ, తమిళనాడు కాంచీపురంలోని మీనాక్షి అమ్మన్ కళాశాలలో ఎంటెక్ చదివారు. బలరాం అదృశ్యంపై టీవీలో వార్త చూసి ఆందోళన చెందుతున్నభార్య శ్రీదేవి ఈయనకు 2004లో కళ్యాణితో వివాహమైంది. వీరి కుమార్తె జాహ్నవి (10) నాలుగో తరగతి, కుమారుడు కృష్ణ సాయికిశోర్ (4) యూకేజీ చదువుతున్నారు. 2004 నుంచి 2007 వరకు నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కుటుంబంతో లిబియాకు వలసవెళ్లి హున్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011లో భార్యాపిల్లల్ని నాచారం రాఘవేంద్రనగర్‌కు పంపారు. ప్రస్తుతం స్రిట్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతితోపాటు అమ్మమ్మ టెక్కలిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీకి రంజాన్ సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో గడపటానికి బుధవారం భారత్‌కు పయనమయ్యారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఆ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం గోపీకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. -
30 మంది క్రైస్తవులను చంపేసిన ఐఎస్
ట్రిపోలీ: 30 మంది ఇథియోపియా క్రైస్తవులను లిబియాలో హతమార్చిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఆదివారం విడుదల చేసింది. దాదాపు 29 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన బందీలను రెండు గ్రూపులుగా చేసిన తీవ్రవాదులు, 12 మందిని బీచ్‌లో తల నరికి చంపగా,17 మందికి పైగా ఉన్న వేరొక బృందాన్ని గుర్తు తెలియని ఎడారి ప్రాంతంలో మోకాలిపై కూర్చోబెట్టి తలపై కాల్చి చంపారు. ఇథియోపియాలో క్రైస్తవులు మతం మార్చుకొని ఇస్లాంలోకి చేరకపోతే ఇదేగతి పడుతుందని వీడియోలో హెచ్చరించారు. సిరియాలో మతం మార్చుకోని క్రైస్తవులకు ప్రత్యేక పన్ను విధిస్తే వారు చెల్లించడానికి అంగీకరించారని తెలిపారు. -
లిబియాలో హైదరాబాదీ ప్రొఫెసర్ హత్య
సాక్షి, హైదరాబాద్: లిబియాలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైదబాద్వాసి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు హతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముషీరాబాద్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ నజీముద్దీన్ (53) లిబియాలోని అజుదబియాలో ఉన్న బెంఘాజి యూనివర్సిటీలో ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్యా పిల్లలు ఇక్కడే ఉంటుండగా, యూనివర్సిటీ క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో నజీముద్దీన్ ఒంటిరిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తన నివాసంలో నజీముద్దీన్ హత్యకు గురైన విషయాన్ని అక్కడి యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. మైనార్టీ కమిషన్‌ను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు... లిబియాలో హత్యకు గురైన నజీముద్దీన్ మృతదేహాన్ని వెంటనే స్వదే శానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్‌ఖాన్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు చేపడతామని ఆయన వారికి హా మీ ఇచ్చారు. నజీముద్దీన్కు భార్య, ఒక కూతురు ఉన్నారు.