Libya Floods: లిబియాలో వరద బీభత్సం  | Libya: Thousands Dead, Many Missing After Catastrophic Floods | Sakshi
Sakshi News home page

Libya Floods: లిబియాలో వరద బీభత్సం 

Published Wed, Sep 13 2023 9:51 AM | Last Updated on Wed, Sep 13 2023 10:39 AM

Libya After Catastrophic Floods Thousands Dead Many Missing - Sakshi

ట్రిపోలీ: లిబియాలో భీకర వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా, వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపించాయి. లిబియా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో దాదాపు 2,800 మందికిపైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 10,000 మంది గల్లంతయినట్లు తెలియజేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

కానీ, ఇప్పటిదాకా  1,500 మంది మాత్రమే మరణించారని, 2,000 మంది గల్లంతయ్యారని విమానయాన శాఖ మంత్రి హిషామ్‌ చికియోత్‌ ప్రకటించారు. చాలా ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేని డ్యామ్‌ కూలిపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని అన్నారు.  

బీభత్సానికి కారణమేంటి? 
మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్‌ తుపాను కారణంగా లిబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వచ్చిన వర్షంనీరు కారణంగా ఆదివారం రాత్రి డెర్నా నగర శివార్లలోని రెండు డ్యామ్‌లు,  ధ్వంసం కావడం వల్ల వరద ముంచెత్తినట్లు స్థానికులు చెప్పారు. నగరంలో నాలుగింట మూడొంతుల మేర వరద ప్రభావానికి గురి కావడం గమనార్హం. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. బురద కొట్టుకురావడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. 

ప్రభుత్వ అధికారులు సహా యక చర్యల్లో నిమగ్నమయ్యారు.  తూర్పు లిబియాలోని అల్‌–బైదా, అల్‌–మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్‌–బయాదా, బత్తాహ్, బెంఘాజీ తదితర నగరాలు, పట్టణాల్లో సైతం విధ్వంసం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన లిబియాకు అండగా నిలుస్తామని అమెరికా, ట్యునీషియా, అల్జీరియా, తుర్కియే, యూఏఈ తదితర దేశాలు ప్రకటించాయి.  

ఇది కూడా చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement