చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.
తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment