డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన దర్శంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామెంట్ చేయడం సరికాదని అన్నారు. కాగా సనాతన ధర్మాన్ని వ్యతికించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.
Hon'ble Minister @UdhayStalin didn't call for 'genocide' as distorted by BJP, but only spoke against discrimination. Disheartening to see the 'responsible' Hon'ble Prime Minister, Union Ministers and BJP Chief Ministers ignore facts and driven on fake narratives despite having… pic.twitter.com/F9yrdGjxqo
— M.K.Stalin (@mkstalin) September 7, 2023
ప్రధాని మాటలు నిరుత్సాహపరిచాయి
తాజాగా కొడుకు మాటల దుమారంపై తండ్రి స్టాలిన్ స్పందిస్తూ.. బీజేపీ వక్రీకరించినట్లు 'జాతి నిర్మూలన'కు మంత్రి పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.వాస్తవాలను ధృవీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరిండం, నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు.
తప్పుగా ప్రచారం చేస్తున్నారు
సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తప్పుగా విమర్శిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు అతని(ఉదయనిధి) వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ‘సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు.
స్వామిజీపై ఏం చర్యలు తీసుకున్నారు?
ఉధయనిధిన తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి ప్రకటన చేసిన స్వామిపై ఏం చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే ఉదయనిధిపై అయితే కేసులు పెట్టారని అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందని.. ఇది చాలా నిరాశ పరిచిందన్నారు.
డీఎంకే ప్రతిష్టను దిగజార్చలని చూస్తే..
‘ఏదైనా ఆరోపణలను, నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఉదయనిధిపై ప్రచారమవుతున్న అబద్ధాల గురించి ప్రధానికి తెలియదా, లేక తెలిసి అలా చేస్తున్నారా?. సనాతన వివక్షత పట్ల బీజేకిపీ అసలు పట్టింపు లేదు. ఒకవేళ డీఎంకే పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని బీజేపీ ప్రయత్నిస్తే.. వారు ఆ ఊబిలో మునిగిపోతారు.
కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు, మహిళలు కొన్ని పని చేయకూడదు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు 'సనాతన' అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడు. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు’అని స్టాలిన్ తన కొడుకు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment