ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్‌ వార్నింగ్‌ | Cm Mk Stalin Message To Pm Modi Amid Budget Row | Sakshi
Sakshi News home page

‘మీరే ఒంటరి అవుతారు’..ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్‌ వార్నింగ్‌

Published Wed, Jul 24 2024 6:52 PM | Last Updated on Wed, Jul 24 2024 7:59 PM

Cm Mk Stalin Message To Pm Modi Amid Budget Row

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రధాని మోదీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారు అని మండిపడ్డారు.
  
అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం (జులై23న) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఆ బడ్జెట్‌లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జులై 27న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.

నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోం
ఈ తరుణంలో కేంద్రం బడ్జెట్‌పై ఎంకే స్టాలిన్‌ స్పందించారు. బడ్జెట్‌లో మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అందుకు నిరసనగా నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోం. పార్లమెంట్‌లో మా నిరసన తెలుపుతామని ఇప్పటికే సూచించారు. బుధవారం పార్లమెంట్‌ సమావేశాల్లో తమిళనాడుపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ డీఎంకే ఎంపీలు ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. డీఎంకే నిరసనపై సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. 

 మీరే ఒంటరవుతారు
‘ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి. 2024 బడ్జెట్‌ మీ పాలనను కాపాడుతుంది.. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి.. లేకపోతే మీరు ఒంటరవుతారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

‘మిమ్మల్ని ఓడించిన వారి పట్ల ఇంకా ప్రతీకారం తీర్చుకోవద్దు.. మీ రాజకీయ ఇష్టాలు, అయిష్టాల ప్రకారం మీరు పాలించినట్లయితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు’ అని ట్వీట్‌లో తెలిపారు.  

తమిళనాడుపై కేంద్రం చిన్నచూపు
ఇండియా కూటమిలోని తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై సీఎం చిన్నచూపు చూస్తోందని సీఎం స్టాలిన్‌ తెలిపారు. బడ్జెట్‌లో చెన్నై మెట్రో రైలు రెండవ దశ, కోయంబత్తూరులో అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రం నిధుల్ని కేటాయిస్తుందని ఆశించాం. దీంతో పాటు చెన్నై,దక్షిణాది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల పునరుద్ధరణ కోసం కేంద్రాన్ని రూ.37,000 కోట్లు నిధుల్ని కేటాయించాలని అడిగితే ఇప్పటివరకు రూ.276 కోట్లు మాత్రమే అందించిందని అన్నారు.

బీజేపీ ఎదురుదాడి
సీఎం స్టాలిన్‌ ట్వీట్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎదురు దాడికి దిగారు. ప్రధాని మోదీ అధ్యక్షతన  జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాకూడదని తీసుకున్న ఎంకే స్టాలిన్‌ నిర్ణయాన్ని అన్నామలై హస్యాస్పందంగా వర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 10 బడ్జెట్‌లలో ఆరింటిలో తమిళనాడు ప్రస్తావన లేదని ఎత్తి చూపుతూ ఓ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement