libiya
-
Libya Floods: లిబియాలో వరద బీభత్సం
ట్రిపోలీ: లిబియాలో భీకర వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా, వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపించాయి. లిబియా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో దాదాపు 2,800 మందికిపైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 10,000 మంది గల్లంతయినట్లు తెలియజేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఇప్పటిదాకా 1,500 మంది మాత్రమే మరణించారని, 2,000 మంది గల్లంతయ్యారని విమానయాన శాఖ మంత్రి హిషామ్ చికియోత్ ప్రకటించారు. చాలా ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేని డ్యామ్ కూలిపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని అన్నారు. బీభత్సానికి కారణమేంటి? మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుపాను కారణంగా లిబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వచ్చిన వర్షంనీరు కారణంగా ఆదివారం రాత్రి డెర్నా నగర శివార్లలోని రెండు డ్యామ్‌లు, ధ్వంసం కావడం వల్ల వరద ముంచెత్తినట్లు స్థానికులు చెప్పారు. నగరంలో నాలుగింట మూడొంతుల మేర వరద ప్రభావానికి గురి కావడం గమనార్హం. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. బురద కొట్టుకురావడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికారులు సహా యక చర్యల్లో నిమగ్నమయ్యారు. తూర్పు లిబియాలోని అల్–బైదా, అల్–మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్–బయాదా, బత్తాహ్, బెంఘాజీ తదితర నగరాలు, పట్టణాల్లో సైతం విధ్వంసం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన లిబియాకు అండగా నిలుస్తామని అమెరికా, ట్యునీషియా, అల్జీరియా, తుర్కియే, యూఏఈ తదితర దేశాలు ప్రకటించాయి. Heartbreaking to see the havoc caused by flash floods in Libya. Its yet another stark reminder of the urgent need for global action on climate resilience and preparedness. #LibyaFloods #ClimateAction #Libya #Libye #LibyaFlood pic.twitter.com/dmu8Gs87iV — مزمل حسین (@Muxammilhusain) September 12, 2023 For a second you will think this street have been bombed, but actually this what the storm #Daniel caused to the city of Darna Just watch the disaster closely#pray4libya #saveLibya#LibyaFloods pic.twitter.com/GwQv2g8oip — Ahmed Mussa (@AhmedMussa218) September 12, 2023 NDABANEWS: BREAKING - #LibyaFlood|#LibyaFloods - Over 5000 people presumed dead and more than ten thousand are still missing in the widespread heavy flooding caused by Storm Daniel. Twenty-five percent of Libya’s eastern city of Derna was wiped out after dams burst in a storm.… pic.twitter.com/08L03rMAZo — Thulani Ndaba (@tndaba) September 13, 2023 Another natural disaster strikes in North Africa, violent storms destroy dams causing mass flooding in Libya 🇱🇾 💔 Some 2000 people feared drowned. Thoughts and prayers for this great people and their damaged nation. #Libya #LibyaFloods pic.twitter.com/GnXnz730fx — Robert Carter (@Bob_cart124) September 12, 2023 ఇది కూడా చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా -
Libya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి
ట్రిపోలీ: మొరాకోలో తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే ఆఫ్రికా దేశమైన లిబియాలో పెనువిషాదం చోటు చేసుకుంది. లిబియాలో డానియల్ తుఫాను ప్రభావంతో డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తగా వరద ప్రవాహానికి సుమారు 2000 మంది చనిపోయి ఉంటారని ఐదారు వేల మంది గల్లంతయి ఉంటారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు. ఒకపక్క సాయుధ దళాల తిరుగుబాటుతో అట్టుడుకుతున్న లిబియాను వరదలు ముంచెత్తాయి. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో డానియెల్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో సుమారు 2 వేల మంది మృతిచెందగా ఐదారు వేల మంది వరదల్లో గల్లంతయ్యారని మొరాకో దేశ ప్రధాని ఒసామా హమద్ తెలిపారు. డ్యామ్‌లన్నీ నిండి ఉప్పొంగడంతో నీటిప్రవాహానికి డెర్నా నగరం మునిగిపోయిందని పెద్ద పెద్ద వంతెనలు, ఎత్తయిన భవనాలన్నీ నేలమట్టమయ్యాయని తెలిపారు. డేనియల్ తుఫాను మరింత ఉధృతం కావడంతో డెర్నా, జబల్ అల్ అఖ్దర్, అల్-మార్జ్ తదితర నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సైన్యం, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ఇదిలా ఉండగా డెర్నా నగరంలోని నదిపై ఉన్న ఆనకట్ట కూలిపోవడంతోనే విపత్తు మరింత తీవ్రమైందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిందని అన్నారు. After devastating Greece in the country’s worst ever flood disaster, #medicane Daniel submerges East Libya under water. First estimate of 2,000 dead, many missing thought to have been washed out to sea. Apocalyptic. #ClimateCrisis #ClimateActionNow pic.twitter.com/HTxgiTQbaz — George Tsakraklides (@99blackbaloons) September 11, 2023 Everyone in this part of the city of #Darna in eastern #Libya was taken by surprise as a #tsunami -like rushed down the valley. Police, using megaphones, rushed to warn them as flood was approaching shouting: "Guys get out of the valley..." But it was too late. pic.twitter.com/5sYiEabFz4 — Said Laswad سعيد الأسود (@LaswadSaid) September 11, 2023 Rabbimiz sen kardeşlerimizin yardımcısı ol.. #Libya pic.twitter.com/1wXiHwm9rs — ᎬbᏒu..🦋 (@EbruZengnn) September 12, 2023 Thread of videos of the torrents and floods that occurred and are still occurring today in the eastern region of #Libya The situation is catastrophic in the city of Al-Bayda in eastern Libya pic.twitter.com/ieLO3Idx7h — Mahmud Mohammed (@MahmudM27830556) September 10, 2023 ఇది కూడా చదవండి: సమావేశాలు విజయవంతం.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే -
బంగారం కోసం కొట్లాట.. 100 మంది దుర్మరణం
నద్జమేనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో ఘోరం జరిగింది. బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. లిబియా సరిహద్దులోని కౌరీ బౌగౌడీ జిల్లాలో మే 23, 24 తేదీల్లో ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను కట్టడి చేయడానికి అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. లిబియా నుంచి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అరబ్స్‌కు, తూర్పు చాద్‌కు చెందిన టమా కమ్యూనిటీకి మధ్య ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అయితే ఘర్షణ చెలరేగడానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదు. బంగారం కోసం ఎగబడి ఉంటారని భావిస్తున్నారు. చాద్.. టెరర్రిజంతో పాటు రెబల్స్ గ్రూప్స్ దాటికి విలవిలలాడుతోంది. రెబల్స్ ఘర్షణల్లోనే అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ మరణించగా.. ఆయన కొడుకు మహమత్ డెబీ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. -
రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎంతగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాసియాలో పెట్రోల్ ధరలు: మన దాయాది దేశం అయిన పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో వాహనదారులు ప్రతి లీటర్ ఇంధనానికి $1.035(రూ.78.43) చెల్లిస్తూ ఉంటే, నేపాల్'లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టూ పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ చౌకగా దొరికే దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం "వెనిజులా". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!) -
లిబియాలో పడవ మునిగి 57 మంది మృతి
-
ఏడాదిగా ఎదురుచూపులు
ఏలూరు (సెంట్రల్) : లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఏడాది కాలంగా బందీగా ఉన్న ఏలూరు దొండపాడుకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి రాక కోసం కుటుంబసభ్యులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితం భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావడంతో రామ్మూర్తి కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురించాయి. ఏలూరు రూరల్ మండలం దొండపాడులో నివాసం ఉండే రామ్మూర్తి 17 ఏళ్లుగా లిబియాలోని సిరిట్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి పలు ప్రయత్నాలు చేస్తున్నా విడుదల కాలేదు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బందీ నుంచి ఇటీవల ఇద్దరు విడుదల కావడంతో రామ్మూర్తి భార్య అన్నపూర్ణభవానీ, కుమారుడు, ఇద్దరు కుమారైలు ఆయన రాకకోసం ఎదురుచేస్తున్నారు. రామ్మూర్తి విడుదలైయ్యే విధంగా ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
యూరప్‌లోకి చాపకింద నీరులా.. ఐఎస్ఐఎస్
ఇప్పటివరకు ఐఎస్ఐఎస్ ప్రాబల్యం సిరియా, లిబియా లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యిందని అనుకుంటున్నాం. కానీ క్రమంగా అది యూరప్‌లోకి కూడా చొచ్చుకుపోతోంది. ఈ విషయం తాజాగా వెల్లడైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. లిబియా నుంచి యూరప్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రహస్యంగా బోటులో తరలించాలని, అందుకు భారీ మొత్తం ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల అబు వాహిద్ (పేరు మార్చాం) అనే వ్యక్తికి 25 మందిని యూరప్‌కు చేరిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల వంతున ఇస్తామని ఆఫర్ వచ్చింది. అయితే అతడు దాన్ని తిరస్కరించాడు. ఇలాంటి ఆఫర్లు గత రెండు నెలలుగా ఎక్కువగా వస్తున్నాయట. తమ మనుషులను ఎలాగోలా యూరప్‌లోకి పంపేందుకు ఐఎస్ఐఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. టర్కీ నుంచి గ్రీస్ మార్గంలో అయితే నిఘా ఎక్కువగా ఉంటోందని లిబియా మార్గాన్ని వాళ్లు ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే వలస కార్మికుల దోపిడీ కొనసాగేదని, ఇప్పుడు అమెరికా, యూరోపియన్ దేశాలు వెంటనే దీనిపై స్పందించాలని పాశ్చాత్య దేశాలకు చెందిన ఓ దౌత్యవేత్త చెప్పారు. ట్యునీషియా నుంచి 40 మంది ఐఎస్ఐఎస్ సభ్యులు సిర్టె ప్రాంతం నుంచి బయల్దేరారు. అయితే వాతావరణం బాగోకపోవడంతో అప్పటికి ఆగి, మరో పది రోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించారు. ఇలా వెళ్లేవాళ్లు తమమీద ఏమాత్రం అనుమానం రాకుండా ఆయుధాలు వదిలేసి, పెళ్లాం బిడ్డలతో కలిసి వెళ్తూ శరణార్థుల ముసుగులో చల్లగా జారుకుంటున్నారు. అమెరికన్లలా దుస్తులు వేసుకుని, ఇంగ్లీషు పేపర్లు పట్టుకుని తమమీద అనుమానం రాకుండా చూసుకుంటున్నారు. వీళ్లను అడ్డుకోడానికి యూరోపియన్ యూనియన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు వస్తున్న విషయం ఒకవేళ నిజమే అయితే మాత్రం.. అది చాలా ప్రమాదకరమని, ఎవరో ఒకరిద్దరు కాకుండా గుంపులుగా ఎక్కువ సంఖ్యలో వాళ్లు వస్తే పెద్ద ముప్పే పొంచి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు!
లిబియాలో కిడ్నాపైన ప్రొఫెసర్ల కోసం వారి కుటుంబ సభ్యుల ఆవేదన * 7 నెలల కింద బలరాం, గోపీకృష్ణలను బంధించిన ఐసిస్ ఉగ్రవాదులు * ఇప్పటికీ అందని క్షేమ సమాచారాలు * కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు * లిబియా, ట్రిపోలీ, ఢిల్లీ.. ఎక్కడా లభించని భరోసా * ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న గోపీకృష్ణ కుటుంబం * ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బలరాం భార్యాపిల్లలు సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ఎలా ఉన్నారో.. ఎప్పుడొస్తారో తెలియదు.. నాన్న ఎప్పుడొస్తాడన్న పిల్లలకు ఏం చెప్పాలో తెలియదు.. నాన్నపై బెంగతో పిల్లలు ఏడుస్తుంటే, తమ కంట కన్నీటిని అదిమిపెట్టి వారినెలా ఓదార్చాలో తెలియదు.. తోడు నీడగా ఉండే వారు లేక, అసలు తమవారి పరిస్థితి ఏమిటో తెలి యక కుమిలిపోవడమే వారికి మిగిలింది. లిబి యాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో చిక్కిన తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రొఫెసర్లు చిలువేరు బలరాం కిషన్, తిరువీధుల గోపీకృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది.. గతేడాది జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లను 2 రోజుల్లోనే విడిచి పెట్టిన ఉగ్రవాదులు... కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు. దీంతో దాదాపు ఏడు నెలలుగా వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు లిబియాలోని భారత అధికారులతో నిత్యం సంప్రదిస్తున్నా.. తమ వారి క్షేమ సమాచారం తెలియక విలవిల్లాడుతున్నారు. గడువులన్నీ తీరినా.. బలరాం కిషన్, గోపీకృష్ణల విడుదలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు, భారత దౌత్య అధికారులు చెప్పిన గడువులన్నీ ఇప్పటికే తీరిపోయాయి. బందీల కుటుంబ సభ్యులైతే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు ప్రధాని మోదీని సైతం కలసి వారిని విడిపించాలని వేడుకున్నారు. విదేశాంగ శాఖ కార్యాలయం బందీల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ వచ్చింది. అటు లిబియాలోని దౌత్యాధికారులు సైతం సిర్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల సహాయంతో సంప్రదింపులు జరిపి ఇద్దరు ప్రొఫెసర్ల విడుదల కోసం ప్రయత్నించారు. కానీ పురోగతి లేకపోవడంతో ఏం చేయాలో, బందీల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ వారమే కీలకం లిబియాలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఉగ్రవాదులతో చర్చలు జరిపేం దుకు సానుకూల వాతావరణం ఏర్పడుతోం దని దౌత్యాధికారులు చెబుతున్నారు. ఈ వారంలో కొంత పురోగతి ఉండొచ్చని బందీల కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు. ఈనెల 29న ప్రొఫెసర్ గోపీకృష్ణ పుట్టినరోజు కావడంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన పుట్టినరోజుకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని.. అది విడుదలపై సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇక వారం కింద బలరాం, గోపీకృష్ణల సెల్ఫోన్లు పనిచేశాయని... దీంతో వారు క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఏ ఘటన జరిగినా సిర్త్ ఆస్పత్రికి తప్పక సమాచారం వస్తుందని చెబుతున్నారు. ఏమీ అర్థం కావడం లేదు ‘‘రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. సిర్త్ యూనివర్సిటీ, ఢిల్లీ అధికారులకు రోజూ ఫోన్లు చేస్తున్నా.. స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే ఏడు నెలలవుతోంది. పిల్లల ఫీజులు, కుటుంబ వ్యయం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈనెల 29న నా భర్త (గోపీకృష్ణ) పుట్టినరోజు. ఆ రోజుకయినా ఆయన క్షేమ సమాచారం తెలుస్తుందన్న ఆశతో బతుకుతున్నాం. మా వారి విడుదల కోసం మరింతగా ప్రయత్నించాలని ప్రధాని మోదీని కోరుకుంటున్నాం..’’ - కల్యాణి, గోపీకృష్ణ సతీమణి ఇంత పెద్ద దేశం ఇద్దరినీ విడిపించలేదా? ‘‘మనది ఎంతో పెద్దదేశం.. శక్తివంతమైనది.. ఈ ఇద్దరిని ఎందుకు విడిపించలేకపోతోంది? మా వారు క్షేమంగా ఉన్నారని చెబుతున్నా... అసలు ఆచూకీని ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. పెద్ద పదవుల్లో ఉన్న వారందరినీ కలసి వేడుకున్నాం. ఏమీ పాలుపోవడం లేదు. గత ఆదివారం మా వారికి ఫోన్ చేస్తే రింగ్ అయింది, కానీ ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేదు. నాన్న ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారు. ఏం చెప్పాలి..? ఈ నెలాఖరులో లిబియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మా వారి విడుదల జరుగుతుందని దౌత్యాధికారులు చెబుతున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నాం..’’ - శ్రీదేవి, బ లరాం సతీమణి