బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని నైనివా ప్రావెన్స్ సింజార్ పట్టణంలో ఇస్లామిక్ తీవ్రవాదులే లక్ష్యంగా సంకీర్ణదళాలు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 33 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించారని ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే తీవ్రవాదులకు చెందిన నాలుగు శిబిరాలతోపాటు ఆరు మిలటరీ వాహనాలు కూడా ధ్వంసమైనాయన్నారు.