
సాక్షి, ముంబై : నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో థానే, ఔరంగాబాద్‌ల నుంచి బుధవారం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఈ తొమ్మిది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిర్బంధంలోకి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వీరి కదలికలను పసిగడుతున్న ఏటీఎస్ గత రెండు రోజులుగా థానే, ఔరంగాబాద్‌ల్లో వలపన్ని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి కొన్ని రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఏసిడ్ బాటిల్, పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment