మహారాష్ట్రలోని నాగపూర్‌లో పసికందును లక్ష రూపాయలకు విక్రయించిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నాగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్ (ఎహెచ్‌టీఎస్) ఈ శిశువు అక్రమ విక్రయానికి సంబంధించిన కేసును ఛేదించింది. ఈ ఉదంతంలో డబ్బులు తీసుకున్నవారి, ఇచ్చినవారే కాకుండా లావాదేవీకి మధ్యవర్తిత్వం వహించిన మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఆ తల్లిదండ్రులు తమ నవజాత శిశువును సంతానం లేని దంపతులకు విక్రయించారని తెలుస్తోంది. అయితే వారు శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియను పాటించలేదు. ఈ ఉదంతంలో పోలీసులు బయలాజికల్ తల్లిదండ్రులతో పాటు, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, ఈ డీల్‌కు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులను కూడా అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితులను సునీల్ అలియాస్ భోండు దయారామ్ గెండ్రే (31), అతని భార్య శ్వేత (27), పిల్లలు లేని దంపతులను పూర్ణిమ షెల్కే (32), ఆమె భర్త స్నేహదీప్ ధరమ్‌దాస్ షెల్కే (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా థానే జిల్లాలోని బద్లాపూర్‌కు చెందినవారు. వీరికి సహకారం అందించిన మధ్యవర్తులను కిరణ్ ఇంగ్లే (41), ఆమె భర్త ప్రమోద్ ఇంగ్లే (45)గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment