ATS officials
-
ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది. భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్ గుర్తించింది. చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు! భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ బృందం గుర్తించింది. -
మహారాష్ట్రలో ఐసిస్ అనుమానితుల అరెస్ట్
సాక్షి, ముంబై : నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో థానే, ఔరంగాబాద్‌ల నుంచి బుధవారం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఈ తొమ్మిది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిర్బంధంలోకి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వీరి కదలికలను పసిగడుతున్న ఏటీఎస్ గత రెండు రోజులుగా థానే, ఔరంగాబాద్‌ల్లో వలపన్ని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి కొన్ని రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఏసిడ్ బాటిల్, పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
మరాఠా నిరసనల కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి, ముంబై : మరాఠాల ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన అతివాద హిందూ సంస్థలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ఏటీఎస్ వెల్లడించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు చేపట్టిన నిరసనల్లో ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపే ఉద్దేశంతో నిందితులు బాంబులు అమర్చారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మరాఠా మోర్చా వద్ద 100 నుంచి 150 మీటర్ల దూరంలో బాంబులు పేల్చేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారని, ఆగస్ట్ 9న పేలుడు పదార్ధాలతో వీరు నలసపోరా, సతారా ప్రాంతాల్లో పట్టుబడ్డారని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. మరాఠాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు పంపేందుకే నిందితులు ఈ స్కెచ్ వేశారని చెప్పారు. ముంబై, పూణే, సతార, షోలాపూర్, నలసపోరా ప్రాంతాల్లోనూ దాడులకు వీరు ప్రణాళికలు రూపొందించారన్నారు. మరాఠా మోర్చాలే లక్ష్యంగా ప్రాణనష్టం లేకుండా గందరగోళం సృష్టించేందుకే ఈ తరహా దాడులకు వీరు ప్లాన్ చేశారని చెప్పారు. క్రూడ్ బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించాలని తాము ప్రణాళిక రూపొందించామని నిందితులు విచారణలో వెల్లడించారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. కాగా నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని సనాతన్ సంస్థ పేర్కొంది. -
బ్లాక్‌మనీ నెట్వర్క్ గుట్టురట్టు
సాక్షి, లక్నో : నల్ల ధనాన్ని సరఫరా చేస్తున్న ముఠా గుట్టును యూపీ పోలీసుకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) రట్టు చేసింది. పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ ఏటీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ అసిం అరుణ్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని కొందరు యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులతో సంబంధాలు నెరుపుతున్నారని, వారితో నకిలీ గుర్తింపు పత్రాలతో బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పారని ఆయన వెల్లడించారు. నకిలీ పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా రూ 10 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ ఖాతాల్లోకి నేపాల్, పాకిస్తాన్, ఖతార్‌ల నుంచి డబ్బులు డిపాజిట్ అయ్యాయని చెప్పారు. పీఎన్బీ స్కామ్‌తో సహా పలు రుణాల ఎగవేత కేసులతో దేశ బ్యాంకింగ్ వ్యవస్ధ కుదేలైన క్రమంలో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. -
పుణె ఏటీఎస్‌కు ఐసిస్ నుంచి బెదిరింపులు
పుణె: పుణె ఏటీఎస్(యాంటీ -టెర్రర్ స్క్వాడ్) అధికారులకు బుధవారం ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చినట్టు సమాచారం అందింది. ఇటీవల ఐసిస్‌లో చేరేందుకు ముగ్గురు యువకులు వెళుతుండగా.. పుణె ఏటీఎస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రవాద నిరోధక విభాగానికి ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది.