Hyderabad-Bhopal: Truth Come To Light In Extreme Angle - Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్‌.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు

Published Sun, May 21 2023 1:35 PM | Last Updated on Sun, May 21 2023 1:48 PM

Truths Come To Light In Hyderabad And Bhopal Extreme Angle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్‌ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను  యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది.

భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్‌ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్‌ గుర్తించింది.
చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు!

భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్‌ బృందం గుర్తించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement