truths
-
సోరియాసిస్ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..?
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ ( Psoriasis) దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్‌లో ప్రధానంగా తెల్లటి పొలుసులు , లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు వస్తాయి. మంట, విపరీతైన దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ప్రధానంగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. చేతులు లేదా కాళ్ళపై సోరియాసిస్ రోజువారీ కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. అలాగే గజ్జ లేదా పిరుదుల వంటి ప్రాంతాలలో సోరియాసిస్ వస్తే కూర్చోవడం లేదా టాయిలెట్‌కు వెళ్లడం కూడా బాధాకరంగా ఉంటుంది.సోరియాసిస్ భౌతిక అంశాలను పక్కన పెడితే దీనిపై అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం సోరియాసిస్ సోకినవారి దూరంపెట్టడం, అది అంటు వ్యాధి ఏమో అని భయపడటం లాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోరియాసిస్ చుట్టూ ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాంసోరియాసిస్ అంటువ్యాధి: కాదు ఇది అంటువ్యాధి కాదు. ప్రాణాంతకం అంతకన్నా కాదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. వ్యక్తి-నుండి-వ్యక్తికివ్యాపించదు. పరిచయం లేదా శారీరక స్రావాల ద్వారా వ్యాపించదు. ఉదాహరణకు, ముద్దు పెట్టుకున్నా, ఆహారం లేదా పానీయాలను పంచుకున్నా, ఈత కొలనులు లేదా ఆవిరి స్నానాలలో లాంటి సన్నిహిత బహిరంగ ప్రదేశాలలో ఇది ఇతరులకు సోకదు. సోరియాసిస్ కేవలం పొడి చర్మంవారికే వస్తుంది. కానే కాదు. చర్మ నిర్మాణం చాలా వేగంగా మారుతుంది - సాధారణ స్కిన్ టర్నోవర్ ప్రతి 28 రోజులు అయితే, సోరియాసిస్‌లో 4-5 రోజులలోపే ఉంటుంది. రక్తనాళాలు కూడా మారుతాయి అందుకే గోకిన ప్రాంతాలు ఎర్రగా మారతాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో, సోరియాసిస్ చర్మం పగుళ్లు ,రక్తస్రావం అవుతుంది.సోరియాసిస్‌లో చాలా రకాలుసోరియాసిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయని భావిస్తారు. కానీ గట్టెట్ సోరియాసిస్, ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్, పస్ట్యులర్ సోరియాసిస్, ప్లాంటార్ సొరియాసిస్, ఇన్వర్స్ సొరియాసిస్, ఫేస్ సొరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ లాంటి పలు రకాలు ఉన్నాయి. లక్షణాలు బట్టి ఏ రకం సోరియాస్ అనేది నిర్ధారిస్తారు.పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే. అయితే సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు స్వీయ-సంరక్షణ గురించి జాగ్రత్తపడాలి. నిరంతరం సంరక్షణ అవసరం.సోరియాసిస్‌ను నయం చేయవచ్చుఇది మరొక అపోహ. ప్రస్తుతానికి సోరియాసిస్‌కు నివారణ సాధ్యం కాదు కానీ నిర్వహణ, ఉపశమన చికిత్స ఉంది. వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రభావితమయ్యాడనే దానిపై ఆధారపడి, సోరియాసిస్ లక్షణాల నుండి ఉపశమన మార్గాలున్నాయి.సోరియాసిస్ చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? కానేకాదు ఒక్కోసారి చర్మం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో 6–42శాతం సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు దారి తీయవచ్చు.చికిత్స లేనప్పటికీ, చికిత్స ఎంపికలు లేవు అనేది మరో అపోహ. సోరియాసిస్ అనేది జీవితకాలం పాటు ఉండే దీర్ఘకాలిక పరిస్థితి. క్రీములు, లేపనాలు , జెల్స్, సమయోచిత (చర్మానికి వర్తించే), లైట్ థెరపీ లాంటి చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది వైద్యునిమార్గదర్శకత్వంలో తీసుకోవాలి. దీనిపై శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో నివారణ చికిత్స మార్గాలు వెలుగులోకి వస్తాయిని ఆశిద్దాం. ఏం చేయాలి?సోరియాసిస్ ఎగ్జిమా లాంటిదే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా యుక్తవసులో ప్రారంభమై జీవిత కాలం ఉంటుంది. పిల్లలు, శిశువుల్లో ఇది చాలా అరుదు. అలాగే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల సోరియాసిస్‌ను నయం చేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతారు.ఊబకాయం, ఆల్కహాల్, ధూమపానం వంటి కారకాలు సోరియాసిస్ లక్షణాల తీవ్రతను పెంచుతాయి. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం, బరువు నియంత్రణలో ఉండేలా చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం విధిగా పాటించాలి. -
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి. -
ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది. భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్ గుర్తించింది. చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు! భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ బృందం గుర్తించింది. -
ప్రతి తండ్రి కొడుకుకి నేర్పాల్సిన పది జీవిత సత్యాలు ఇవే - డోంట్ మిస్
సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగున్నప్పుడే పరిశుద్ధమైన సమాజం ఏర్పడుతుంది. ఇది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. మన నుంచే పుట్టుకురావాలి. ఒక గురువు తన శిష్యులకు ఎలాగైతే బోధించి సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాడో.. ఒక తండ్రి కూడా తన కొడుకుని భావి తరాలకు ఆదర్శనీయుణ్ణి చేయాలి. ఆలా చేయాలనంటే తప్పకుండా 10 జీవిత పాఠాలను బోధించాలి. ★ నువ్వు ఏదైతే కోరుకుంటావో, అది నువ్వు పొందటానైకి అర్హుడివి కావాలి. అప్పుడే అది నీ చెంత ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక మంచి స్నేహితుణ్ని పొందాలంటే ముందు నువ్వు మంచి స్నేహితునిగా మారాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏదైతే ఇతరుల నుంచి కోరుకుంటావో అది ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది ధనమైన, గౌరవమైన ఇంకేమైనా.. ★ ప్రతి రోజు నువ్వు పట్టువదలని విక్రమార్కుడివై శ్రమించు, కొన్ని రోజులు ఏమి జరగకపోవచ్చు, ఏ మార్పు రాకుండా పోవచ్చు. చివరికి అనుకున్నది సాధిస్తావు. ఆ విజయాన్ని కొందరు అదృష్టం అని పిలుస్తారు. కానీ ఆ అదృష్టం నీ విజయ రహస్యమే అని మర్చిపోవద్దు. ★ ప్రాధమిక అంశాలపైన ద్రుష్టి పెట్టాలి. రోజుకి 10 పుస్తకాలను చదవడం కంటే, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోని సారాంశాన్ని గ్రహించడానికి 10 సార్లు చదువు. అనుభవశూన్యుడు ప్రయత్నించిన దాని కంటే ఎక్కువ సార్లు విఫలమైనవాడే ప్రతిభావంతుడవుతాడు. అలాంటి విఫలం నుంచే సక్సెస్ పుట్టుకొస్తుంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వంద సార్లు ప్రయత్నించు వెనుకడుగు వేయకు మరో 'థామస్ అల్వా ఎడిసన్' అయ్యేలా ప్రయత్నించు. ★ నువ్వు బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో. కానీ జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం నిన్ను మాత్రమే బతికిస్తుంది. వ్యాపారం (బిజినెస్) పది మందికి ఉద్యోగాలివ్వడానికి పనికొస్తుంది, వారిని బ్రతికిస్తుంది. ★ ఆరోగ్యం మహాభాగ్యం అన్నది లోకోక్తి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనుకున్నది సాధించగలవు. కాబట్టి ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టిపెట్టాలి. ★ సమాజంలో ఉన్నతంగా బ్రతికేది బలమైనవారో, తెలివైనవారో కాదు. మారుతున్న సమాజాన్ని అనుసరిస్తూ తనను తాను మార్చుకోగలిగిన వాడు, ధర్మ మార్గంలో నడిచేవాడు. ★ స్నేహితులను ఎన్నుకునే విషయంలో తెలివిగా ఉండాలి. ఐదు మంది మిలియనీర్లతో గడుపు, కానీ నువ్వు 6వ స్థానంలో ఉండు. కొంత మంది వ్యక్తుల సమూహమే ప్రపంచాన్ని మారుస్తుంది. ఎప్పుడూ మీ స్నేహితుల సమూహాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ★ ఏ పరిస్థితుల్లో అయినా దృఢంగా ఉండటం నేర్చుకోవాలి. దశరధుడు రాముని పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో.. అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అలాంటి దృఢ చిత్తం నీకుండాలి. నీకు ఏమి కావాలో నువ్వే తెలుసుకో.. నీకంటూ ఒక ప్రణాళిక లేకుంటే వేరే వాళ్ళ ప్రణాళిక ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉన్నది ఒకటే జీవితం నిన్ను నువ్వు తెలుసుకో. ★ జీవితంలో పిరికివాళ్ళు ఏదీ ప్రారభించలేరు, బలహీనుడు దారిలోనే నిలిచిపోతాడు. 'ధైర్య వంతుడు ఒకసారి మాత్రమే మరణిస్తాడు, పిరికివాడు ప్రతి రోజూ మరణిస్తూనే ఉంటాడు' అన్న అల్లూరి సీతారామరాజు మాటలు నిత్యం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎదిగిన ఎంతో మంది మహానుభావుల చరిత్రలను అధ్యయనం చేయాలి. రేపటి చరిత్రకు నువ్వు మార్గదర్శివి కావలి. ★ బలమున్న వాడి కోసం కాకుండా బలహీనుడి కోసం నిలబడాలి, మీ సరిహద్దులను రూపుమాపడానికి ప్రయత్నించే వారు ఎంతవారైనా వారికి వ్యతిరేఖంగా పోరాడాలి. ప్రత్యర్థులకు నువ్వంటే భయమున్నప్పుడు వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. నిజానికి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు పుత్రుడంటారు.. కానీ జీవితంలో ఏ తండ్రి అయితే ఈ సత్యాలను బోధించి ఉన్నతుణ్ణి చేస్తారో ఆ తండ్రికే కాదు సమాజమే స్వర్గధామం అవుతుంది. అందుకే 'అపుత్రస్య గతిర్నాస్తి' అన్నది ఒకప్పటి మాట, కానీ నేను అంటున్నాను 'సుపుత్రస్య గతిర్నాస్తి'. -
మంచి మాట: దాటవలసిన మనోభావాలు
సత్యాలు వేరు; మనోభావాలు వేరు. ఎవరి మనోభావాలు వాళ్లవి. మనోభావాలు వ్యక్తులకు సంబంధించినవి; మనోభావాలు లేకుండా ఎవరూ ఉండరు. మనిషి అన్నాక మనోభావాలు తప్పకుండా ఉంటాయి. మనోభావాలు అనేవి వ్యక్తిగతమైనవి మాత్రమే. సత్యాలు సార్వజనీనమైనవి. మనోభావాల మత్తులో సత్యాల్ని కాదనుకోవడం, అందుకోలేకపోవడం, వదిలేసుకోవడం అనర్థదాయకం, అపాయకరం. మనోభావాలు కాదు సత్యాలు మాత్రమే అవసరమైనవి ఆపై ప్రయోజనకరమైనవి. మనోభావాలు దెబ్బతింటాయి లేదా దెబ్బతింటున్నాయి అనే మాటను మనం వింటూ ఉంటాం. మనోభావాలు దెబ్బతినడం అంటూ ఉండదు. వ్యక్తులలో ఉండే మనోభావాలు ఉన్నంత కాలం ఉంటాయి. కాలక్రమంలో పోతూ ఉంటాయి. మనోభావాలు అనేవి ప్రతి వ్యక్తికి వయసుతోపాటు మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఐదేళ్లప్పుడు ఉన్న మనోభావాలు పదేళ్లప్పుడు ఉండవు. పదేళ్లప్పటివి ఇరవై యేళ్లప్పుడు ఉండవు. వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, తెలివిని బట్టి, తెలివిడిని బట్టి మనోభావాలు అన్నవి వేరువేరుగా ఉంటాయి. విద్య, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాల్లోనూ, కళల్లోనూ, సార్వత్రికమైన విషయాల్లోనూ మనోభావాలు అనేవి అవసరం అయినవి కావు. సంఘ, ప్రపంచ ప్రయోజనాలపరంగా మనోభావాలు అనేవి ఎంత మాత్రమూ పనికిరావు. మానవ ప్రయోజనాలపరంగా సత్యాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలు చర్చనీయమూ, పరిగణనీయమూ అవవు. ఒక వ్యక్తి మనోభావాలు మరో వ్యక్తికి, సమాజానికి అక్కర్లేనివి. మనోభావాలు, మనోభావాలు అని అంటూ ఉండడమూ, తమ మనోభావాలు ముఖ్యమైనవి లేదా విలువైనవి అని అనుకుంటూ ఉండడం మధ్యతరగతి జాడ్యం. మనోభావాలు ప్రాతిపదికగా వ్యవహారాలు, సంఘం, ప్రపంచం నడవవు. ఈ విజ్ఞత ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. మనం మన మనోభావాలవల్ల మనకు, సంఘానికి సమస్యలం కాకూడదు. మన మనోభావాలు మనల్నే అడ్డగించే గోడలుకాకూడదు. మన మనోభావాలకు మనమే గుద్దుకోకూడదు. మనోభావాలు మనుగడ మునుసాగడాన్ని ఆపెయ్యకూడదు. మనిషి జీవితంలో ఒక మేరకు వరకే మనోభావాలకు స్థానాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనోభావాలకు అతీతంగా మనుగడను ముందుకు తీసుకువెళ్లడం మనిషి నేర్చుకోవాలి. మనోభావాలకు కట్టుబడి ఉండడం ఒక మనిషి జీవనంలో జరుగుతున్న తప్పుల్లో ప్రధానమైంది. స్వేచ్ఛగా సత్యాల్లోకి వెళ్లడం, వాటివల్ల స్వేచ్ఛను పొందడం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం. సత్యాలవల్ల వచ్చే స్వేచ్ఛ దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. తమ మనోభావాల్ని అధిగమించినవాళ్లే సత్యాలలోకి వెళ్లగలరు. సత్యాలను ఆకళింపు చేసుకోగలిగితే మనోభావాలు, మనోభావాలవల్ల కలిగే కష్ట, నష్టాలు చెరిగిపోతాయి. మతం, కులం, ప్రాంతీయత, ఉగ్రవాదం వంటివాటివల్ల జరుగుతున్న హానికి, అల్లకల్లోలానికి మనోభావాలే కారణం. మనిషికి సత్యాలపై తెలివిడి వచ్చేస్తే ఈ తరహా దుస్థితి, దుర్గతి ఉండవు. హిట్లర్ మనోభావాల కారణంగా ప్రపంచయుద్ధమే వచ్చి ప్రపంచానికి పెనుచేటు జరిగింది. మనోభావాలకు అతీతంగా సత్యాలపై ఆలోచన, అవగాహన హిట్లర్‌కు, మరికొంతమందికి ఉండి ఉంటే రెండో ప్రపంచయుద్ధం జరిగేదే కాదు. మనోభావాలవల్ల కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో దారుణాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి, జరుగుతున్నాయి. చరిత్రను, సమాజాన్ని, మనపక్కన ఉన్న కుటుంబాల్ని పరిశీలిస్తే ఈ సంగతి తెలియవస్తుంది. మన మనోభావాలను మనవరకే మనం పరిమితం చేసుకోవాలి. మన మనోభావాలకు తగ్గట్టు విషయాల్ని, ఇతరుల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. మన మనోభావాల ప్రాధాన్యతకు ఉన్న హద్దుల్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. మనోభావాలను దాటి సత్యాల ఆవశ్యకతను తెలుసుకుందాం; సత్యాలను ఆకళింపు చేసుకుందాం; సత్యాలవల్ల సత్ఫలితాలను పొందుదాం. సత్యాల సత్వంతో సరైన, సఫలమైన జీవనం చేస్తూ ఉందాం. – రోచిష్మాన్ -
కరోనా : చైనాపై మరో బాంబు
బీజింగ్: కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ లి-మెంగ్‌యాన్ ప్రాణాంతక వైరస్ గురించి చైనాకు ముందే తెలిసినా ప్రపంచాన్ని హెచ్చరించలేదంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికాలో అజ్ఞాతంలో ఉన్న యాన్, కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అబద్ధాలు చెప్పడమే కాకుండా, తరువాత మానవుల నుంచి మానవులకు వ్యాప్తి గురించి కూడా కప్పిపుచ్చిందని ఆరోపించారు. గత సంవత్సరం డిసెంబరులో మహమ్మారి విస్తరణ గురించి మాట్లాడకుండా తన నోరు మూయించారని ఆమె ఆరోపించారు. వైరస్ గురించి చెప్పకుండా దాచిపెట్టిందంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు కరోనా గురించి ముందుగా తమను హెచ్చరించింది తమ కార్యాలయమే కానీ, చైనా కాదని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన యాన్ ప్రాణాంతక వైరస్ గురించి ముందుగానే చైనాకు తెలుసని, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలోనే గోప్యత పాటించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్యునాలజీ నిపుణురాలు యాన్ ఈ విషయాలను వెల్లడించారు. 2020 ఆరంభంలోనే కరోనా విస్తరణ ప్రారంభమైందని, ఇన్ఫ్లూయేంజా వైరస్లు, మహమ్మారుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్ లాబొరేటరీగా ప్రత్యేకతను కలిగి ఉన్న చైనాకు.. కరోనా గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతేకాదు, ఈ రంగంలో కొంతమంది అగ్రశ్రేణి నిపుణులుగా గుర్తింపు పొందిన తన పర్యవేక్షకులు తాను చేస్తున్న పరిశోధనలను కూడా విస్మరించారని ఆరోపించారు. (కరోనా : మరో సీనియర్ అధికారి మృతి) కోవిడ్-19 ను అధ్యయనం చేసిన ప్రపంచ మొట్టమొదటి శాస్త్రవేత్తలలో తానూ ఒకరని చెప్పిన యాన్ హాంకాంగ్‌తో సహా విదేశీ నిపుణులను పరిశోధనకు అనుమతించటానికి చైనా ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. 2019 డిసెంబర్ చివరలో చైనాలో నమోదవుతున్న సార్స్ వంటి కేసుల క్లస్టర్‌ను పరిశీలించమని డబ్ల్యూహెచ్ఓ రిఫరెన్స్ ల్యాబ్‌లోని డాక్టర్ లియో ఆదేశించినట్టు గుర్తు చేసుకున్నారు. తనపై దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారనీ, మాతృదేశ ప్రతిష్టను దెబ్బతీశానంటూ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన స్వస్థలమైన కింగ్డావోను స్వాధీనం చేసుకోవడంతోపాటు, తన తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారని యాన్ వాపోయారు. ప్రభుత్వ గూండాలు తనపై సైబర్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అయినా తన పోరాటాన్ని వదులుకోనని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అమెరికాకు పారిపోయినట్టు ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు. ఇదే చైనాలో ఉండగానే వెల్లడిస్తే తనను మాయం చేయడం లేదా చంపేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తన జీవితం ఇంకా ప్రమాదంలో ఉందని యాన్ అభిప్రాయపడ్డారు. తన ఇంటికి తిరిగి వెళ్లలేమోననే భయం పీడిస్తోందన్నారు. ఇది ఇలా వుంటే హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆమె పేజీని తొలగించింది. డాక్టర్ లి-మెంగ్ యాన్ ఇకపై తమ సిబ్బంది కాదని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల పట్ల గౌరవంతో వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. అధికారికంగా వార్షిక సెలవులో ఉన్నట్టుగా చెప్పిన తర్వాత కూడా ఆన్లైన్ పోర్టల్స్, ఇమెయిల్ యాక్సెస్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1.26 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడగా, 5.62 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. -
నాగమ్మ పెద్దమ్మ
బతికున్నప్పటి కంటే కొంతమంది చనిపోయాకే ఎక్కువ గుర్తుంటారేమో! అక్షరఙ్ఞానం లేకపోయినా తమ అనుభవాలతో జీవితాన్ని గడిపి ఆ శేషాన్ని ఙ్ఞాపకాలుగా మార్చి పోయినవాళ్లు ఇంకా బాగా గుర్తుంటారు. నాకు ఊహ తెలినసిన దగ్గర్నుంచి ఊరు విడిచిపెట్టే వరకూ నాగమ్మ పెద్దమ్మతో వున్న అనుబంధం కూడా అలాంటిదే. ఒంట్లో ఓపికున్నంత వరకూ కష్టపడాలని, ఇతరుల మీద అత్యవసరమైతే తప్ప ఆధారపడకూడదనే సత్యం నాగమ్మ పెద్దమ్మ నాకు నేర్పింది. సన్నగా, పొడుగ్గా, విశాలమైన నుదురు, నిటారుగా వుండే ముక్కుతో తెల్లగా కళగా వుండేది పెద్దమ్మ. తలంతా తెల్లబడి తలపైన ముగ్గుబుట్ట బోర్లించినట్లుగా వుండేది. నుదురునిండా కనిపించే ముడతలు కోనేటి దగ్గరున్న మెట్లను తలపించేవి. పట్టుకోకలు కట్టుకుని కోకచెంగును బొడ్డులో దోపుకునేది. నుదుటున బొట్టుండేది కాదు.బొట్టు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఇంటిముందున్న బూరుగుచెట్టు నుండి గాలికి రాలిపడిన బూరుగుకాయల్ని ముందేసుకుని వాటిలోని దూదిని వేరుచేస్తూ కనిపించేది పెద్దమ్మ. పసిపిల్లని సాకినట్లుగా ఒక్కో బూరుగుకాయనీ పగులకొట్టి అందులోనుంచి తీసిన దూది గాలికి ఎగరకుండా దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టిన దుప్పట్లో దాచిపెట్టేది. ఎప్పుడన్నా ఆడుకుంటూ పెద్దమ్మ ఇంటి వాకిట్లోకి వెళ్తే ‘కూర్చో’మన్నట్లుగా సైగచేసేది. ‘‘ఒక్కదానివే కదా ఇంట్లో వుండేది! కాసేపు పడుకోకుండా నడుము నొప్పెట్టేలా ఈ పనులెందుకు’’ అని అమాయకంగా అడిగేవాడిని. బోసినోటితో చిన్నగా నవ్వి నా బుగ్గలపైన సుతారంగా నొక్కి కణత దగ్గర మొటికలు విరిచి ముద్దు పెట్టుకునేది. తర్వాత లోపలికెళ్లి పండిన అరటిపండు తీసుకొచ్చి తినమని ఇచ్చేది. పెద్దమ్మ భర్త వ్యవసాయం బాగా చేసేవాడు. సొంతభూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పసుపు, అరటి పంటలు పండించేవాడు. అరటితోట కాపుకొచ్చినప్పుడు పండడానికి సిద్ధంగా వున్న గెలను తీసుకొచ్చి ఇంటి మధ్యలో వేళ్లాడదీసేవాడు. రోజుకు ఒకటో రెండో పండితే వాటిని తినడమో, పెరుగన్నంలో నంజుకుని తినడమో చేసేవాళ్లు. రెండో మూడో పాడిగేదెలుండేవి. గేదెల్ని పొలానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాక పాలుతీసి ఇంటింటికీ వెళ్లి ఖాతాల్లెక్కన పాలు పోసి వచ్చేది. పొరపాటున కూడా పాలల్లో నీళ్లు కలిపేది కాదు. ఎవరైనా వేళాకోళానికి ‘అందరూ పాలల్లో నీళ్లు కలిపి దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంటే... నువ్వేమో తీసిన పాలు తీసినట్లే పోస్తున్నావు’’ అని మాట్లాడితే ‘‘పాలూనీళ్లల్లా సంసారం సాగాలిగానీ వ్యాపారం చేయకూడదు..’’ అని సున్నితంగా మందలించేది. పెద్దమ్మకి పిల్లల్లేరు. లోపం ఎవరిదో ఆ భగవంతుడికే తెలియాలి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పిల్లల్లేరనే దిగులు లేకుండా జీవితం గడిపేవారు. అయినా లోపం లోపమే కాబట్టి తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచు కున్నారు. కడుపున పుట్టకపోయినా వాడిని ఏ పనీ చేయనివ్వకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా లేదన కుండా ఇవ్వడం, అతిగారాబం వల్ల వాడు చదువబ్బక జులాయిగా మారాడు. ఎటూ చదువబ్బడం లేదుకాబట్టి వ్యవసాయం నేర్చుకుంటాడని పొలానికి తీసుకెళ్తే తండ్రి చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. పిల్లలు కళ్లముందు ఎంత అల్లరిచేసినా అది తల్లిదండ్రులకు సంబరంగానే వుంటుంది. ఎప్పుడైనా ఇరుగుపొరుగు వాళ్లు వాడిమీదేమైనా చాడీలు చెప్తే ‘‘అల్లరి చేయకుండానే పెద్దవాళ్లు అయిపోయారా? పసితనం కదా... వాడే తెలుసుకుంటాడులే..’’ అని సర్ది చెప్పి పంపించేది. కాలం కలకాలం ఒకేలా వుండదు. మనిషి లెక్కలు మనిషికుంటే కాలం లెక్కలు కాలానివి. పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరిచివరి మామిడితోటలో వున్న దిగుడుబావిలో పడి చనిపోయాడు వాడు. పెద్దమ్మ గుండె పగిలిపోయింది. పిల్లాడిని పెంపకానికిచ్చిన తల్లి పెద్దమ్మను తీవ్రంగా తిట్టిపోసింది. ‘గొడ్డుమోతుదానివి, పేగుతెంచుకుని కంటే ఆ బాధ తెలుస్తుంది, పెంపకానికి తెచ్చుకుంటే పిల్లలపైన ప్రేమెలా పుడుతుంది, వాళ్లను కాపాడుకోవాలనే ఙ్ఞానమెలా వస్తుంది...’’ కడుపుమీద కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడ్తున్న ఆమెవంక విషాదంగా చూస్తుండిపోయింది పెద్దమ్మ. సొంత తల్లికాకపోయినా అంతకంటే ఎక్కువగానే సాకింది వాడిని. తన పెంపకంలో లోపం లేదు, తన ప్రేమలో లోటులేదు. అయినా అనుకోని విపత్తు జరిగితే లోకం దృష్టిలో ఎన్ని నిందలుపడాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది పెద్దమ్మకి. కాలం గాయాలు చేస్తుంది, ఓదార్పునూ ఇస్తుంది. కొన్నాళ్లు వాడి ఙ్ఞాపకాలతోనే భారంగా గడిచిపోయింది జీవితం. వాడి గుర్తులనుండి బయటపడి ఈ లోకంలోకి వస్తున్న పెద్దమ్మకి భర్తమరణం పిడుగులా మారింది. ఒకరోజు ఉదయాన్నే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన భర్త పాముకాటుకు గురై చనిపోయాడు. పెద్దమ్మకి పెళ్లైనప్పటి నుండీ వాళ్ళిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా వుండేవారో తెలిసిన వాళ్లు ఆమెను ఓదార్చారు గానీ బాధను తీసేయలేకపోయారు. భర్త పోయిన తర్వాత పంటనుండి వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చింది. పాలమ్మగా వచ్చిన ఆదాయాన్ని రోజువారీ ఖర్చులకోసం వాడుకునేది. రోజులు గడిచేకొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోవడం, గేదెలకు చాకిరీ ఎక్కువగా చేయాల్సి రావడంతో వాటిని అమ్మేసింది. ఇంటిచుట్టూ మట్టిగోడలు పడగొట్టించి ఇటుకలతో కట్టించింది. అరసెంటు స్థలం చుట్టూ వున్న పిచ్చిమొక్కల్ని తొలగించి కంచె పాతించింది. ఇంటిముందున్న సపోటా చెట్టుకిందో, జామచెట్టుకిందో మంచం వేసుకుని కూర్చునేది. ఇంటిముందునుంచి ఎవరెళ్తున్నా ‘ఎలా వున్నారం’టూ అందర్నీ ఆరాతీసేది. ‘కాసేపు కూర్చుని పోదువు రా’ అంటూ పిల్చేది. ‘‘నీకేమే పెద్దమ్మా... ఒంటరిదానివి. ఒక ముద్దొండుకుని తింటావు, నిద్రొస్తే పడుకుంటావు. నీకులాగా మాకెలా కుదురుతుందీ...’’ అంటూ దీర్ఘం తీసుకుంటూ వెళ్ళే వాళ్లవంక చూస్తూ ‘‘ఒక్కదాన్నే వుండడం ఎంత నరకమో నీకెంత చెప్పినా తెలియదులే...’’ నీళ్లను కళ్లల్లోనే దాచుకుని తనలో తనే గొణుక్కునేది పెద్దమ్మ. పొద్దున్నే లేచి చక్కగా ముఖం కడుక్కుని అద్దం ముందేసుకుని జామచెట్టు కింద కూర్చుని తలదువ్వుకునేది. ఒత్తుగా కొబ్బరినూనె రాసుకుని తలపై వున్న కాసిని వెంట్రుకలనే శుభ్రంగా దువ్వుకుని దానిలో సవరం పెట్టి అల్లుకుని పెద్ద ముడేసుకునేది. అటూఇటూ అద్దాన్ని తిప్పి కాసేపు చూసుకునేది. ‘‘ఇంత వయసొచ్చినా సోకు తగ్గలేదు నీకు... నిండా నాలుగెంట్రుకలు లేవు, పొద్దస్తమానం దువ్వుతూనే వుంటావు...’’ అనేవాళ్లని చూసి ‘‘నాతోపాటు పుట్టినయ్, పోయే దాకైనా జాగ్రత్త చేయాలిగా...’’ అంటూ ముసిముసిగా నవ్వుకునేది. పెద్దమ్మ ఎండుచేపలు అమ్మేది. ప్రతీ ఆదివారం తెల్లవారుజామునే లేచి పెద్ద గోనెసంచి తీసుకుని ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న సంతకి వెళ్లేది. ఎండురొయ్యలు, చీలికచేపలు, రొయ్యపొట్టు, ఉప్పుచేపలు తీసుకుని వెనక్కి వచ్చేది. బస్సుదిగి ఊర్లోకి నడిచివస్తుంటే ఆడోళ్లందరూ పెద్దమ్మ వెనకాలే వచ్చేవాళ్లు ఎండుచేపలకోసం. కనీసం మూట కూడా దించుకోనివ్వకుండా మీదకి ఎగబడేవాళ్లు. వాళ్లందర్నీ తోసి ‘ముసలిముండని... అంతదూరం నుండి ఇంత పెద్ద మూటేసుకుని పడతా లేత్తా ఇంటికొస్తే ఒక్కతన్నా గుక్కెడు మంచినీళ్లిచ్చిందా? చేపలో చేపలో అని నా గోచి లాగుతున్నారు, అవతలికి పొండెహే...’’ అంటూ తిట్టేది. గోనెసంచి ముడివిప్పగానే ఎండుచేపల వాసన గుప్పున వచ్చేది. ఈగల్లాగా అందరూ మూకుమ్మడిగా చేరి ‘నాకివి కావాలి, నాకవి కావాలి’ అంటూ ఎవరిక్కావలసిన చేపలు వాళ్లు పట్టుకెళ్లేవాళ్లు. తక్కెడ సర్ది లోపల దాచిపెట్టేది. గురువారం నుండి శనివారం వరకూ ఎవరికైతే చేపలు అప్పుగా ఇచ్చిందో వాళ్లదగ్గరకెళ్లి డబ్బులు వసూలుచేసేది. ఆ డబ్బులు లెక్కచూసుకుని మళ్లీ ఆదివారం సంతకి సిద్ధమయ్యేది. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునేది కాదు. ఒకవేళ కూర్చున్నా బూరుగుకాయల నుంచి దూది వడుక్కునేది. పొయ్యి వెలిగించుకుని నాలుగుగింజలు ఉడికించుకుని కాల్చిన ఎండుచేప నంజుకుని ఆ పూటకి భోజనం కానిచ్చేది. రెండుముద్దలు కాకులకోసం విసిరేది. ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చే వాటికి, ఏకాకిగా జీవితం గడుపుతున్న తనకీ పెద్దగా భేదం కనిపించేది కాదు. పిచ్చాపాటిగా ఎవరైనా ఎప్పుడైనా ‘‘ఒక ముద్దొండుకుని తిని ఇంట్లో కూర్చోకుండా ఎందుకే ఎండనపడి అంతదూరం వెళ్లి సుఖంగావున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావు? మధ్యదారిలో ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది...’’ అనేవాళ్ళు.దానికి పెద్దమ్మ ‘‘పోయే ప్రాణమే గానీ వచ్చే ప్రాణం కాదుగా... ఎప్పటికైనా పోవలసిందే! ఎంతసేపూ ఇంట్లోనే కూర్చుంటే ఇబ్బందిగా వుంటుంది. సంతకెళ్తే నాలుగు ముఖాలు కనిపిస్తాయి, నలుగురి మాటలు వినిపిస్తాయి. ప్రపంచంలో నా ఒక్కదానికే కష్టాలున్నాయనుకునేదాన్ని. సంతలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకం కష్టం. వాళ్లకంటే నేనే నయమనిపిస్తుంటుంది...’’ అని చెప్తూ సొట్టబుగ్గలు ఇంకా గుంటలుపడేలా పెద్దగా నవ్వేది. మళ్ళీ తనే నవ్వుతూ ‘‘ఇదిగో ఇంకో మాట చెప్తా విను... కాలూచెయ్యీ పడిపోయి మంచానపడి అందరిచేతా సేవ చేయించుకుంటూ తిట్టించుకుంటూ పోయేకంటే... ఈ చిలక ఎక్కడో ఒకచోట గుటుక్కున ఎగిరిపోతేనే బాగుంటుంది.... ఏమంటావు?’’ అంటూ నవ్వుకుంటూ లోపలికెళ్తున్న పెద్దమ్మ వంక ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు అయోమయంగా చూసేవాళ్ళు. అన్నట్టుగానే పెద్దమ్మ వెళ్లిపోయింది. ఎవరిచేతా మాటపడకుండానే, ఎవరితోనూ చేయించుకోకుండానే పడు కున్నది పడుకున్నట్లే నిద్రలోనే చనిపోయింది. అటువంటి మనిషి మళ్లీ పుట్టదని ఊరంతాఅనుకున్నారు. అటువంటి చావు ఎవరికీ రాదని కూడా అందరూ అనుకున్నారు. - డా. జడ సుబ్బారావు -
19 ఆడశిశువుల కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
సాంగ్లి: 19 ఆడశిశువులను అమానుషంగా అంతం చేసిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణంపై విచారణ చేపట్టిన పోలీసులు మరిన్ని భయకంరమైన, కఠిన వాస్తవాలను సేకరించారు. మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో చోటుచేసుకున్న ఆడశిశువుల అబార్షన్లపై వివరాలను పోలీసులు వివరించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఘటనల వివరాలను పరిశీలిస్తే...రెండు రాష్ట్రాల్లో ఎజెంట్లను నియమించుకుని మరీ ఈ దందాను సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానంరాకుండా మహారాష్ట్ర కేసులను, కర్ణాటకకు, కర్ణాటక కేసులను మహారాష్ట్రకు పంపిస్తారు. అంతేకాదు ఈ అబార్షన్లకోసం డా. బారతి ప్రయివేటు ఆసుపత్రిలో ఏకంగా భూగర్భంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్ కు బదులుగా ఒక తాత్కాలిక గుడిసెలో గర్భస్రావాలు నిర్వహిస్తారు. అంతేకాదు కొన్నిసార్లు , కాంపౌండర్లు లేదా నర్సులే ఈ పనిని పూర్తి చేస్తారట. అనంతరం ఆ పిండాలను పాతిపెట్టడం, లేదా టాయిలెట్ లో యాసిడ్ తో కలిసి ప్లష్ చేస్తారు లేదంటే కుక్కలకు ఆహారంగా వేస్తారు. కానీ మొన్నటి ఘటనలో ప్లాస్టిక్‌సంచుల్లో కుక్కి పాతిపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి గాను వారు రూ.25వేలు చార్జ్ చేస్తారు. గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అయితే అబార్షన్ చేస్తారు.. అబ్బాయి అయితే.. ఆ విషయం చెప్పినందుకు ఈ చార్జ్ వసూలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న అబార్షన్లపై పోలీసులు ఆరా తీయగా రాకెట్టు గుట్టురట్టయింది. ఈ కేసులో డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ సహా ఇప్పటికీ12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు. డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ , డాక్టర్ శ్రీహరి గోడ్కే, విజపూర్ నుంచి డాక్టర్ రమేష్ దేవిగర్ (ఎంబీబీఎస్). ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈకేసును పరిశోధిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ దీపాలి కాలే చెప్పారు. అయితే ఆసుపత్రిపై దాడులు నిర్వహించామనీ, తమకు అనుమానాస్పద సమాచారం దొరకలేదనీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హెల్త్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ అర్చనా పాటిల్ తెలిపారు. మరోవైపు గతంలో కూడా ఇదే డాక్టర్ పై కేసులు నమోదయ్యాయి. అపుడు వైద్య అధికారులు ఏమీ లేదని తేల్చిపారేశారు. అయితే ఈ సారి పోలీసుల దర్యాప్తులో మాత్రం అక్రమంగా వాడుతున్న మందులు, అక్రమ థియేటర్ తదితర విషయాలు తేలాయి. అసలు సదరు డాక్టర్‌కు ఆపరేషన్ నిర్వహించే అనుమతి కూడాలేదని పోలీసులు స్పష్టం చేశారు. క్రిమినల్ కోణం ఉంటేనే తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. స్వాతి మరణంపై తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అయితే ఆరోగ్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య అధికారులు కేవలం ఒకసారి రెయిడ్ చేసి ఏమీ దొరకలేదని చెపుతున్నారనీ, ఇందులో మరిన్ని కోణాలుదాగి వున్నాయనే అనుమానాలను దర్యాప్తు అధికారి వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని సాంగ్లి , బీడ్ జిల్లాలు రెండూ అత్యల్ప చైల్డ్ సెక్స్ రేషియో నమోదు చేశాయి. ముఖ్యంగా బీడ్ లో 1991 నుంచి లింగ నిష్పత్తి క్రమంగా పడిపోవడం గమనార్హం. -
కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!
హ్యూమర్ ‘‘కోడి దాని రెక్కల కింద అలా తన తలను దాచుకుందేం నాన్నా’’ అడిగాడు ఏడేళ్ల మా బుజ్జిగాడు. ‘‘అంటే... దానికి జ్వరమొచ్చిందన్నమాట. జ్వరం తగ్గే వరకూ అది అలా తన తలను రెక్కల చాటున దాచుకుంటుందన్నమాట’’ వివరించాను. ‘‘అరె... అసలే దాని ఒళ్లు వెచ్చగా ఉంటుంది. మొన్న కోడిని కాసేపు పట్టుకుంటే తెలిసింది... దాని ఒళ్లు ఎంత వేడిగా ఉంటుందో! ఇప్పుడు దానికి జరం వచ్చిందని నువ్వు అంటున్నావు. అలాంటప్పుడు దాని తల మరింత వేడెక్కి పోతుంది కదా. ఒళ్లు అలా కాలిపోతున్నప్పుడు మళ్లీ తల అలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా’’ అన్నాడు వాడు. అది తల ఎలా పెట్టుకుందో తెలియదు గానీ... నాకు మాత్రం తలపట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. మా బుజ్జిగాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ కోళ్ల పెంపకం కార్యక్రమం పెట్టుకున్న దగ్గర్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అవి ముఖ్యంగా మా బుజ్జిగాడి సందేహాల రూపంలో ఆ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాడి డౌట్ల కారణంగా నేను అడుగేసినప్పుడల్లా కోడి రెట్టలో కాలేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏదో నేను మరచిపోయినా మావాడు వాటికింత మేత వేస్తాడు కదా అని లేనిపోని ఈ పెంపక కేంద్రం మొదలుపెట్టాను. నేను వాటిని పెంచుతున్నానా... మావాడి డౌట్సును పెంచుతున్నానా అన్నది అర్థం కాకుండా పోయింది. వాడు మళ్లీ తన డౌట్ గుర్తు చేస్తూ... ‘‘జరం వచ్చినప్పుడు అలా తలపెట్టుకోవద్దు అని కోడికి చెప్పు నాన్నా’’ అన్నాడు వాడు. కోడికి మన లాంగ్వేజీ అర్థం కాదన్నా వినేట్టు లేడు. ఒకవేళ మన భాష అర్థం కాదని అంటే... ‘బో... బో...బో అంటే తిండి తినమని కదా. ఇష్షు ఇష్షు అంటే దూరం పొమ్మని కదా’ అని... ‘కోడి భాష... అనువాదం... కొన్ని మెళకువలు’ అని నాకు కొత్తగా కొన్ని కోడిపదాలు నేర్పేట్టు ఉన్నాడు అనుకున్నాను. వాడి సందేహం తీర్చడం కోసం అప్పటికప్పుడు ఒక ఐడియా ఫ్రేం చేసుకున్నాను. దాన్ని అమల్లో పెట్టాను. ‘‘ఒరేయ్... మొన్న నాకు జలుబు చేసినప్పుడు వేణ్ణీళ్లలో విక్స్ వేసుకొని ఆవిరి పట్టుకున్నాను గుర్తుందా. అప్పుడు వద్దంటున్నా నా దుప్పట్లోకి నువ్వు దూరావు. అప్పుడు నాకులాగే ఇప్పుడు మన ఈ కోడికీ జలుబు చేసిందన్నమాట. పాపం... అది ఆవిరి పట్టుకోడానికి వేణ్ణీళ్లు పెట్టుకోలేదు కదా. అందుకే రెక్కల చాటున ఉన్న వేడిని తన ముక్కు రంధ్రాల్లోకి పంపించుకుంటుదన్నమాట. అలా అది తనకు తాను ఆవిరిపెట్టుకుంటోంది’’ అని వివరించాను. ‘‘ఓహో... పాపం... దాని ముక్కు తుడుచుకోవడం ఎంత కష్టం నాన్నా. అందుకే చిరాకుగా అది ఒక్కోసారి తన గోళ్లతో ముక్కును గీరుకుంటోంది. పాపం... దానికి దురద పెట్టి గీరుకుంటుందేమో అనుకున్నా. ఆహా... ఇప్పుడు అర్థమైంది. నిజానికి అది ముక్కు తుడుచుకుంటుందన్నమాట అన్నాడు వాడు. వాడితో ఎందుకొచ్చిన గొడవ అంటూ ‘ఆ... అవునవును’ అన్నాను. రెండ్రోజుల క్రితం కొన్ని డబ్బులు బ్యాంకులో వేయడానికి బయల్దేరాను. ఇంట్లో తన పనుల్లో కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నాడని వాణ్ణి నాకు అప్పగించింది మా ఆవిడ. ‘‘డిపాజిట్ ఫామ్ నింపాక ఏదో క్యూలో నించోవడమే కదా. బుజ్జిగాణ్ణి వెంట తీసుకెళ్లండి. ఇక్కడుంటే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు’’ అంది. ‘‘అవున్నాన్నా.. అచ్చం మన కోడిలాగే. అదీ ఎప్పుడూ ఒకటి కెలుకుతూ ఉంటుంది కదా’’ అన్నాడు వాడు. పైగా పొదిగి పిల్లలు పెట్టాక మా కోడి అంతటిది పిల్లలను వెంటేసుకొని పెరట్లో తిరుగుతూ ఉంది. మనిషినయ్యాక బిడ్డను బయట తిప్పకపోతే ఎలా అనుకొని వాణ్ణి వెంటతీసుకొని బ్యాంకుకు వెళ్లా. అక్కడికి వెళ్లాక కౌంటర్లో డిపాజిట్ డబ్బులు ఇవ్వడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాను. ‘‘అవునూ... మొన్న ఆ అంకుల్ ఎవరో వచ్చి అడిగితే డబ్బులు లేవన్నావు. ఇప్పుడు మళ్లీ బీరువాలోంచి తీసి బ్యాంకులో వేస్తున్నావు ఎందుకు?’’ అని అడిగాడు వాడు. అలా బ్యాంకు వాళ్ల ముందు... అక్కడున్న వాళ్ల ముందు నా పరువు తీశాడు వాడు. అసలే నాది చిన్న మెదడు. పైగా అది ఫారం కోడి మెదడులా అయిపోయింది. ఏదో మొన్నంటే జలుబూ-జ్వరం అని ఒక కథ అల్లాను గానీ కాస్త క్యాషూ కామర్సూ వ్యవహారాలంటే నాకు కంగారు. అందుకే నాకు ఏం చేప్పాలో తోచలేదు. ఇంటికెళ్లాక మీ అమ్మ చెబుతుందని తప్పించుకున్నాను. కానీ ఇంట్లోకి వెళ్లాక మళ్లీ అదే ప్రశ్న వేశాడు వాడు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే మా ఆవిడ కల్పించుకుంది. ‘‘ఒరేయ్... పొదగడం అంటే మొన్న అడిగితే మీ నాన్న చెప్పలేకపోయారు కదా. చెబుతా విను. ఇప్పుడూ... కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకో. అది ఏటీఎమ్ నుంచి డెరైక్ట్‌గా డబ్బులు తీసుకున్నట్లు అన్నమాట. కానీ అవే గుడ్లను కోడి కింద పెట్టేశామనుకో. మొన్న ఆ కోడి పొదగడం చూశావు కదా... అలా బ్యాంకువాళ్లు ఆ డబ్బును తమ వద్ద దాచుకుని, డబ్బు తాలూకు పిల్లలు చేసి మనకు అప్పగిస్తారన్నమాట. అచ్చం మన కోడి పిల్లల్లాగే! ఇప్పుడు నీకు అర్థమైందా పొదగడం అంటే ఏమిటో?’’ అని వివరించింది మా ఆవిడ. మా ఆవిడ తాలూకు కోచింగులోని టీచింగ్ మెలకువలు చూసి కోడి కెలికిన పెంటకుప్పలా అయిపోయింది నా మైండు. కానీ ఆమె చెప్పిన పాఠం మాత్రం బురదలో కోడి కాలి గుర్తులా నా మెదడులో అలా నిలిచిపోయింది. - యాసీన్ -
వాచ్.. వాస్తవాలు...
ప్రస్తుత బిజీ ప్రపంచంలో గడియారం లేకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం. మనకు క్రమశిక్షణ, కచ్చితత్వం నేర్పించేది గడియారమే. అందుకే గాంధీ గారికి ఇష్టమైన వస్తువుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండేది. నిజానికి గడియారాన్ని కనిపెట్టక ముందు నుంచీ సమయాన్ని తెలుసుకోవడానికి మన పూర్వీకులు ఎంతో శ్రమించారు. ప్రాచీన మానవులు సన్ డయల్, క్యాండిల్ వాచ్ లాంటి పరికరాలతో సమయాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే వాచ్‌ల రాకతో కచ్చితత్వం పెరిగింది. కొన్ని నిజాలు: * సమయాన్ని తెలుసుకోవడాన్ని ఈజిప్షియన్లు ప్రారంభించారనడానికి ఆధారాలున్నాయి. పగటిపూట మాత్రమే పనిచేసే ‘సన్ డయల్’ సహాయంతో వీరు సమయాన్ని లెక్కగట్టేవారట! * ట్యూడర్ రాజుల కాలంలో జేబు గడియారాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి నాలుగో హెన్రీ చక్రవర్తి కాలంలో గడియారాలు చాలా పెద్దవిగా ఉండేవట. ఎంతలా అంటే ప్రజలు వాటిని మెడలో వేలాడదీసుకునేంత! * మొట్టమొదటి చేతిగడియారాన్ని 1868లో పాటిక్ ఫిలిప్పీ అనే వ్యక్తి తయారుచేశాడు. * మొదటి ప్రపంచయుద్ధం వరకూ చేతిగడియారాలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటివరకూ ఆడవారి ఆభరణాల్లో ఒకటిగా దీన్ని భావించారు. అయితే ఈ యుద్ధంలో గడియారాలను మెడకు ధరించడానికి బదులుగా చేతికి ధరించాల్సిరావడంతో వీటికి ఎనలేని పాపులారిటీ వచ్చేసింది. * డిజిటల్ వాచ్‌లను ప్రపంచానికి అందించిన ఘనత దిమిత్రోఫ్ పెట్రోఫ్కు దక్కుతుంది. ఈయన నాసాలో ఇంజినీర్‌గా పనిచేశారు. * మెకానికల్ వాచ్‌లు క్వార్జ్ వాచ్‌లతో పోల్చితే అంత మెరుగైన పనితీరు చూపించవట. క్వార్జ్ వాచ్‌లను తొలిసారిగా 1969లో ప్రవేశపెట్టారు. * షాపుల్లో అమ్మకానికి పెట్టే గడియారం ఎప్పుడూ 10 గం. 10 నిమిషాలనే సూచిస్తుంది. దీని ఉద్దేశం వినియోగదారుణ్ని ఆకర్షించడమే. ఈ సమయం దగ్గర గడియారం నవ్వు ముఖం పెట్టినట్టుగా కనిపిస్తుందట. దీంతో కష్టమర్లు దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తారనేది వ్యాపారుల భావన! * ఎలాంటి పరిస్థితుల్లోనైనా కచ్చితమైన సమయాన్ని చూపించే వాచ్‌గా ‘రోలెక్స్’కు పేరుంది. 1953లో తొలిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ ఈ వాచీనే ధరించాడట. 1960లో యూఎస్ నేవీ జలాంతర్గామి 35,798 అడుగుల లోతులో ప్రయాణించినప్పుడు కూడా దీన్ని పరీక్షించారట. అయితే ఒక్క సెకను కూడా తేడా లేకుండా ఇది సమయాన్ని చూపించిందని చెబుతారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర
ఆచారాలు-నమ్మకాలు - రచన: ఎం.వి.రమణారెడ్డి దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. ఒకవైపు ఇంత భారీ సమ్మేళనం జరుగుతున్నా, మెసొపొటేమియాకు తూర్పు దిశగా ఉండే సింధూ నాగరికత మాత్రం దేవాలయాల సంప్రదాయాన్ని స్వీకరించలేదు. తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సింధూనాగరికతలో దేవాలయం ఆనవాళ్ళు లేవు. వాళ్ళ లిపిని ‘డిసెఫర్’ చేసే ఉపాయం ఇంతవరకు దొరక్కపోవడంతో, ఆ నాగరికుల విశ్వాసాలను గురించి ఊహాగానాలే తప్ప, నిర్ధారణకు వీలు కలగడం లేదు. బహుశా, వాటిల్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన ఆర్యుల సంప్రదాయాలతో కలిసిపోయి ఉండవచ్చు. పూర్వకాలం ఆర్యుల్లో యజ్ఞయాగాది వైదిక కర్మలే గాని, విగ్రహారాధన లేదు. పై రెండు సంస్కృతుల సమ్మేళనంగా సింధూనది నుండి తూర్పుకు విస్తరించిన ‘హిందూ’ నాగరికతలో క్రీ.శ. 4వ శతాబ్దం దాకా కూడా ఉత్తర భారతదేశంలో దేవాలయం జాడే కనిపించదు. (దేవాలయాలు లేవంటే అసలు శిల్పమే లేదని కాదు; మౌర్యుల కాలం నాటికే శిల్పకళ బాగా అభివృద్ధి చెందిన దశకు చేరుకుంది.) ఆ తదుపరి ఉత్తరభారతదేశంలో ప్రవేశించిన జైన, బౌద్ధ మతాలకు విగ్రహారాధన లేకపోవడంతో, మెసొపొటేమియా, ఈజిప్టుల్లో దేవాలయాల నిర్మాణం ప్రారంభమైన కాలం నుండి కనీసం 4000 సంవత్సరాల దాకా ఉత్తర భారతదేశానికి ఆ సంప్రదాయం విస్తరించలేదు. దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. అయితే, భాగవత రామాయణాల రచనా కాలానికి సంబంధించిన ఆధారాలు అందుబాటు కాలేదు. శ్రీరాముని విషయం మహాభారతం అరణ్యపర్వంలో ఉటంకించడాన్ని బట్టి, ఆ వృత్తాంతం భారత రచనాకాలానికే ప్రాచుర్యంలో ఉందనడానికి సందేహం లేదు. రామాయణ కావ్యం ఉపోద్ఘాతంలో వాల్మీకి తన రచనను ‘ఆదికావ్యం’గా తనకు తానే చెప్పుకోవడంతో, అది భారతానికంటే ముందు రచనగా విశ్వాసం పాతుకుపోయింది. మహాభారతం ఒక కావ్యంగా కాక, ఇతిహాసంగానూ పంచమ వేదంగానూ పరిగణించడం వల్ల, ఒక కావ్యంగా తనది మొదటిది అన్నాడో, లేక ఇతివృత్తాలతో సాగిన రచనల్లో తనది మొదటిదిగా వాల్మీకి భావించాడో చెప్పలేం. కొనామొదలు మహాభారతంలో తారసపడే వందలాది మహర్షుల జాబితాలో వాల్మీకి పేరు ఎక్కడా కనిపించదు. అరణ్యపర్వంలో రాముని కథ క్లుప్తంగా వివరించే సందర్భంలోనూ ఆ గాథ గ్రంథస్థమైన సూచన కనిపించదు. పైగా, భారతంలోని పాత్రలు వ్యాసునికి సమకాలికులైనా, వాళ్ళ వ్యవహారాలు జ్ఞాపకాల మీదా, మౌఖిక వర్తమానాల మీద నడిచాయే తప్ప లిఖితరూపమైన సందేశాలు ఎక్కడా కనిపించవు. ఇంతేకాక, భాషలోనూ, సామాజిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల్లోనూ కనిపించే వ్యత్యాసం వల్ల రామాయణ రచనాకాలం భారతం కంటే ముందుందని చెప్పటానికి ప్రబలమైన విశ్వాసం మినహా మరో ఆధారం దొరకదు. భారత, భాగవతాలు రెండూ వ్యాస విరచితాలేనని ప్రతీతి. ఆ రెండు రచనల మధ్య వ్యవధి ఎంతుందో తెలీదుగానీ, సారాంశంలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. కథ రూపంలో వైదిక కర్మకాండను ప్రోత్సహించేది మహాభారతం. కానీ, క్రీ.పూ. 600 ప్రాంతంలో వైదిక కర్మల పట్ల నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రముఖంగా ‘చార్వాకులు’ అనబడే ఒక వర్గం వాటికి వ్యతిరేకమైన తర్కాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టింది. యజ్ఞయాగాదుల్లో జరిగే జంతుబలిని నిరసించే ధోరణి అప్పటికే ప్రబలిందని మహాభారతం అశ్వమేథ పర్వం వివరించే ‘ముంగిస కథ’ మూలంగా వెల్లడౌతుంది. చార్వాకుల హింసావ్యతిరేక సిద్ధాంతంలో పుట్టిన ‘అహింసావాదం’ బౌద్ధానికీ జైనానికీ ప్రాణం పోసింది. - (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com