siria
-
సిరియాలో ముదిరిన అంతర్యుద్ధం..
-
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. వీడియో విడుదల
సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదేపదే హెచ్చరించింది. ‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה. צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH — צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024 హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమంతిచబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్‌లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్‌లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. -
Earthquakes: రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారులు సేఫ్!
గజియాన్టెప్(తుర్కియే): భూకంప శిథిలాలను తొలగించేకొద్దీ వెలుగుచూస్తున్న విగతజీవులు.. ప్రాణాధార వ్యవస్థలు అందుబాటులోలేక రక్తమోడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాలంతో పోటీపడుతూ నిర్విరామంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు.. ఎటుచూసినా ఆప్తుల ఆక్రందనలు, మిన్నంటిన రోదనా దృశ్యాలతో తుర్కియే, సిరియా భూకంప ప్రభావ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతటి ఘోర మృత్యుకంపం ధాటికి ఇరుదేశాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తాజాగా 11,200 దాటేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎర్డోగన్ పర్యటన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హతే ప్రావిన్స్, కహ్రామన్మరాస్ పట్ణణం, భూకంప కేంద్రం గుర్తించిన పజార్సిక్ పట్టణాల్లో పర్యటించారు. క్షతగాత్రులతో నిండిన తాత్కాలిక ‘టెంటుల సిటీ’లో బాధితులతో మాట్లాడారు. ‘ఎవరినీ ఇలా వీధుల్లో వదిలేసి వెళ్లిపోము. అందరినీ ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. భూకంపం మిగిల్చిన విషాదం మొదలై రెండ్రోజులైన తర్వాత కహ్రామన్మరాస్ పట్టణంలో శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడు ఆరిఫ్ ఖాన్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదియామన్ సిటీలో పదేళ్ల బాలిక బీటల్ ఎడీస్‌ను కాపాడారు. A baby and his mother were rescued from the rubble after spending 55 hours in Turkey's Gaziantep. #TurkeyQuake#Turkiye #Turkiye#Turkey #TurkeySyriaEarthquake #TurkeyQuake #earthquakes #Syria #زلزال #زلزال_سوريا_تركيا #TurkeySyriaEarthquake pic.twitter.com/Kt5NFteETZ — Ali Cheema🔥🥀 (@ali_cheema10) February 8, 2023 కుప్పకూలిన వేలాది భవంతుల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న అన్వేషణకు గడ్డకట్టే చలి, మంచు పెద్ద అవరోధంగా మారాయి. తుర్కియేలోని మలాట్యా సిటీలో వీధి పొడవునా మృతదేహాలు ఉంచి మార్చురీ వాహనాల కోసం జనం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మైనస్ ఆరు డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో శిథిలాల్లో కొందరు చలికే గడ్డకట్టుకుని చనిపోయి ఉంటారని సహాయక సిబ్బందిలో ఒకరైన పికల్ వ్యాఖ్యానించారు. టర్కీ అత్యవసర సిబ్బందికి దాదాపు డజను దేశాల నుంచి ఆగమేఘాల మీద వచ్చేసిన సహాయక బృందాలు జతకలిసి బాధితుల అన్వేషణలో బిజీగా మారాయి. This video broke my heart 💔 The little girl says to the rescuer when he reaches her: Get me out from under this wreckage,sir,me and my sister, and I will become your slave.#earthquakeinturkey #Syria #هزه_ارضيه #زلزال #İstanbul #earthquake #Turkey #PrayForTurkey pic.twitter.com/U9mMrZdROM — Zuher Almosa (@AlmosaZuher) February 7, 2023 సిరియాలో పరిస్థితి దారుణం తుర్కియేతో సత్సంబంధాల కారణంగా చాలా దేశాలు తమ బృందాలను ఆ దేశానినికి పంపి సాయపడుతున్నాయి. కానీ, అంతర్యుద్దం, ద్వైపాక్షిక సంబంధాలు బొత్తిగాలేని సిరియాకు ఇతర దేశాల నుంచి సాయం సరిగా అందట్లేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీంతో శిథిలాల్లో బాధితుల ఆక్రందనలు అరణ్యరోదనలయ్యాయి. సిరియాను ఆదుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంపంతో ఆ దేశాల్లో 2.3 కోట్ల ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. A young Syrian boy smiled and started to play with rescue workers who pulled him from the rubble of a building that was destroyed following deadly earthquakes in Turkey and Syria pic.twitter.com/kM3Qt4UqvG — Reuters (@Reuters) February 8, 2023 భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన భారత్ మరో బృందాన్నీ తుర్కియేకి పంపనుంది. ‘తుర్కియేలో 11 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిలో ఒకరి జాడ తెలియాల్సిఉంది. మిగతావారు క్షేమం’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. మరోవైపు ఆరు టన్నుల సహాయక సామగ్రిని సిరియాకు భారత్ అందజేసింది. My heart goes out to the people of Turkey and Syria and all affected by the devastating Turkey-Syria earthquake. The death toll continues to grow in Turkey and northern Syria where two powerful earthquakes destroyed buildings and left some villages in total rubble. 🙏💔 pic.twitter.com/Gv8ZGnvBHw — Maha Mehanna (@MahaMehanna) February 7, 2023 -
సిరియా ఆస్పత్రిపై రాకెట్ దాడులు.. 13 మంది మృతి
బీరూట్: సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో ఉన్న అల్–షైఫా ఆస్పత్రిపై రాకెట్ బాంబులతో దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందినట్లు ఆ దేశం వెల్లడించింది. దీనిపై హతాయ్ ప్రావిన్స్ గవర్నర్ స్పందిస్తూ ఆస్పత్రిపై శనివారం రెండు రాకెట్ బాంబులతో దాడి జరిగిందని, అందులో 13 మంది మరణించడంతోపాటు 27 మంది గాయపడ్డారని ధృవీకరించారు. సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ మాత్రం మొత్తం 18 మంది మరణించినట్లు పేర్కొంది. మరణించినవారిలో ఇద్దరు మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నట్లు పేర్కొంది. దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జరీ, ప్రసూతి విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆస్పత్రిని మూసేసినట్లు తెలిపింది. కుర్దులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని 2018లో టర్కీ–సిరియా బలగాలు కలసి అదుపులోకి తీసుకున్నాయి. దీంతో కుర్దిష్‌లు అక్కడ మైనారిటీలుగా మారడంతో పాటు మిలిటెన్సీ వైపు అడుగులు వేయడంతో ప్రభుత్వానికి, కుర్దిష్‌లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుర్దులే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపిస్తుంది. కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ నేత మజ్లోమ్ అబాది ఈ ఘటనను ఖండించారు. తాము ఈ ఘటనకు పాల్పడలేదని తెలిపారు. -
ఐఎస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్‌ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్ అబ్దుల్(40), ఇర్ఫాన్ నజీర్(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్‌లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. జహన్‌జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్‌ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్, నాసిర్‌లను గుర్తించారు. వీరు హిజ్బ్ ఉత్ తహ్రీర్(హుట్)లో సభ్యులు. వీరు ఖురాన్ సర్కిల్ అనే మాడ్యూల్‌ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్‌కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్ హుట్ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్‌లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్, నాజిర్ నిధులు సమకూర్చారు. (చదవండి: ‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!’) కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు. -
అమెరికా దాడిలో వందలాది మంది మృతి!
డమాస్కస్: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో వందలాది మంది మృతి చెందారని సిరియా సైన్యం వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా డెయిర్ ఇజ్-జోర్పై సంకీర్ణ సేనలు బుధవారం జరిపిన ఈ దాడిలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మృతి చెందారని సిరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్మీ జనరల్ కమాండ్ పేరుతో వెల్లడించిన ప్రకటనలో.. అమెరికా సేనల దాడిలో హాల్టా గ్రామం వద్ద భారీగా విష రసాయనాలు విడుదలయ్యాయని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్న వందలాది మంది పౌరులు మృతి చెందారని వెల్లడించింది. విష వాయువుల వల్ల ఊపిరాడకపోవడం మూలంగా వీరంతా మృతి చెందారని సిరియా సైన్యం పేర్కొంది. కాగా.. సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ సిరియన్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల భారీ సంఖ్యలో క్షిపణులతో అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందారు. -
బాంబు దాడుల్లో 45 మంది మృతి
డమాస్కస్: సిరియా మరోసారి బాంబు దాడులతో అట్టుడికింది. రాజధాని డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని సయిదా జీనాబ్ ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 45 మంది మృతి చెందినట్లు సిరియన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శక్తిమంతమైన పేలుళ్లు జరిగిన ప్రాంతంలోని సమీప భవనాలు, కార్లు ధ్వంసమైన దృశ్యాలను సిరియన్ స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. సిరియా ప్రభుత్వ వర్గాలు ప్రతిపక్షాలతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్ను
లండన్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్‌స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అణ్వస్త్రాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలుకంటున్న ఐఎస్ ఉగ్రవాదులు ఇరాన్‌కు చెందిన అణ్వస్త్రాల రహస్యాలను చేజిక్కించుకోవడానికి పథకం వేసినట్టు వారి స్థావరాలనుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలద్వారా వెల్లడైంది. ఇరాన్‌పై దాడిచేసి ఆ దేశానికి చెందిన అణ్వస్త్ర రహస్యాలను హస్తగతం చేసుకోవాల్సిందిగా ఐఎస్ తమసభ్యులకు పిలుపునిచ్చిందని, ఈ సంస్థకు దిశానిర్దేశం చేస్తున్న ఆరుగురు సభ్యుల రహస్య వార్కేబినెట్కు చెందిన అబ్దుల్లా మెషేదాని ఈమేరకు తమ సభ్యులకు లేఖలు రాశాడని వెల్లడైంది. ఈ లేఖలు కూడా రహస్యసంకేత భాషలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐఎస్‌కు చెందిన ఓ కమాండర్ నివాసంపై ఇరాక్ ప్రత్యేక దళాలు గత మార్చిలో దాడి చేసిన సందర్భంగా ఈ పత్రాలు వెలుగుచూశాయుని సండేటైమ్స్ కథనం వెల్లడించింది. రష్యా సహకారంతో ఇరాన్ అణ్వస్త్రాలను సంపాదించి, అందుకు ప్రతిగా ఆ దేశానికి ఇరాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లో చమురు క్షేత్రాలను అప్పగించాలన్నది ఐఎస్ పథకమని తెలుస్తోంది. పాశ్చాత్యదేశాల నిపుణులు ఈ పత్రాలను పరిశీలించి అవి ఐఎస్ రహస్య పత్రాలుగా ధ్రువీకరించారని పేర్కొంది. 70 విధ్వంసకర పథకాల వివరాలు ఆ పత్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఖలీఫా సామ్రాజ్యస్థాపనలో భాగంగా నాజీల తరహా పద్ధతులు అవలంబించాలని అందులో పేర్కొన్నారు. కాగా సిద్ధాంతాల విషయుంలో కట్టుతప్పితే స్వంత నాయుకులను కూడా వుట్టుపెట్టడానికి వెనుకాడవద్దని ఆ పత్రాల్లో మెషేదాని సూచించినట్టు వెల్లడైంది. యెమెన్, కేమరూన్ దేశాలనుంచి కొన్ని దీవులను కొని వాటిలో మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేయుడానికీ ఐఎస్ ప్రయుత్నించినట్టు వెల్లడైంది. ఐఎస్‌తో పాక్ తాలిబన్ల దోస్తీ... ఇప్పటివరకూ ఒంటరిగానే చెలరేగిపోతున్న ఐఎస్ ఉగ్రవాదులకు ఇప్పుడు పాక్‌తాలిబన్లు తోడవనున్నారు. ఇరాక్, సిరియూల్లో పట్టు సంపాదించుకున్న ఐస్లామిక్స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్టు పాక్‌లోని తాలిబన్ సంస్థ తెహ్రీకే తాలిబన్ (టీటీపీ)ప్రకటించింది. ఐఎస్‌కు అండగా తమ మనుషులను పంపుతామని పాక్ తాలిబన్ అధినేత ముల్లా ఫజలుల్లా తెలిపారు. -
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. -
బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. ఐఎస్ ఇటీవల పాశ్చాత్య దేశాల పౌరులను చంపడం ఇది నాలుగోసారి. కాగా, ఐఎస్ మిలిటెంట్లు తమవద్ద బందీగా ఉన్న పీటర్ కేసింగ్ అనే అమెరికన్‌కు శిర చ్ఛేదం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ‘ఒబామా! సిరియాలోని షామ్లో మాపై దాడులు చేస్తున్నావు. అందుకు ప్రతీకారంగా మీ పౌరులను నరికి చంపుతాం’ అని హెచ్చరించారు. అలెన్ హత్యను ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా ఖండించారు. హంతకులను పట్టుకుంటామని ప్రతినబూనారు. కేసింగ్‌ను రక్షించడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని అమెరికా అధికారులు చెప్పారు. -
వైమానిక దాడులతో వారిని నిర్మూలించలేము!
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూపు (ఐఎస్) అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అని, కేవలం వైమానిక దాడులతోనే దాన్ని నిర్మూలించలేమని ఇరాన్ పేర్కొంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బెడద ఎదుర్కొనడంలో మిత్రులకు తగిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టంచేసింది. విమానాలతో బాంబుల వర్షం కురిపించినంత మాత్రాన ఇస్లామిక్ మిలిటెంట్ల నిర్మూలన సాధ్యంకాదని, అధునాతనమైన ఈ ఉగ్రవాద సంస్థ బెడద నిర్మూలనకు కొత్త సాధనాలు అవసరమని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మిత్రులకు తగిన మద్దతు ఇచ్చేందుకు ఇరాన్ ఏమాత్రం సందేహించబోదన్నారు. ’ఇది ఏ ఒక్క మతానికో, ప్రాంతానికో సంబంధించిన ముప్పు కాదు. ఇరాక్కో, సిరియాకో పరిమితమైనది కాదని' ఆయన తెలిపారు. -
బ్రిటన్‌లో ‘ఉగ్ర’ అలర్ట్
ముంబై తరహా దాడులకు జిహాదీల ప్లాన్! లండన్: బ్రిటన్‌కు చెందిన సుమారు 250 మంది జీహాదీలు సిరియా మారణకాండలో పాల్గొని అనంతరం స్వదేశానికి చేరుకున్నారనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఉగ్ర అలర్ట్ ప్రకటించి నట్టు స్థానిక పత్రిక ‘సండే టైమ్స్’ వెల్లడించింది. వీరంతా ముంబై తరహాలో బ్రిటన్‌లో కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోందని ఆదివారం నాటి కథనం పేర్కొం ది. బ్రిటన్ చేరుకున్న వారిలో నిపుణులైన ఉగ్రవాదులు సైతం ఉండొచ్చని ప్రభుత్వం అనుమానిస్తోందని, ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిందని తెలిపింది. జిహాదీల ప్రవేశంపై ముందస్తు సమాచారమున్న పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు పటిష్ట చర్యలకు దిగారని, భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లు, కాల్పు ల తరహా దాడులకు జిహాదీలు పాల్పడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే లండన్‌ను లక్ష్యంగా ఎంచుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
రసాయన ఆయుధాలు వాడితే ఊరుకోం
వాషింగ్టన్/లండన్: సిరియా ప్రభుత్వ బలగాలు పౌరులపై రసాయన ఆయుధాలతో దాడి చేసినట్లు తేలితే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా, బ్రిటన్లు హెచ్చరించాయి. సిరియాలో రసాయన దాడి జరిగిందని, 1,300 మంది చనిపోయారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌లు శనివారం ఫోన్లో గంటపాటు చర్చలు జరిపారు. సిరియా బలగాలు రసాయన దాడికి పాల్పడినట్లు బలమైన సంకేతాలు వస్తున్నట్లు ఇద్దరూ అభిప్రాయపడ్డారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా, సిరియన్లపై రసాయన దాడి జరిపింది ఆ దేశ సైన్యమేనని ఆధారాలను బట్టి తెలుస్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ పేర్కొన్నారు. సిరియాలోని రసాయన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలను కోరింది. మరోపక్క.. సిరియాపై అమెరికా సైనిక చర్యకు దిగితే దారుణ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. సిరియాపై సైనిక దాడిని వ్యతిరేకించాలని సీపీఎం.. భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, అమెరికా నేవీ బలగాలు ఆదివారం సిరియా తీరానికి మరింత చేరువగా వచ్చాయి. కాగా, డమాస్కస్‌లో రసాయన దాడిపై నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేయడానికి ఐరాస తనిఖీ బృందానికి సిరియా ప్రభుత్వం అనుమతినిచ్చింది. రామేశ్వరం తీరంలో ఏపీ యువకుడి నిర్బంధం రామేశ్వరం: అనుమానాస్పదంగా రామేశ్వరం తీరంలో సంచరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీరంలో గస్తీ నిర్వహిస్తున్న క్యూ బ్రాంచ్ పోలీసులు పిశాసు మునై(దయ్యాల స్థానం) వద్ద గోపి(32) అనే వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద సెల్ఫోన్లో భారీగా ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. పొంతనలేని జవాబులు చెబుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీలంక నుంచి 8 మంది ఉగ్రవాదులు పాక్ జలసంధి ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు పథకం వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.