వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.
మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం
Comments
Please login to add a commentAdd a comment