సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదేపదే హెచ్చరించింది.
‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది.
צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה.
— צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024
צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH
హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమంతిచబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్‌లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్‌లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment