బ్రిటన్‌కు చెందిన సుమారు 250 మంది జీహాదీలు సిరియా మారణకాండలో పాల్గొని అనంతరం స్వదేశానికి చేరుకున్నారనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఉగ్ర అలర్ట్ ప్రకటించి నట్టు స్థానిక పత్రిక ‘సండే టైమ్స్’ వెల్లడించింది.
ముంబై తరహా దాడులకు జిహాదీల ప్లాన్!
లండన్: బ్రిటన్‌కు చెందిన సుమారు 250 మంది జీహాదీలు సిరియా మారణకాండలో పాల్గొని అనంతరం స్వదేశానికి చేరుకున్నారనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఉగ్ర అలర్ట్ ప్రకటించి నట్టు స్థానిక పత్రిక ‘సండే టైమ్స్’ వెల్లడించింది. వీరంతా ముంబై తరహాలో బ్రిటన్‌లో కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోందని ఆదివారం నాటి కథనం పేర్కొం ది. బ్రిటన్ చేరుకున్న వారిలో నిపుణులైన ఉగ్రవాదులు సైతం ఉండొచ్చని ప్రభుత్వం అనుమానిస్తోందని, ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిందని తెలిపింది. జిహాదీల ప్రవేశంపై ముందస్తు సమాచారమున్న పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు పటిష్ట చర్యలకు దిగారని, భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లు, కాల్పు ల తరహా దాడులకు జిహాదీలు పాల్పడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే లండన్‌ను లక్ష్యంగా ఎంచుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.