వాషింగ్టన్/లండన్: సిరియా ప్రభుత్వ బలగాలు పౌరులపై రసాయన ఆయుధాలతో దాడి చేసినట్లు తేలితే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా, బ్రిటన్‌లు హెచ్చరించాయి. సిరియాలో రసాయన దాడి జరిగిందని, 1,300 మంది చనిపోయారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌లు శనివారం ఫోన్లో గంటపాటు చర్చలు జరిపారు. సిరియా బలగాలు రసాయన దాడికి పాల్పడినట్లు బలమైన సంకేతాలు వస్తున్నట్లు ఇద్దరూ అభిప్రాయపడ్డారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా, సిరియన్లపై రసాయన దాడి జరిపింది ఆ దేశ సైన్యమేనని ఆధారాలను బట్టి తెలుస్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ పేర్కొన్నారు.
సిరియాలోని రసాయన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలను కోరింది. మరోపక్క.. సిరియాపై అమెరికా సైనిక చర్యకు దిగితే దారుణ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. సిరియాపై సైనిక దాడిని వ్యతిరేకించాలని సీపీఎం.. భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, అమెరికా నేవీ బలగాలు ఆదివారం సిరియా తీరానికి మరింత చేరువగా వచ్చాయి. కాగా, డమాస్కస్‌లో రసాయన దాడిపై నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేయడానికి ఐరాస తనిఖీ బృందానికి సిరియా ప్రభుత్వం అనుమతినిచ్చింది.
రామేశ్వరం తీరంలో ఏపీ యువకుడి నిర్బంధం
రామేశ్వరం: అనుమానాస్పదంగా రామేశ్వరం తీరంలో సంచరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీరంలో గస్తీ నిర్వహిస్తున్న క్యూ బ్రాంచ్ పోలీసులు పిశాసు మునై(దయ్యాల స్థానం) వద్ద గోపి(32) అనే వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద సెల్‌ఫోన్‌లో భారీగా ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. పొంతనలేని జవాబులు చెబుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీలంక నుంచి 8 మంది ఉగ్రవాదులు పాక్ జలసంధి ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు పథకం వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రసాయన ఆయుధాలు వాడితే ఊరుకోం
Published Mon, Aug 26 2013 1:36 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement