వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూపు (ఐఎస్) అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అని, కేవలం వైమానిక దాడులతోనే దాన్ని నిర్మూలించలేమని ఇరాన్ పేర్కొంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బెడద ఎదుర్కొనడంలో మిత్రులకు తగిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టంచేసింది. విమానాలతో బాంబుల వర్షం కురిపించినంత మాత్రాన ఇస్లామిక్ మిలిటెంట్ల నిర్మూలన సాధ్యంకాదని, అధునాతనమైన ఈ ఉగ్రవాద సంస్థ బెడద నిర్మూలనకు కొత్త సాధనాలు అవసరమని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో మిత్రులకు తగిన మద్దతు ఇచ్చేందుకు ఇరాన్ ఏమాత్రం సందేహించబోదన్నారు. ’ఇది ఏ ఒక్క మతానికో, ప్రాంతానికో సంబంధించిన ముప్పు కాదు. ఇరాక్‌కో, సిరియాకో పరిమితమైనది కాదని' ఆయన తెలిపారు.