ఐఎస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌ | NIA Busts IS module in Bengaluru Two People Arrested | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 8 2020 6:24 PM | Last Updated on Thu, Oct 8 2020 6:34 PM

NIA Busts IS module in Bengaluru Two People Arrested - Sakshi

బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇస్లామిక్‌ స్టేట్‌ మాడ్యూల్‌ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్‌ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్‌ అబ్దుల్‌(40), ఇర్ఫాన్‌ నజీర్‌(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్‌లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్‌లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్‌ఐఏ తెలిపింది. జహన్‌జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్‌ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్‌ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్‌, నాసిర్‌లను గుర్తించారు. వీరు హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌(హుట్‌)లో సభ్యులు. వీరు ఖురాన్‌ సర్కిల్‌ అనే మాడ్యూల్‌ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్‌కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్‌ హుట్‌ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్‌ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్‌లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్‌, నాజిర్‌ నిధులు సమకూర్చారు. (చదవండి: వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ బాసిత్‌ సృష్టే!)

కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్‌ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement