న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్‌ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఎన్‌ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment