five states
-
Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య -
తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు..!
-
తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?
ఈ ఏడాది చివర్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తారా? డిసెంబరులో జరగాల్సి ఉన్న తెలంగాణా ఎన్నికలు కూడా అప్పుడే జరుగుతాయా? దీనికి సంబంధించి ఈ నెల 18 నుండి 22 వరకు జరగబోయే పార్లమెంటుప్రత్యేక సమావేశాల్లో క్లారిటీ వస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లే. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయని ఇంతవరకు అందరూ భావిస్తున్నారు. వచ్చే అక్టోబరు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ఎన్నికల నగారా మోగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణాతో పాటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకూ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తెలంగాణాకు డిసెంబరులో ఎన్నికలు జరగాలంటే అక్టోబరు 10 లోపు నోటిఫికేషన్ విడుదల కావాలి. 2024 ఏప్రిల్ మే నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఈ డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది తాజాగా వస్తోన్న ప్రచారం. జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించుకోవడం కోసమే ఈ నెల 18 నుండి అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వర్గాల నుండి కేటీయార్ కు ఏదైనా సమాచారం అంది ఉండచ్చని భావిస్తున్నారు. 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిశా,అరుణాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణా,రాజస్థాన్,మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, మిజోరం ఎన్నికలు కూడా జరుగుతాయని అనుమానిస్తున్నారు. అంటే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు ఉంటాయన్నది రాజకీయ పండితుల జోస్యం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీ తెలంగాణాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ విధంగా 2019 ఏప్రిల్ లో జరగాల్సిన తెలంగాణా ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. జమిలి ఎన్నికల ఆలోచన దృష్ట్యా ఈ సారి తెలంగాణా ఎన్నికలు షెడ్యూలు కన్నా నాలుగైదు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: జమిలికి బీఆర్ఎస్ సిద్ధమేనా? -
మరోసారి పోరుబాట పట్టిన అన్నదాతలు
-
ఐదు రాష్ట్రాల్లో రూ.64 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం నియమించిన అధికారులు జరిపిన దాడుల్లో జనవరి 17 వరకు రూ.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ. 56.04 కోట్లు యూపీలో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లను పట్టుకున్నారు. పంజాబ్‌లో రూ.1.78 కోట్లు విలువైన మత్తు పదార్థాలను, గోవాలో రూ.16.72 లక్షల నగదును, మణిపూర్‌లో రూ.7 లక్షల సొమ్ముని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేసినట్లు ఎన్నికలసంఘం తెలిపింది. పంజాబ్‌లోని మొహలీలో ముగ్గురి వద్ద రూ.22 కోట్లు విలువైన 160 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పాంచ్ పటాకా..
-
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధం కండి!
-
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధంకండి!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ పోల్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధంగా ఉండాలని సూచించింది. షెడ్యూల్ ప్రకటన రాగానే ప్రవర్తన నియమావళి అమలుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల కేబినెట్ కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. జనవరి 4వ తేదీన ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలుగా యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒకరోజు ఎన్నికల జరగనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిబంధనల జాబితాను జారీ చేసింది. ప్రచారం కోసం అధికారిక వాహనాల ఉపయోగాన్ని తొలగింపు, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు నుంచి రాజకీయ కార్యనిర్వాహకుల చిత్రాలు తొలగింపు, అధికారి పార్టీ ప్రకటనలకు ప్రజాధనం వాడకంపై నిషేధం తదితర నిబంధనలను పంపించింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రీ-యోగ్యతకు సంబంధించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు గుర్తు చేసింది. కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ మే 27తో, మిగిలిన నాలుగురాష్ట్రాల అసెంబ్లీ గుడువు మార్చితో ముగియనున్న సంగతి తెలిసిందే. -
ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!
-
ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లకు ఒకేసారి శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఒకేరోజులో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే అవకాశముంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఓటమి తప్పదని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల సర్వే వెల్లడించింది. ఇక పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్‌కు షాక్ తప్పదని, బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని సర్వేలో తేలింది. -
3,500 పోటీ చేస్తే 9 మంది గెలిచారు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారికి నిరాశే మిగిలింది. మొత్తం 3,500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో విజయం సాధించింది కేవలం 9 మందే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గెలిచిన 9 మందిలో ఒక్క కేరళ నుంచే ఆరుగురు విజయం సాధించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు గెలుపొందారు. తమినాడు నుంచి ఒక్కరూ గెలవకపోవడం గమనార్హం. 3,500 మందిలో కేరళ నుంచి 782, అస్సాం నుంచి 711, పశ్చిమ బెంగాల్ నుంచి 371, పుదుచ్చేరి నుంచి 96 మంది రంగంలోకి దిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తం 822 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్లో 2.2 శాతం, తమిళనాడులో 1.4 శాతం, కేరళలో 5.3 శాతం, అస్సాంలో 11 శాతం, పుదుచ్చేరిలో 7.9 శాతం ఓట్లను పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 2,556 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా అందులో ఏడుగురు విజయం సాధించారు. -
ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
- తమిళనాడులో తేలని పొత్తులు... - అస్సాంలో ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి - కేరళ బరిలో క్రికెటర్ శ్రీశాంత్? చెన్నై, గౌహతి, కోల్‌కతా, తిరువనంతపురం: తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో పొత్తులపై ఇంకా సస్పెన్ష్ కొనసాగుతుండగా... బెంగాల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కేరళలో రెండు ప్రధాన కూటమిలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటుండగా...అస్సాంలో ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ నుంచి క్రికెటర్ శ్రీశాంత్ పోటీ! క్రికెటర్ శ్రీశాంత్‌ను కేరళ ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బుధవారం వివరాలు వెల్లడిస్తానని శ్రీశాంత్ తెలిపారు. ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నేత ఫోన్లో తమను సంప్రదించారని, అమిత్ షా కేరళ వచ్చినప్పుడు శ్రీశాంత్ ఆయనను కలుస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కేరళ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున అభ్యర్థుల్ని పోటీకి పెడుతున్నట్లు జయలలిత ప్రకటించారు. పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు తమిళనాడుకు అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం సాయంత్రం చెన్నైలో పర్యటించనున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీనియర్ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతారని పార్టీనేతలు తెలిపారు. చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థిగా సేలం దేవి అనే హిజ్రా పోటీ చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. బెంగాల్‌లోని హింసాత్మక కేంద్రాల్లో నిఘా కెమెరాలు బెంగాల్‌లోని సున్నిత, హింసాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో 14 వేల సున్నిత ప్రాంతాల్ని గుర్తించామని అధికారులు మంగళవారం చెప్పారు. నిజాయతీకి మారుపేరుగా చెప్పుకుంటున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవినీతికి చిహ్నంగా మారారని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. నారద స్టింగ్ ఆపరేషన్‌పై విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అస్సాంలో ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి అస్సాంలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ ఆధ్వర్యంలోని బృందం రెండు రోజుల పాటు అస్సాంలో పర్యటించింది. నల్లధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా కేంద్ర బలగాల్ని సమర్ధంగా వినియోగించుకోవాలని అధికారులకు జైదీ సూచించారు. సోమవారం వరకు రూ.7.12 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమిళనాడులో మార్చి 20వ తేదీ వరకూ రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. -
5 రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలు స్వాధీనం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, వినియోగదారుల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.విశ్వనాథ్ మీడియాకు వివరించారు. ఇప్పటికే కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరడంతో దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమైన విషయం తెలిసిందే. అక్రమంగా నిల్వలు, కృతిమ కొరత సృష్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని... అరెస్టులకు కూడా వెనుకడమని చెప్పారు. గత కొద్ది నెలలగా జరిపిన దాడుల్లో ఐదు రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యాధికంగా 2549 టన్నులు, మధ్యప్రదేశ్ నుంచి 2295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీగా పప్పు ధాన్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా దాడులను కొనసాగిస్తున్నామని... దీనివల్ల ధరలు కొంత వరకు నియంత్రించగలిగామని చెప్పారు. ఎప్పుటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ పంట దిగుబడులు పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటున్నామని...త్వరలోనే ధరలను నియంత్రిస్తామని విశ్వనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌కు పరాజయం తప్పదంటున్న ఎగ్జిట్ పోల్స్
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఐదు రాష్ట్రాలకు శాసన ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. చత్తీస్‌గడ్‌లో నవంబర్ 11, 19న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న, రాజస్థాన్‌లో డిసెంబర్ 1న, మిజోరాం, ఢిల్లీల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్‌గడ్‌లో రెండు దశల్లో ఎన్నికల్ని నిర్వహిస్తుండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పూర్తి చేస్తారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం లక్షా 30 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా రానున్నఎన్నికల ఫలితాలు బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చని పలు సర్వేలు ఇటీవల వెల్లడించాయి.