తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? | One Nation, One Election: Will The Assembly Elections Of Five States Be Postponed - Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?.. వారం తర్వాతే క్లారిటీ!

Published Tue, Sep 12 2023 6:18 PM | Last Updated on Tue, Sep 12 2023 6:53 PM

Will The Assembly Elections Of Five States Be Postponed - Sakshi

ఈ ఏడాది చివర్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు  ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తారా? డిసెంబరులో జరగాల్సి ఉన్న తెలంగాణా ఎన్నికలు కూడా అప్పుడే జరుగుతాయా? దీనికి సంబంధించి ఈ నెల 18 నుండి 22 వరకు జరగబోయే పార్లమెంటుప్రత్యేక సమావేశాల్లో  క్లారిటీ వస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లే.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయని  ఇంతవరకు  అందరూ భావిస్తున్నారు. వచ్చే అక్టోబరు  రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ఎన్నికల నగారా మోగుతుందని  అంచనా వేస్తున్నారు. తెలంగాణాతో పాటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకూ ఎన్నికలు  జరగాల్సి ఉన్నాయి. తెలంగాణాకు డిసెంబరులో ఎన్నికలు జరగాలంటే  అక్టోబరు 10 లోపు నోటిఫికేషన్ విడుదల కావాలి.

2024 ఏప్రిల్ మే నెలల్లో  ఆంధ్ర ప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే   ఈ డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది తాజాగా వస్తోన్న ప్రచారం. జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును  ఆమోదించుకోవడం కోసమే  ఈ నెల 18 నుండి అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై  అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారు కూడా.

ఈ నేపథ్యంలోనే   ఢిల్లీ వర్గాల నుండి  కేటీయార్ కు ఏదైనా సమాచారం అంది ఉండచ్చని భావిస్తున్నారు. 2024 ఏప్రిల్ లో  ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిశా,అరుణాచల ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణా,రాజస్థాన్,మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, మిజోరం ఎన్నికలు  కూడా జరుగుతాయని అనుమానిస్తున్నారు.  అంటే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు ఉంటాయన్నది రాజకీయ పండితుల జోస్యం.

2014లో రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీ తెలంగాణాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.  ఆ విధంగా 2019 ఏప్రిల్ లో జరగాల్సిన తెలంగాణా ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. జమిలి ఎన్నికల ఆలోచన దృష్ట్యా ఈ సారి తెలంగాణా ఎన్నికలు షెడ్యూలు కన్నా నాలుగైదు నెలలు ఆలస్యం అయ్యే  అవకాశాలున్నాయని  అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చదవండి: జమిలికి బీఆర్‌ఎస్‌ సిద్ధమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement